alphabets
-
కార్పొరేట్ జపం!
ఆల్ఫాబెట్స్‌లో చిట్టచివరి అక్షరమే అయినా.. కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలకిపుడు ‘జెడ్’ తొలి ప్రాధాన్యంగా మారుతోంది. జెన్ జెడ్ ఎఫెక్ట్ కావచ్చు... మరేదైనా కారణం కావచ్చు.. ‘జె’వ్రీథింగ్ ‘జెడ్’ అనేలా బ్రాండ్ బా‘జా’ మోగుతోంది. దశాబ్దకాలంగా జెడ్ కంపెనీల జోరు ఓ రేంజ్లో పెరుగుతూ వస్తోంది! కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 1,608 కంపెనీలు జెడ్ అక్షరంతో పురుడు పోసుకున్నాయి. 2018తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 70 శాతం ‘జూ’మ్ అయ్యింది. మొత్తంమీద ఏర్పాటవుతున్న కొత్త కంపెనీల సంఖ్య ఏటా 9 శాతం పెరుగుతుండగా.. జెడ్ కంపెనీల జోరు 11 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్ట్ నాటికే 1,493 కంపెనీలు జెడ్ అక్షరంతో ఆవిర్భవించడం గమనార్హం. పేరులో ‘జో’ష్ ఉంది... మన దేశంలో ఎవరికైనా.. దేనికైనా పేరు పెట్టడం అంటే పెద్ద ప్రహసనమే. వ్యక్తిగత అంశాల నుంచి, ఆచారాలు, మతాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం ఇలా చాలా విషయాలు ప్రభావం చూపుతుంటాయి. అయితే, కంపెనీలు పేర్లు ఖాయం చేయడంలో ఈ అంశాలకు తోడు బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్‌లు ఇతరత్రా బోలెడన్ని విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘మేము ఆట బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పడు ఏదైనా సరదాగా ఉండే పేరు కోసం బుర్రబద్దలు కొట్టుకున్నాం. చివరకు జనాల నోళ్లలో నానేలా జిగ్‌మ్యాగ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరును నిర్ణయించాం’ అని ముంబైకి చెందిన హేతల్ సంగానీ చెబుతున్నారు. వాస్తవానికి జిగ్‌జాగ్ అని పెడదామనుకున్నా.. అది అప్పటికే వేరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో జిగ్మ్యాగ్ను ఎంచుకోవాల్సి వచి్చందని ఆయన పేర్కొన్నారు. బ్రాండ్ పేరు పలికేటప్పుడు ఒకరకమైన జోష్ ఉండాలని కొత్తతరం ఎంట్రప్రెన్యూర్స్ కోరుకుంటున్నారు. బోరింగ్‌గా, పాత వాసనలతో ఉండకూడదనేది వారి అభిప్రాయం. ‘ఈ రోజుల్లో ప్రమోటర్లు పేర్లను ఎంచుకునేటప్పుడు క్యాచీగా, ప్రత్యేకంగా, ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. ఆ్రస్టాలజీ, న్యూమరాలజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆల్ఫాబెట్స్‌లో ‘ఏ’ అక్షరంతో కంపెనీలకు కొదవలేదు. దీంతో చివరిదైన జడ్‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది’ అని కంపెనీ సెక్రటరీ ఎస్ఎస్ విశ్వనాథన్ తెలిపారు. 1992లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర నెలకొల్పిన ‘జీ టీవీ’ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు! ఇక కొత్తగా నెలకొలి్పన ‘జీ5’ ఓటీటీ కూడా బంపర్ హిట్టే!!‘జెడ్’ ఫ్యాక్టర్!డిస్కౌంట్ బ్రోకరేజీగా ఆరంభమైన ‘జెరోధా’ ఇప్పుడు దేశంలో టాప్ బ్రోకింగ్ కంపెనీగా ఎదగడంలో జెడ్ ఫ్యాక్టర్ కూడా బాగానే పని చేసిందని చెప్పొచ్చు. క్విక్ కామర్స్ సంచలనం జెప్టో పేరు కూడా మార్మోగుతోంది. జీలక్స్ ఫ్యాషన్స్, జెనెర్జీ ఫుడ్స్, జోల్డ్ అకాడమీ, జోబుల్ ఈస్టోర్, జాయిడ్ ఏఐ, జెలో టెక్నాలజీస్, జిమన్స్ టూర్స్, జోఫర్స్, జింబర్ ఇండియా, జూజూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, జప్నోసిస్, జెన్నెక్ట్స్ ఇండియా ఇవన్నీ ఇటీవలి జెడ్ మేనియాలో జస్ట్ చిన్న లిస్ట్ మాత్రమే! ‘ఆల్ఫాబెట్స్‌లో కొన్ని పలికేందుకే కాదు.. వినేందుకు కూడా చాలా సొగసుగా ఉంటాయి. అలాంటి వాటిలో జెడ్ లేదా జీ కూడా ఒకటి. అంతేకాదు, నవతరం జెన్ జెడ్‌కు కూడా ఇది భలే కనెక్ట్ అవుతోంది. మరీ పెద్దగా కాకుండా నాలుగు అక్షరాలలోపు ఉండేవి పంచింగ్‌గా ఉంటాయి’ అంటున్నారు బ్రాండ్ స్ట్రాటజీ స్పెషలిస్ట్ హరీష్ బిజూర్. జాప్, జారా, జీల్, జీబ్రా, జీ, జెన్, జెనిత్, జెస్ట్, జెటా, జియస్, జిలియన్, జింగ్, జియాన్, జూమ్ వంటివి వీటిలో కొన్ని.జెడ్ = 8ఇక న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) పరంగా కూడా జెడ్ అక్షరానికి విశిష్టత ఉందంటున్నారు నిపుణులు. జెడ్ అనేది 8 అంకెను సూచిస్తుందని... భౌతిక శక్తి, స్థిరత్వం, పరివర్తనను ఇది చాటిచెబుతుందనేది న్యూమరాలజిస్టుల మాట! దీని ఆకారం విషయానికొస్తే.. జిగ్‌జాగ్ షేపు అనేది వినూత్నత, ఆధునికతకు చిహ్నంగా ఉంటుందని.. నవతరానికి, బ్రాండింగ్, సోషల్ మీడియాలో గుర్తింపునకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుందని బ్రాండింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం (ఆ్రస్టాలజీ) సంగతి చూస్తే... జెడ్ అక్షరంపై గురుడు లేదా బృహస్పతి గ్రహ బలం అధికంగా ఉంటుందని గుజరాత్‌కు చెందిన ఆ్రస్టాలజర్ మనీష్ భట్ చెబుతున్నారు. ‘ప్రస్తుతం గ్రహాల కదలికలు... జెడ్ అక్షరం వాడకంపై చాలా సానుకూల ప్రభావం చూపుతున్నాయి’ అని భట్ వ్యాఖ్యానించారు!జెరోధా... జోహో.. జొమాటో.. జూడియో.. జెప్టో... జాగిల్ ప్రీపెయిడ్.. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది! అయితే ఏంటంటరా? జెన్ జెడ్ మేనియాతో జెడ్ (జీ) నామజపం జోరందుకుంది. జెడ్ అక్షరంతో మొదలయ్యే బ్రాండ్లు, కంపెనీల సంఖ్య ఏటికేడు ఎగబాకుతుండటమే దీనికి నిదర్శనం. పలకడానికి ఈజీగా, వినసొంపుగా... బ్రాండ్ నేమ్ కూడా ఎఫెక్టివ్‌గా ఉండటంతో వీటికి ప్రాచుర్యం పెరుగుతోంది. అంతేకాదు.. ఇటీవల జెడ్ అక్షరంతో వచ్చిన పలు బ్రాండ్లు బిజినెస్ హిట్ కొట్టి.. ఆయా రంగాల్లో జనాలకు చిరపరిచితంగా కూడా మారిపోవడం విశేషం!! -
కొన్ని ఆల్ఫాబెట్స్‌తో ఆస్టియోపోరోసిస్ నివారణ ఇలా!
ఆస్టియోపోరోసిస్ కేసులు భారతీయుల్లో చాలా ఎక్కువ. అందునా మహిళల్లో! యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని బట్టే మన దేశంలో దాని తీవ్రత ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మెనోపాజ్ దాటాక కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన కేసులు కనిపిస్తాయి. కొన్ని ఆల్ఫాబెట్స్ సాయంతో ఆస్టియోపోరోసిస్‌ను తేలిగ్గా నివారించుకోవచ్చు. సీ, డీ, ఈ, ఎఫ్, జీ...లతో నివారణ ఎలాగంటే...? ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం అవసరమైన ప్రాథమిక అంశాలను చాలా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ,డీ,ఈ,ఎఫ్,జీ గుర్తు పెట్టుకుంటే, వాటిని బట్టి ఏంచేయాలో సులువుగా తెలుస్తుంది. ‘సి’ ఫర్ క్యాల్షియమ్ – దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. ‘డి’ ఫర్ విటమిన్ డి – తగినంత అందేలా చూడాలి. ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’–ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్రూమ్ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – ఒకవేళ మరీ అండర్ వెయిట్ ఉంటే ఎత్తుకు తగినట్లుగా బరువు పెరగాలి. బరువు ఎక్కువ ఉంటే తగ్గాలి. -
వర్ణమాల నేర్పడం ఓ ప్రయోగం!
చిన్నమెదళ్ళపై ఒక పెద్ద ప్రయోగమే వర్ణమాల! దగ్గర దగ్గర పోలికలు గల అక్షరాలు ఉండడం వల్ల అభ్యసన క్రమంలో గుర్తించటం... కొందరికి కష్టంగానూ, మరికొందరికి ఇష్టంగానూ, ఇంకొం దరికి గందరగోళంగానూ ఉంటుంది. నేర్చుకోవ డానికి కొందరికి 6 మాసాలు పడితే మరి కొందరికి ఒక ఏడాది కాలం పడుతుంది. ఇంకొం దరికైతే అది ఒక సాహసం లాంటిది. అక్షరాలను గుర్తుపట్టలేక పాఠశాలకు ఎగనామం పెట్టే విద్యా ర్థులు కూడా ఉంటారు, ఉన్నారు కూడా. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో నమోదు అయిన విద్యార్థి ఏయే అంశాలు పూర్తిస్థాయిలో నేర్చుకున్నాడు, ఆ విద్యార్థి రెండవ తరగతికి అర్హుడా, కాదా అనేది ఆ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడి సలహాతో పని లేదా? ఒక ఏడాది కాలంలో ఒకటవ తరగతిలో విద్యార్థి నేర్చుకోవలసిన అంశాలు... వర్ణ మాల, ఒత్తులు, గుణింతాలు, పాఠ్య పుస్తకంలోని సంసిద్ధత పాఠాలు 7, నేర్చు కోవలసిన పాఠాలు 25. ఇది సులభమా? ఇదికాక విదేశీ బాష (ఆంగ్లం) నేర్పడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు, మూడవ తర గతి వచ్చేసరికి పరిసరాల విజ్ఞానం నేర్పడం... పై తరగతుల్లో హిందీ నేర్పడం... ఇవన్నీ కూడా ఉపాధ్యా యుడికి ఒక ప్రయోగం లాంటివే. ఉపాధ్యాయులకు ఏపీఈపీ, డీపీఈపీ, సీఎల్ఐపీ, సీఎల్ఏపీ, క్యూఐపీ, ఎన్‌ఐఎస్‌టీఏ, ఎఫ్ఎల్ఎన్ లాంటి శిక్షణలు ఎన్ని ఇచ్చినా నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) వంటివాటిల్లో వెల్లడైనట్లు... భాష సామర్థ్యాలలో ఎందుకు విద్యార్థులు వెనుకబడ్డారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. విద్యార్థులు నేర్చుకోవలసిన అంశాలను పూర్తి స్థాయిలలో నేర్చు కోకుండా ‘నో డిటెన్షన్ పాలసీ’ (ఎన్డీపీ) ఒక అవరోధంగా మారింది. ఎన్డీపీ ఉద్దేశం 1 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తర గతులకు ప్రమోట్ చేయడమే. విద్యార్థికి భాషా సామర్థ్యాలైన ఎల్ఎస్ ఆర్‌డబ్ల్యూపై అవగాహన ఉన్నదా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇందు మూలంగా విద్యార్థులకు నష్టం జరుగు తోంది. అసలు ఎన్డీపీ ఉద్దేశమే అక్షరాస్యత శాతం పెంచడం. 1వ తరగతి పూర్తి స్థాయిలో అభ్యసనం జరిగిన తరువాతే, రెండవ తరగతికి, అలాగే 8వ తరగతి వరకు ప్రమోట్ చెయ్యాలి. ఈ విధంగా చేయడం వలన పై తరగతుల విద్యను సులభంగా నేర్చుకోగులుగు తారు. అభ్యసనం సులభంగా ఉంటుంది. నేర్చుకోవడంలో తృప్తి, ఆనందం లభిస్తుంది. అభ్యసనంలో మెళకువలు తెలుస్తాయి. అప్పుడు ప్రతి అంశం సులువు అనిపిస్తుంది. మన తెలుగు వర్ణమాలతో పోల్చుకున్నప్పుడు ఆంగ్ల అక్షరములు నేర్చుకోవడం సులువు. మన తెలుగు వర్ణమాలలో ఉన్న ఒకే పోలికలతో ఉన్న అక్షరాలూ, ఒకే శబ్దంతో ఉన్న అక్షరాలూ, భిన్న శబ్దాలతో ఉన్న అక్షరాలూ పిల్లలు అర్థం చేసుకోడానికి ఇబ్బందిగా ఉంటాయి. లక్ష్య సాధనలో విద్యార్థి స్థాయికెళ్లి ఆలోచన చేస్తే, ఇది ఒక ప్రయోగం లాంటిది. పౌరులకు నాణ్యమైన విద్య అందించకపోతే, సమాజం మను గడ దిగజారి పోతుంది. ఉన్నత ప్రమాణాలతో వైద్యవిద్య, నేర్చుకొన్న వైద్యుడు రోగులను ఆరోగ్య వంతులుగా మారుస్తాడు. అలాగే ఒక ఇంజనీర్ అనేకమైన అద్భు తమైన కళాఖండాలను నిర్మిస్తాడు. ఉన్నత విద్యావంతుల మూలంగా నూతన పురోగతి సాధిస్తాం. శాస్త్ర వేత్తలూ, మేధావులూ, నాయకులను తయారు చేయగల సామర్థ్యం ఒక విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ప్రాథమిక స్థాయి విద్యను పటిష్టం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయడికి నేర్పవలసిన బాధ్యత ఎంతైతే ఉన్నదో విద్యార్థికి కూడ నేర్చుకోవలసిన బాధ్యత కూడా అంతే ఉన్నది. పాఠశాలలు నిర్మించి వాటి నిర్వహించడానికీ, ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికీ ప్రభు త్వాలు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. విద్యార్థి సర్వతోముఖా భివృద్ధికి తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఒక్కొక విద్యార్థిపై రూ. 1,50,000గా తేలింది. విద్యపై చేస్తున్న ఖర్చునూ, విద్యా ప్రమాణాలనూ దృష్టిలో పెట్టుకుని సమాజం, తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో తమ వంతు పాత్రను బాధ్యతతో నిర్వహించాలి. పిల్లలు నేర్చుకోవడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరిదీ! ఉయ్యాల ప్రసాదరావు వ్యాసకర్త సీనియర్ ఉపాధ్యాయుడు మొబైల్ : 80082 87954 -
గిడుగు రామ్మూర్తికి అక్షర నివాళి
మారీసుపేట: వ్యవహరిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడ్డుగు రామ్మూర్తి చిత్రాన్ని ‘అ’ నుంచి ‘ఱ’ వరకు వరుస క్రమంలో క్రమబద్ధంగా రాస్తూ చిత్రించినట్లు తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు ఫణీదపు వెంకటకృష్ణ ఆదివారం చెప్పారు. 11 అంగుళాల ఎత్తు, 10 అంగుళాల వెడల్పు ఉన్న చిత్రాన్ని రెండు గంటల్లో చిత్రించినట్లు తెలిపారు.