గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్‌కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది.
ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్‌కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి.
(చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!)
వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి.
(చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్)
Comments
Please login to add a commentAdd a comment