కాళ్ల వాపులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు కాళ్ల వాపులు రావడం చాలామందిలో చూస్తుంటాం. ఇది చాలా సాధారణమైన, హానికరం కాని సమస్య. ఓ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటే ఇది తగ్గిపోతుంది.
ఇక మన దేశంలోని మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. ఈ సమస్యవల్ల కాళ్ల వాపులు రావచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా కాళ్ల వాపులు వస్తుంటాయి. ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావాలతోనూ ఈ సమస్య రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారికి కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి. అంతగా ప్రమాదకరం కానివి మొదలుకొని కిడ్నీ సమస్యలూ, హార్ట్‌ఫెయిల్యూర్ వంటి సీరియస్ సమస్యల్లోనూ ఇవి వస్తుంటాయి. కాబట్టి... కాళ్లవాపులు కనిపించినప్పుడు వైద్య నిపుణుడిని సంప్రదించి కారణం ఏమిటో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించాలి. నిర్ధారణ జరిగాక, సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి.
(ఇది చదవండి: గుండెపోటు వస్తే కొందరిలో ఆకస్మిక మరణం ఎందుకు? కారణమేంటి?)
Comments
Please login to add a commentAdd a comment