legs pain problems
-
తిమ్మిర్లు.. అశ్రద్ధ చేస్తే అసలుకే ఎసరు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కాళ్లు, చేతులు నరాలు మొద్దుబారడం, స్పర్శ తెలియక పోవడం, మంటలు పుట్టడం వంటి సమస్యలను ఇటీవల కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఇది పెరిఫరల్ న్యూరోపతి అనే నరాల జబ్బుగా వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని తొలిదశలో గుర్తించడం ద్వారా మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, నయం చేయవచ్చునంటున్నారు. అశ్రద్ధ చేస్తే కాళ్లు, చేతులకు రక్తప్రసరణ తగ్గి, గాంగ్రీన్స్ ఏర్పడడం, చివరికి అవయవాలు కోల్పోవడం, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పెరిఫరల్ న్యూరోపతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటున్నారు. ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్న రోగులు పెరిఫరల్ న్యూరోపతి బాధితులు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ నిర్వహించే న్యూరాలజీ విభాగానికి ప్రతిరోజూ 250 నుంచి 300 మంది రోగులు వస్తుంటారు. వారిలో 15 నుంచి 20 శాతం పెరిఫరల్ న్యూరోపతి సమస్యకు గురైన వారు ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. అంటే రోజూ 50 మంది చొప్పున వారానికి 150 మంది వరకూ పెరిఫరల్ న్యూరోపతి బాధితులు వస్తున్నారు. వీరిలో సమస్య తీవ్రతరమైన తర్వాత వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది ఎవరికి వస్తుంది? ♦ జనాభాలో 2.4 శాతం మంది పెరిఫరల్ న్యూరోపతి సమస్యతో బాధపడుతున్నారు. ♦ మధుమేహుల్లో 70 శాతం మందికి వచ్చే అవకాశం ఉంది. ♦ వంశపారంపర్యంగా కూడా రావచ్చు ♦ రక్తనాళాల్లో తేడాలుంటే వచ్చే అవకాశం ఉంది. ♦ వయస్సు 55 ఏళ్లు నిండిన వారిలో రావచ్చు. ♦ క్యాన్సర్‌కు కీమోథెరఫీ పొందే వారిలో 40 శాతం మందిలో రావచ్చు. ♦ హెచ్ఐవీ/ఎయిడ్స్, టీబీ మందులు వాడే వారిలోనూ రావచ్చు. ♦ ఆల్కహాల్ సేవించే వారిలో, లెప్రసీ ఉన్న వారిలో కూడా రావచ్చు. ♦ కొందరికి స్పష్టమైన కారణం లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంది. ♦ నరాల తిమ్మిర్లు, మంటలు అనేవి కొందరిలో తాత్కాలికంగా కలిగి తగ్గిపోతే, మరికొందరికి దీర్ఘకాలంగా ఉంటూ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాధి దుష్ఫలితాలివే... ► పెరిఫరల్ న్యూరోపతి ఉన్న కొందరిలో కండరాలు బిగుసుకుపోవడం, కండరాల అదురు, వణుకు కూడా ఉండవచ్చు. ► ఈ వ్యాధి సోకిన వారిలో కొందరిలో కండరాల బలహీనత, కండరాల క్షీణత, నడవడంలో ఇబ్బంది కూడా కలుగుతాయి. ► నడస్తూ ఉంటే స్పర్శ తెలియకుండా అవుతుంది. ► కొందరికి స్పర్శ తెలియకపోవడం, పాదం గాని, చేయిగాని, వేలు కానీ వంచితే ఎటు పక్కకి వంచారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ► కొందరిలో చెమటలు ఎక్కువగా పట్టడం, మరికొందరిలో తక్కువగా పట్టడం, నిల్చుంటే కళ్లు తిరగడం జరుగుతుంది. ► కంటినీరు, లాలాజలం తయారు కాదు. ► పురుషుల్లో లైంగిక పటుత్వం కూడా తగ్గే అవకాశం ఉంది. ► మూత్రకోశం, మలం పేగు అ«దీనంలో లేకుండా తయారవుతాయి. ► కంటిరెప్పలు పడిపోవడం, కంటి దగ్గర స్పర్శ తెలియకుండా పోతాయి. ► మూతి వంకర పోవడం కూడా జరగవచ్చు. వ్యాధిపై అవగాహన అవసరం పదేళ్లకు పైగా మధుమేహం ఉన్న వారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ లోపం, కిడ్నీ ఫెయిల్యూర్, లివరు జబ్బులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి వాటికి వాడే కొన్ని మందులు పడకపోవడం వలన కూడా రావచ్చు. మూలకారణం తెలుసుకుని చికిత్స చేస్తే తేలికగా నయం చేయవచ్చు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి మధుమేహుల్లో 70 శాతం మందిలో పెరిఫరల్ న్యూరోపతి వ్యాధి సోకుతున్నందున ప్రతి ఒక్కరూ శరీరంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తరచూ కాళ్లకు రక్తప్రసరణ సరిగా ఉందా లేదా పరీక్షించుకోవాలి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందాలి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే దుష్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. – డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
కాళ్లకు వాపులు వస్తున్నాయా.. ఇది తెలుసుకోండి
కాళ్ల వాపులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు కాళ్ల వాపులు రావడం చాలామందిలో చూస్తుంటాం. ఇది చాలా సాధారణమైన, హానికరం కాని సమస్య. ఓ రాత్రంతా విశ్రాంతి తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. ఇక మన దేశంలోని మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. ఈ సమస్యవల్ల కాళ్ల వాపులు రావచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా కాళ్ల వాపులు వస్తుంటాయి. ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావాలతోనూ ఈ సమస్య రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారికి కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి. అంతగా ప్రమాదకరం కానివి మొదలుకొని కిడ్నీ సమస్యలూ, హార్ట్‌ఫెయిల్యూర్ వంటి సీరియస్ సమస్యల్లోనూ ఇవి వస్తుంటాయి. కాబట్టి... కాళ్లవాపులు కనిపించినప్పుడు వైద్య నిపుణుడిని సంప్రదించి కారణం ఏమిటో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించాలి. నిర్ధారణ జరిగాక, సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. (ఇది చదవండి: గుండెపోటు వస్తే కొందరిలో ఆకస్మిక మరణం ఎందుకు? కారణమేంటి?) -
మన్యంపై మృత్యునీడ
ప్రాణాంతక వ్యాధుల నీడన గిరిజనం అంతుచిక్కని వ్యాధులకు బలవుతున్న వైనం తాజాగా కాళ్లవాపుతో ఓ గిరిజనుడి మృతి ఐదుకు చేరిన ‘కాళ్లవాపు’ మరణాలు కదిలిన జిల్లా యంత్రాంగం అంతుచిక్కని వ్యాధికి అడవి బిడ్డలు బలైపోతున్నారు. ఏదో చిన్న ఆరోగ్య సమస్యగా మొదలైన కాళ్ల వాపు.. రోజురోజుకూ ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా ఏజెన్సీలోని వీఆర్ పురం మండలం చిన్నమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) .. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. దీంతో ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఎట్టకేలకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టింది. బాధితుల తరలింపునకు చర్యలు వీఆర్ పురం : కాళ్లవాపు లక్షణాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అడిషనల్ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్ తెలిపారు. కాళ్లవాపుతో మరణించిన కారం రామారావు స్వగ్రామమైన చినమట్టపల్లిలో మంగళవారం వైద్య సిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. కాళ్లవాపుlలక్షణాలున్న వారు రక్త నమూనాలు ఇచ్చేందుకు కానీ, పరీక్షలు చేయించుకునేందుకు కానీ నిరాకరిస్తే.. నిర్బంధంగానైనా ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ వ్యాధి లక్షణాలున్న కొంతరిని రేఖపల్లి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. పోలవరం (భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్(స్పెషలాఫీసర్) పి.శ్రీరామచంద్రమూర్తి, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ పాల్గొన్నారు. గిరిజనుడిని బలిగొన్న ‘కాళ్లవాపు’ కాకినాడ సిటీ : జిల్లాలోని విలీన ప్రాంతమైన వీఆర్‌పురం మండలం చినమట్టపల్లి గ్రామానికి చెందిన కారం రామారావు(45) కాళ్ల వాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. కాళ్లవాపు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న రామారావును అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఏఎంసీ–1లో వెంటిలేటర్‌పై ఉంచి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వీఆర్‌పురం మండలంలో నలుగురు మరణించగా, తాజాగా రామారావు మృతితో కాళ్లవాపు వ్యాధి మరణాల సంఖ్య ఐదుకు చేరింది. 29 మంది డిశ్చార్జి కాళ్లవాపు వ్యాధితో బాధపడుతున్న 32 మంది గిరిజనులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని ఈ నెల 8, 9 తేదీల్లో జీజీహెచ్‌కు తరలించగా, ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్య సేవలందించారు. వీరిలో 29 మంది ఆరోగ్యం మెరుగుపడడంతో, మంగళవారం ఆస్పత్రిలో సీఎస్ఆర్ఎంఓ టీఎస్ఆర్ మూర్తి నేతృత్వంలో వైద్యులు విశాఖ నుంచి వచ్చిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ మహేష్, ఏఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ లకో్ష్మజీనాయుడు, మెడిసిన్ చీఫ్ డాక్టర్ సీఎస్ఎస్ శర్మ సమావేశమై చర్చించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో 29 మందిని డిశ్చార్జి చేసి, ప్రత్యేక వాహనంలో ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ బృందం రాక కాగా రెండు రోజుల్లో నేషనల్ లేబొరేటరీ నుంచి ప్రత్యేక బృందం జిల్లాకు వస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. ముంపు మండలాల్లో కాళ్ల వాపు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి, శాంపిళ్లను సేకరిస్తుందని తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తాం చింతూరు : ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు మెరుగు పరుస్తామని, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలీన మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. చింతూరులో ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరతపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, డిప్యుటేషన్‌పై స్టాఫ్‌నర్సులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి అధికంగా ఉందని, వీరిలో 19 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్టు తెలిపారు. వీరిలో నలుగురికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండగా, వీరిలో ఒకరు మంగళవారం మరణించినట్టు చెప్పారు. కొందరు గిరిజనులు తాగుతున్న నాటుసారాను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. చింతూరులో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఏజెన్సీలో ప్రతి మండలానికి ఒక డాక్టర్‌తో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నాటుమందులు ఆశ్రయించి ప్రాణాపాయం కొనితెచ్చుకోవద్దని కోరారు.