
జుకర్ బర్గ్ షేర్ చేసిన ఫోటో ఏంటో తెలుసా?
ఏప్రిల్ 10 వరల్డ్ సిబ్లింగ్ డే సందర్భంగా ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. అక్కచెల్లెళ్లు అరెల్లె, డొన్నా, రాండీ జుకర్ బర్గ్ లకు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వాషింగ్టన్: ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పూర్తి స్థాయిలో పితృత్వాన్ని అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో తన ముద్దుల చిన్నారి ఫోటోలను మురిపెంగా షేర్ చేసిన ఆయన తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 10 వరల్డ్ సిబ్లింగ్ డే సందర్భంగా ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. అక్కచెల్లెళ్లు అరెల్లె, డొన్నా, రాండీ జుకర్ బర్గ్ లకు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతమైన తోబుట్టువులకు అభినందనలు. 1980లో స్కై జాకెట్లుతో తమ బాల్యం చాలా బాగా గడిచిందంటూ అప్పటి మధురమైన క్షణాలన, జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అమెరికాలో ప్రతి ఏటా ఏప్రిల్ 10వ ‘సిబ్లింగ్ డే’ జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని 1980లో తన సిబ్లింగ్స్ తో దిగిన ఒక ఫొటోను జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. ఒంటె ఆకారంలో ఉన్న ఒక చెక్క దిమ్మెపై జుకర్ బర్గ్ తన ముగ్గురు సోదరీమణులతో కలిసి కూర్చుని ఉన్న ఫోటోను పంచుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ జుకర్ ఫేస్ లో పెద్దగా తేడా ఏమీ లేదనీ, అతని కళ్లల్లో భవిష్యత్తు మెరుపు స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.