విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్‌డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..
మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్‌లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై..
ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?
అమెరికా వ్యాపారవేత్త, ఫేస్‌బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సెల్‌ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్‌ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.
రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్‌ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్‌డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
అలాగే 2030 నాటికి సెల్‌ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్‌గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. స్మార్ట్‌ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్‌కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ వేరబుల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్‌గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్‌ఆర్, సోలోస్ ఎయిర్‌గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్‌కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!!
Comments
Please login to add a commentAdd a comment