Smart glasses
-
అంధులకు కోసం స్మార్ట్ గాగుల్స్.. 14 ఏళ్ల బాలికల ఆవిష్కరణ!
కేరళలోని నలుగురు బాలికలు అంధులకు ఉపయోగపడే స్మార్ట్‌గాగుల్స్‌ని రూపొందించారు. వాళ్లు దాన్ని తమ పాఠశాల్లో అంధురాలిగా ఉన్న సహ విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్‌లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేదికగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో దీన్ని ప్రదర్శించారు బాలికలు. ఈ ఆవిష్కరణ మూడో స్థానం దక్కించుకోవడమే గాక అందరీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించడం విశేషం. ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టునున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఒక అడుగు ముందేసి ఇలాంటి గాగుల్స్‌ని రూపొందించాలనుకోవడం అందర్నీ సభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ బాలికలు ఎలా రూపొందించారు? ఈ ఆలోచనకు మార్గదర్శకం చేసిందెవరూ..? తదితర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!. కేరళలోని సెయింట్ మేరిస్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్మార్ట్ గాగుల్స్‌ని రూపొందించారు. ఈ నమునాను హన్నా రీతు సోజన్, ఆన్సిలా రెజి, ఆన్లిన్ బిజోయ్, అంజెలినా అనే నలుగురు బాలికలు రూపొందించారు. ఈ స్మార్ట్ గాగుల్ అల్ట్రా సోనిక్ సెన్సార్లను ఉపయోగించింది రూపొందించారు. అందువల్ల వీటిని ధరించిన అంధ వ్యక్తులకు ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి బజర్ ద్వారా వారిని ముందుగా హెచ్చరిస్తుంది. ఆ బాలికలు ఈ స్మార్ట్ గ్లాస్ నమునాని త్రిసూర్‌లోని సెయింట్ పాల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ అటల్ టింకరింగ్ లాబొరేటరీ(ఏటీఎల్) తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఏటీఎల్‌ని నీతి అయోగ్‌లో బాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాల్లలో ఏర్పాటు చేసింది. ఇలాంటి ల్యాబరేటరీలను దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేలకు పైగా ఏర్పాటు చేసింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ ల్యాబరేటరీలను పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచన వెలికితీసి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది. అంతేగాదు ముఖ్యంగా విద్యార్థుల్లో డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సదరు బాలికలు మాట్లాడుతూ..తాము రూపొందించిన స్మార్ట్ గాగుల్ బేసిక్ మోడల్ అని, దీన్ని మరింతగా మెరుగుపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. రేబాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు తెలుసని అన్నారు. అయితే అవి అత్యంత ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా, చౌకగా, పర్యావరణ హితంగా రూపొందించాలనేది తమ లక్ష్యం అని ఆ బాలికలు పేర్కొన్నారు. ఇక ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో లెర్నర్ లింక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా నియమించబడిన ఒక మెంటర్ ఆయా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాడు. ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో మొత్తం మూడు వేర్వేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 20కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో మొదటి మూడు ప్రాజెక్ట్‌లు ప్రత్యేక అవార్డులను పొందాయి. అందులో ఈ స్మార్ట్ గాగుల్స్ ప్రాజెక్ట్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కేరళలోని ఏటీఎల్ ల్యాబ్ ఒప్పో ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఏటీఎల్ కార్యక్రమంలో ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ..ఆ యువ విద్యార్థుల అంకితభావం, కృషికి ముగ్దుడినయ్యానన్నారు. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందానని చెప్పారు. దృష్టిలోపం ఉన్న తమ తోటి విద్యార్థి పట్ల వారు కనబర్చిన సానుభూతి వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు వచ్చేలా చేయడమేగాక ఈ ఆవిష్కరణకు నాంది పలికేలా చేయడం నిజంగా గొప్ప విషయమంటూ ఆ బాలికలను ప్రశంసించారు వివేక్ వశిష్ట. (చదవండి: చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!) -
జియో కొత్త స్మార్ట్ గ్లాస్.. కళ్ల ముందే సరికొత్త ప్రపంచం!
రిలయన్స్ సంస్థ టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిమీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గేమింగ్ కంట్రోలర్స్ వంటివి ఆవిష్కరించింది. కాగా ఇటీవల ఓ సరికొత్త స్మార్ట్ గ్లాస్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్లో కనిపించిన ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ మెటాలిక్ ఫ్రేమ్‌తో రెండు లెన్స్‌లు పొందుతుంది. దీన్ని యూఎస్బీ కేబుల్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వైర్లెస్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి జియో గ్లాస్‌ను కంట్రోల్ చేయవచ్చు. కేవలం 75 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్ గ్లాస్ 100 ఇంచెస్ వర్చువల్ డిస్ప్లేగా.. కళ్ళముందే గాలిలో తేలియాడే స్క్రీన్‌ను సృష్టిస్తుంది. బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేయడానికి ట్రాక్‌ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో లభిస్తాయి. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్ ఇందులో ఉండటం వల్ల వాయిస్ కాల్లకు రిసీవ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో 4000mAh బ్యాటరీ కలిగిన ఈ జియో సన్ గ్లాస్ ఒక ఫుల్ ఛార్జ్‌తో మూడుగంటలు పనిచేస్తుంది. రెండు వెర్షన్లలో లభించనున్న ఈ సన్ గ్లాస్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు కూడా అప్పుడే వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్ చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్ గ్లాసెస్ కెమెరా ' స్మార్ట్ గ్లాస్‌ను విడుదల చేసింది. షావీమీ 'మిజియా ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను భారత్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. మిజియా ఏఆర్ గ్లాసెస్ ఫీచర్లు రూ.29,030 విలువైన మిజియా ఏఆర్ గ్లాసెస్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, 50 మెగా పిక్సెల్ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్ ఆప్టికల్ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుండగా 15ఎక్స్ హైబ్రిడ్ వరకు జూమ్ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు. పనితనం అంటే ఇదే మరి కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్ గ్లాస్ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్ స్టాప్‌గా రికార్డ్ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. స్టోరేజీ ఎంతంటే స్నాప్ డ్రాగన్ 8చిప్ సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాస్లో 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. -
అదిరిపోయే స్మార్ట్ గ్లాస్లెస్.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్ చేయొచ్చు..ఇంకా ఎన్నో
టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయ్యే కొద్ది మార్కెట్లో కొత్త కొత్త గాడ్జెట్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని కాపాడేందుకు, లేదంటే ఆర్ట్ అటాక్ వచ్చిందని గుర్తుచేసే స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా స్మార్ట్ వాచ్లకు బదులు స్మార్ట్ గ్లాసెస్' గాడ్జెట్స్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ దేశీయ వాచ్ తయారీ దిగ్గజ సంస్థ టైటాన్.. టెక్నాలజీని జోడిస్తూ 'టైటాన్ ఐ ప్లస్' అనే స్మార్ట్ గ్లాసెస్‌ను ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో వైర్లెస్ ఇయర్‌ఫోన్, ఫిట్నెస్ ట్రాకర్‌తో పాటు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను డిజైన్ చేసింది.వీటితో పాటు మరెన్నో ఆసక్తికర ఫీచర్లు ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో ఉన్నాయి. టైటాన్ ఐఎక్స్ స్మార్ట్ గ్లాసెస్ స్పెసిఫికేషన్లు.. ►టైటాన్ ఐఎక్స్ స్మార్ట్ గ్లాసెస్‌లో ట్రూ వైర్లెస్ స్టెరో(టీడ్ల్యూఎస్) తో పనిచేసేలా రెండు ఓపెన్ ఇయర్ స్పీకర్లు ఉన్నాయి. ►ట్రూ వైర్లెస్ స్టెరో(టీడ్ల్యూఎస్) స్పీకర్లు అవుట్‌డోర్‌లో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ►కంట్రోల్ కోసం క్లియర్ వాయిస్ క్యాప్చర్ (సీవీసీ) టెక్నాలజీతో వీటిని రూపొందించింది. ఇది స్పష్టమైన వాయిస్‌ను క్యాప్చర్ చేయడమే కాకుండా ఆటోమేటిక్‌గా వాల్యూమ్‌ను అడ్జెస్ట్ చేస్తాయి. ►ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఫిట్నెస్ చేక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని కేలరీలు కరిగిపోయాయని తెలుసుకునేందుకు పెడోమీటర్స్ ఉన్నాయి. ►స్మార్ట్ గ్లాస్లో ఉన్న టెంపుల్ టిప్ ఫీచర్ సాయంతో ఇన్ కమింగ్ కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. అంతేకాదు పాటల వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడంతో పాటు సెల్ఫీలు కూడా దిగొచ్చు. ►సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ఛార్జింగ్ లేనట్లయితే ఎప్పటిలాగే ప్రిస్క్రిప్షన్ కళ్లజోడుగా వాడుకోవచ్చని టైటాన్ ఈ ఎక్స్ ప్రతినిధులు తెలిపారు. టైటాన్ స్మార్ట్ గ్లాసెస్ ధరలు.. టైటాన్ 2019, 2020లో ఫాస్ట్‌ట్రాక్ ఆడియో సన్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. తాజాగా మూడోకళ్లజోడును మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక ప్రస్తుతం టైటాన్ ఐ ప్లస్ వెబ్సైట్లో టైటాన్ ఐఎక్స్ కళ్లజోడు ఫ్రేమ్ రూ. 9999 ధర ఉండగా సైట్, సన్, పవర్ లెన్సులను బట్టి వీటి ధరలో మార్పులుంటాయి. చదవండి: దేశంలో పెరిగిపోతున్న కరోనా, ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం! -
ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా!
అద్దాలలో స్మార్ట్ అద్దాలు వేరయా.. అని పద్యం పాడుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. మాస్ మార్కెట్ ప్రాడక్ట్‌గా గుర్తించి ఇస్మార్ట్ గ్లాసెస్‌పై టెక్ దిగ్గజాలు కన్నేశాయి. సర్వేంద్రియానం స్మార్ట్ గ్లాస్ ప్రధానం.. అనేలా చేస్తున్నాయి! కంటిసమస్యలు, వాతావరణ ప్రతికూలతలను అధిగమించడానికి, ఫ్యాషన్ కోసం కంటి అద్దాలు (సులోచనాలు) ధరిస్తుంటాం. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్గ్లాస్లపై యువత ఆసక్తి చూపుతుంది. ప్రసిద్ధ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి వారి స్మార్ట్‌గ్లాస్ కేవలం 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక డిస్ప్లే చిప్ అయితే బియ్యం గింజ సైజ్‌లో ఉంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు) మరి ఈ స్మార్ట్‌గ్లాస్ ధరించడం వల్ల ఏంజరుగుతుంది? ఈ అద్దాలపై నొటిఫికేషన్లు కనిపిస్తాయి. అలా అని ఏవి పడితే అవి కనిపించి చిరాకు తెప్పించవు. షావోమి ఏఐ అసిస్టెంట్ ‘ప్రైమరీ ఇంటరాక్షన్ మెథడ్’తో హోమ్ అలారమ్స్, ఆఫీస్ యాప్‌కు సంబంధించిన అర్జెంట్ సమాచారం.. ఇలా ముఖ్యమైనవి మాత్రమే మనం కోరినట్లు కనిపిస్తాయి. ఫ్రేమ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండే 5ఎంపీ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ స్పీకర్లతో కాల్స్ స్వీకరించవచ్చు. ఆడియోకు టెక్ట్స్ రూపం ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఫేస్బుక్,రేబాన్ వారి స్మార్ట్‌గ్లాసెస్ రేబాన్ స్టోరీస్. ‘మా ఫస్ట్ జెనరేషన్ స్మార్ట్‌గ్లాస్ ధరిస్తే....ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది. కాప్చర్...షేర్...లిజన్’ అంటుంది రేబాన్ స్టోరీస్. దీనిలో కూడా ఇన్‌బిల్ట్ ఫీచర్లకు కొదవేమీ లేదు. 2-ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. కాఫీకి ఆర్డర్ ఇవ్వవచ్చు. యూజర్ ప్రైవసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్గ్లాస్లను డిజైన్ చేశారు. క్లాసిక్, రౌండ్, లార్జ్...ఇలా రేబాన్ స్టోరీస్‌లో 20 వేరియంట్స్ ఉన్నాయి. స్మార్ట్‌గ్లాస్ కదా అని ఇవేమి అసాధారణంగా ఉండవు.. చూడడానికి మామూలు అద్దాలుగానే కనిపిస్తాయి. అయితే, రైట్ బిఫోర్ యువర్ ఐస్...ప్రపంచం ప్రత్యక్షమవుతుంది!. కాస్త వెనక్కి వెళితే.. టెక్ దిగ్గజం గూగుల్ ఎన్నో అంచనాల మధ్య ‘స్మార్ట్‌గ్లాస్’ తీసుకువచ్చింది. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ‘యూజర్ మార్కెట్’కు చేరువకాలేకపోయింది. 2016లో ‘స్నాప్’ కంపెనీ ‘స్పెక్టికల్స్’ పేరుతో స్మార్ట్గ్లాస్లను తీసుకొచ్చిందిగానీ.. ఇది కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు. అయిననూ...ఇస్మార్ట్ గ్లాసెస్‌పై క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని షావోమి, ఫేస్బుక్–రేయాన్ స్టోరీస్ స్మార్ట్‌గ్లాసెస్ లాంటివి వస్తాయి. వస్తూనే ఉంటాయి!. -
షావోమీ మరో సంచలనం, మాట్లాడేందుకు కళ్ల జోడు తెస్తోంది
టెక్ యుగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మానవుడి జీవన విధాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తూ అనేక రకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్ గ్లాసెస్)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పోటీగా ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి 'వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్' పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. షావోమీ స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్స్ 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రం హోం' సినిమాలో స్పైడర్ మ్యాన్ పాత్రదారి పీటర్ పార్కర్ ధరించిన స్మార్ట్ గ్లాస్‌లా ఉండే ఈ కళ్ల జోడులో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి.ఈ ఫీచర్లతో నోటిఫికేషన్లు సెండ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, నావిగేషన్, ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడం, టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాక్ లైటింగ్ కోసం 2.4ఎంఎంx2.02 ఎంఎం పరిమాణంలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే, మల్టీపుల్ కలర్స్ డిస్ట్రబ్ చేయకుండా ఒక్క కలర్ మాత్రమే కనపించేలా మోనోక్రోమ్ ప్యానెల్ ను డిజైన్ చేసింది. అందం కనువిందుగా 180 డిగ్రీల ట్రాన్స్ మిట్ లైట్(కాంతి)వల్ల కళ్లకు ఎలాంటి సమస్య లేకుండా అందం కనువిందుగా కనిపించేందుకు మైక్రోలెడ్ డిస్ప్లే,ఫేస్బుక్ స్మార్ట్ గ్లాసెస్లాగే.. షావోమీ వాయిస్ అసిస్టెంట్ షావోఏఐ ని వినియోగించుకోవచ్చు. ఫోటోలు తీసేందుకు 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్లు, బ్లూటూత్, వైఫై, టచ్‌ప్యాడ్, ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్వాడ్ కోర్ అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్(ఏఆర్ఎం) ప్రాసెసర్‌ను అందిస్తున్నట్లు షావోమీ తెలిపింది. కాగా,వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్ వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను షావోమీ ఎప్పుడు విడుదల చేస్తుంది. ఇంకా ఎలాంటి టెక్నాలజీని జోడించనుందనే విషయాల గురించి షావోమీ ' స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చదవండి: ఫేస్బుక్ కళ్లద్దాలు.. ఇక ఫొటో, వీడియోలు తీయొచ్చు -
పొగమంచులోనూ స్పష్టంగా..
విమానాలు, హెలికాప్టర్లు నడుపుతున్నప్పుడు పైలట్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. పొగమంచు, వర్షాలు, మేఘాల కారణంగా పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పరిసరాలు కనిపించకపోవడంతో ఎదురుగా ఏముంది, హెలికాప్టర్ ఎంత ఎత్తులో ఎగురుతోంది? ఇంకా ఎంత ఎత్తుకు ఎగిరితే బాగుంటుంది అన్నది పైలట్లు తేల్చుకునేలోపే నష్టం జరిగి పోతోంది. అందుకే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పైలట్లు పరిసరాలను చక్కగా అంచనా వేసేందుకు ఉపయోగపడే ఈ స్మార్ట్ కళ్లజోడును ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎల్బిట్ సిస్టమ్స్’ తయారు చేసింది. ‘స్కైలెన్స్’ అనే ఈ కళ్లజోడు ఓ హెడ్సెట్లో భాగంగా ఉంటుంది. విమానం లేదా హెలికాప్టర్‌కు ముందువైపు అమర్చిన వీడియో కెమెరాలకు అనుసంధానమై ఇది పనిచేస్తుంది. పొగమంచు లేదా దట్టమైన మేఘాలు అలముకున్నా, ధూళి తుపాను రేగినా లేదా భారీ వర్షం కురుస్తున్నా ఈ కళ్లజోడు పరిసరాలను స్పష్టంగా చూపుతుందట. అలాగే హెలికాప్టర్ ఎంత ఎత్తులో, వేగంతో ఎగురుతోంది? చుట్టుపక్కల ఎత్తై కొండలు ఉన్నాయా? అన్నదీ తెలియజేస్తుంది. ఇతర విమానాలు లేదా హెలికాప్టర్లు దగ్గరగా వస్తే.. రాడార్ సిగ్నళ్ల సాయంతో ఇది పసిగట్టి హెచ్చరిస్తుంది కూడా. పొగమంచు, వర్షాలు, ధూళి అలముకున్న ప్రాంతాల్లో ఈ కళ్లజోడును ధరించి 150 మంది పైలట్లు ఐదు రకాల విమానాలు, హెలికాప్టర్లు నడిపి చూశారట. ఈ టెక్నాలజీని మరో రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని కంపెనీవారు వెల్లడించారు. -
ఎల్జీ స్మార్ట్ గ్లాసెస్ వస్తున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ తరహాలో రూపొందుతున్న స్మార్ట్ గ్లాసెస్‌ను ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాదే మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. అయితే గూగుల్ గ్లాస్‌లా కాకుండా సొంతంగా అభివృద్ధి చేస్తున్న ‘గ్లాస్టిక్’ పరిజ్ఞానాన్ని ఎల్జీ ఇందుకు ఉపయోగిస్తోంది. 2013 నవంబరులోనే గ్లాస్టిక్ ట్రేడ్‌మార్క్ కోసం మొబైల్స్, స్పెక్టాకిల్స్(ఆప్టిక్స్) విభాగంలో కంపెనీ దరఖాస్తు చేసుకుంది. స్మార్ట్ గ్లాసెస్ వస్తున్న విషయాన్ని ఎల్జీ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఏడాదే ఇవి మార్కెట్లోకి రావచ్చని చెప్పారు. మార్కెట్లో ఉన్న గ్లాసెస్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఇవి ఉండబోతున్నాయని.. ధర ఎంత ఉండేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్మార్ట్ గ్లాసెస్ కళ్లజోడు మాదిరిగా ఉండే చిన్నపాటి కంప్యూటర్. బ్యాటరీ, సీపీయూ, స్పీకర్, కెమెరా, మైక్రోఫోన్ దీనికి ఉంటాయి. ఫోన్‌కాల్స్ చేయొచ్చు. అద్దాలకు ముందువైపు గాజు వంటి చిన్న తెర ప్రిసమ్ ఉంటుంది. నచ్చిన వీడియోలు చూడొచ్చు. కెమెరాతో వీడియో రికార్డింగ్, ఫోటోలు తీయొచ్చు.