అద్దాలలో స్మార్ట్ అద్దాలు వేరయా.. అని పద్యం పాడుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. మాస్ మార్కెట్ ప్రాడక్ట్‌గా గుర్తించి ఇస్మార్ట్ గ్లాసెస్‌పై టెక్ దిగ్గజాలు కన్నేశాయి. సర్వేంద్రియానం స్మార్ట్ గ్లాస్ ప్రధానం.. అనేలా చేస్తున్నాయి!
కంటిసమస్యలు, వాతావరణ ప్రతికూలతలను అధిగమించడానికి, ఫ్యాషన్ కోసం కంటి అద్దాలు (సులోచనాలు) ధరిస్తుంటాం. అయితే ఫ్యాషన్, టెక్నాలజీని మిళితం చేసిన స్మార్ట్‌గ్లాస్‌లపై యువత ఆసక్తి చూపుతుంది. ప్రసిద్ధ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి వారి స్మార్ట్‌గ్లాస్ కేవలం 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక డిస్‌ప్లే చిప్ అయితే బియ్యం గింజ సైజ్‌లో ఉంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు)
మరి ఈ స్మార్ట్‌గ్లాస్ ధరించడం వల్ల ఏంజరుగుతుంది?
ఈ అద్దాలపై నొటిఫికేషన్లు కనిపిస్తాయి. అలా అని ఏవి పడితే అవి కనిపించి చిరాకు తెప్పించవు. షావోమి ఏఐ అసిస్టెంట్ ‘ప్రైమరీ ఇంటరాక్షన్ మెథడ్’తో హోమ్ అలారమ్స్, ఆఫీస్ యాప్‌కు సంబంధించిన అర్జెంట్ సమాచారం.. ఇలా ముఖ్యమైనవి మాత్రమే మనం కోరినట్లు కనిపిస్తాయి. ఫ్రేమ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండే 5ఎంపీ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ స్పీకర్లతో కాల్స్ స్వీకరించవచ్చు. ఆడియోకు టెక్ట్స్ రూపం ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఫేస్‌బుక్,రేబాన్ వారి స్మార్ట్‌గ్లాసెస్ రేబాన్ స్టోరీస్. ‘మా ఫస్ట్ జెనరేషన్ స్మార్ట్‌గ్లాస్ ధరిస్తే....ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది. కాప్చర్...షేర్...లిజన్’ అంటుంది రేబాన్ స్టోరీస్.
దీనిలో కూడా ఇన్‌బిల్ట్ ఫీచర్లకు కొదవేమీ లేదు. 2-ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. కాఫీకి ఆర్డర్ ఇవ్వవచ్చు. యూజర్ ప్రైవసీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌గ్లాస్‌లను డిజైన్ చేశారు. క్లాసిక్, రౌండ్, లార్జ్...ఇలా రేబాన్ స్టోరీస్‌లో 20 వేరియంట్స్ ఉన్నాయి. స్మార్ట్‌గ్లాస్ కదా అని ఇవేమి అసాధారణంగా ఉండవు.. చూడడానికి మామూలు అద్దాలుగానే కనిపిస్తాయి. అయితే, రైట్ బిఫోర్ యువర్ ఐస్...ప్రపంచం ప్రత్యక్షమవుతుంది!.
కాస్త వెనక్కి వెళితే.. టెక్ దిగ్గజం గూగుల్ ఎన్నో అంచనాల మధ్య ‘స్మార్ట్‌గ్లాస్’ తీసుకువచ్చింది. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ‘యూజర్ మార్కెట్’కు చేరువకాలేకపోయింది. 2016లో ‘స్నాప్’ కంపెనీ ‘స్పెక్టికల్స్’ పేరుతో స్మార్ట్‌గ్లాస్‌లను తీసుకొచ్చిందిగానీ.. ఇది కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు. అయిననూ...ఇస్మార్ట్ గ్లాసెస్‌పై క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని షావోమి, ఫేస్‌బుక్–రేయాన్ స్టోరీస్ స్మార్ట్‌గ్లాసెస్ లాంటివి వస్తాయి. వస్తూనే ఉంటాయి!.
Comments
Please login to add a commentAdd a comment