అదిరిపోయే స్మార్ట్‌ గ్లాస్లెస్‌.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్‌ చేయొచ్చు..ఇంకా ఎన్నో | Titan Eye Smart Glasses Price And Availability | Sakshi
Sakshi News home page

అదిరిపోయే స్మార్ట్‌ గ్లాస్లెస్‌.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్‌ చేయొచ్చు..ఇంకా ఎన్నో

Published Wed, Jan 12 2022 6:04 PM | Last Updated on Wed, Jan 12 2022 6:22 PM

Titan Eye Smart Glasses Price And Availability - Sakshi

టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ అయ్యే కొద్ది మార్కెట్‌లో కొత్త కొత్త గాడ్జెట్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని కాపాడేందుకు, లేదంటే ఆర్ట్‌ అటాక్‌ వచ్చిందని గుర్తుచేసే స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా స్మార్ట్‌ వాచ్‌లకు బదులు స్మార్ట్‌ గ్లాసెస్‌' గాడ్జెట్స్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. 

ప్రముఖ దేశీయ వాచ్‌ తయారీ దిగ్గజ సంస్థ టైటాన్.. టెక్నాలజీని జోడిస్తూ 'టైటాన్ ఐ ప్లస్' అనే స్మార్ట్​ గ్లాసెస్‌ను ​ను ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌లో వైర్​లెస్ ఇయర్​ఫోన్​, ఫిట్​నెస్​ ట్రాకర్​తో పాటు క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ చిప్​సెట్‌​ను డిజైన్‌ చేసింది.వీటితో పాటు మరెన్నో ఆసక్తికర ఫీచర్లు ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో ఉన్నాయి. 

టైటాన్ ఐఎక్స్ స్మార్ట్​ గ్లాసెస్​ స్పెసిఫికేషన్లు..

టైటాన్​ ఐఎక్స్​ స్మార్ట్ గ్లాసెస్​లో ట్రూ వైర్‌లెస్‌ స్టెరో(టీడ్ల్యూఎస్‌) తో పనిచేసేలా రెండు ఓపెన్‌ ఇయర్‌ స్పీకర్లు ఉన్నాయి. 

ట్రూ వైర్‌లెస్‌ స్టెరో(టీడ్ల్యూఎస్‌) స్పీకర్లు అవుట్‌డోర్‌లో మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. 

కంట్రోల్​ కోసం క్లియర్ వాయిస్ క్యాప్చర్ (సీవీసీ) టెక్నాలజీతో వీటిని రూపొందించింది. ఇది స్పష్టమైన వాయిస్‌ను క్యాప్చర్ చేయడమే కాకుండా ఆటోమేటిక్​గా వాల్యూమ్‌ను అడ్జెస్ట్​ చేస్తాయి. 

ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌తో ఫిట్‌నెస్‌ చేక్‌ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని కేలరీలు కరిగిపోయాయని తెలుసుకునేందుకు పెడోమీటర్స్‌ ఉన్నాయి. 

స్మార్ట్‌ గ్లాస్‌లో ఉన్న టెంపుల్‌ టిప్‌ ఫీచర్‌ సాయంతో ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయొచ్చు. కట్‌ చేయొచ్చు. అంతేకాదు పాటల వాల్యూమ్​ పెంచుకోవడం, తగ్గించుకోవడంతో పాటు సెల్ఫీలు కూడా దిగొచ్చు.  

సింగిల్‌ ఛార్జ్‌తో 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ఛార్జింగ్​ లేనట్లయితే ఎప్పటిలాగే ప్రిస్క్రిప్షన్​ కళ్లజోడుగా వాడుకోవచ్చని టైటాన్‌ ఈ ఎక్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

టైటాన్​ స్మార్ట్‌ గ్లాసెస్‌ ధరలు​..
టైటాన్​ 2019, 2020లో ఫాస్ట్‌​ట్రాక్​ ఆడియో సన్​ గ్లాసెస్​ను విడుదల చేసింది. తాజాగా మూడోకళ్లజోడును మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక ప్రస్తుతం టైటాన్​ ఐ ప్లస్​ వెబ్​సైట్​లో టైటాన్​ ఐఎక్స్​ కళ్లజోడు ఫ్రేమ్​ రూ. 9999 ధర ఉండగా సైట్​, సన్​, పవర్​ లెన్సులను బట్టి వీటి ధరలో మార్పులుంటాయి.

చదవండి: దేశంలో పెరిగిపోతున్న కరోనా, ఆన్‌లైన్‌లో వీటి అమ్మకాలు బీభత్సం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement