Smart watches
-
స్మార్ట్‌వాచ్ విభాగంలో ఫైర్-బోల్ట్ హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ కొత్త రికార్డు సృష్టించింది. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం స్మార్ట్‌వాచ్ విభాగంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచినట్టు కంపెనీ వెల్లడించింది. మూడేళ్లలోనే 9 శాతం వాటాతో ఈ ఘనత సాధించినట్టు వివరించింది. మార్చి త్రైమాసికంలో 57 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది. -
ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & మస్త్ ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఉత్పత్తులను విడుదల చేస్తూ మంచి ప్రజాదరణ పొందుతున్న ఫైర్ బోల్ట్ (Fire-Boltt) ఎట్టకేలకు మరో స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. అమోలెడ్ డిస్ప్లేతో విడుదలైన ఈ వాచ్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్ ధర రూ. 2,799. దీనిని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 550 నిట్స్ బ్రైట్నెస్ ఉండే రౌండ్ షేప్డ్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉన్న ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి వాటిని పొందుతుంది. కొత్త ఫైర్ బోల్ట్ రాక్ వాచ్ 390x390 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.3 రౌండ్ AMOLED డిస్ప్లే కలిగి ఉండటం వల్ల, చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఈ డిస్ప్లేకు గ్లాస్ కవర్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మెటల్ బటన్, క్రౌన్ వంటివి కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: చైనాలో మెగా బ్యాటరీ ఫ్యాక్టరీకి సిద్దమవుతున్న మస్క్ - పూర్తి వివరాలు) ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. ఇందులో డయల్ ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్‌లో కాల్ లాగ్స్ కూడా చూడవచ్చు, మొబైల్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాచ్కే నోటిఫికేషన్లు వస్తాయి. మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఈ వాచ్ స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను పొందుతుంది. ఈ ఫీచర్స్ కాకుండా ఇందులో 110కి పైగా స్పోర్ట్స్ మోడ్లు దీనికి సపోర్ట్ చేస్తాయి. ఇది 260mAh బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జ్‌పై 7 రోజుల పనిచేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ వాచ్ ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. -
Youth Pulse: మా టైమ్ బాగున్నది... బహు బాగున్నది! ఎందుకంటే!
ఇప్పుడు మనం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన నైమిష గురించి చెప్పుకుందాం. మూడు నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కేశవ్ స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో అది తన ఫ్యాషన్ యాక్సెసరీలలో ఒకటి మాత్రమే. అయితే, తరువాత తరువాత అందులోని ఫీచర్లను ఉపయోగించడం ద్వారా తన జీవనశైలిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది నైమిష. ‘మొదట్లో టైమ్ చూసుకోవడానికి తప్ప స్మార్ట్‌వాచ్ వైపు చూసింది లేదు. ఒకరోజు తీరిక దొరికినప్పుడు స్మార్ట్‌వాచ్ వరల్డ్‌లోకి వెళ్లడం ద్వారా ఎన్నో వండర్ఫుల్ ఫీచర్స్ గురించి తెలుసుకొని ఉపయోగిస్తున్నాను. అయితే అవేమీ కాలక్షేపానికి సంబంధించినవి కావు. నా లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవి’ అంటుంది నైమిష. పెద్దగా ఆసక్తి చూపించలేదు! కానీ ఇప్పుడు.. 2013లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... స్మార్ట్‌వాచ్‌లు స్వీకరించడానికి యూత్ పెద్దగా ఆసక్తి చూపించలేదు! ‘స్మార్ట్ఫోన్లు ఉండగా, స్మార్ట్‌వాచ్‌లు దండగా’ అన్న వాళ్లే ఎక్కువ. ‘యూత్ ఆసక్తి, అనాసక్తులలో మార్పు రావడానికి ఎక్కువ కాలం పట్టదు’ అని అప్పుడే తేల్చారు ‘సెంటర్ ఫర్ ది డిజిటల్ ఫ్యూచర్’ డైరెక్టర్ జెఫ్రీ కోల్. అతడి అంచనాలు నిజం కావడానికి అట్టే కాలం పట్టలేదు. ఆ మధ్య ఇండోనేసియాలో నిర్వహించిన సర్వేలో యువతలో అత్యధికులు స్మార్ట్‌వాచ్‌లను మెచ్చుకున్నారు. అవి తమకు ఎలా ఉపయోగపడుతున్నదీ చెప్పుకొచ్చారు. నిజానికి ఇది ఇండోనేసియా పరిస్థితి మాత్రమే కాదు ఇండియా పరిస్థితి కూడా. ఎప్పటికప్పుడూ యూత్ అభిప్రాయాలను సేకరించడం ద్వారా కంపెనీలు తమ మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని అభివృద్ధి చేసుకుంటూ కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చాయి. తీసుకువస్తున్నాయి. జీవనశైలిలో భాగంగా.. స్టైలిష్ లుక్ ఇవ్వడంతోపాటు ఫిట్నెస్ ట్రాకింగ్(కేలరీలు, ఎక్సర్సైజ్ మినిట్స్, స్టాండింగ్), వర్కవుట్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, అబ్నార్మల్ హార్ట్రేట్స్ను హెచ్చరించడం, డిస్ ప్లే టికెట్స్, బోర్డింగ్ పాసెస్, టర్న్–బై–టర్న్, అలారమ్స్, టైమర్స్, రిమైండర్స్, ‘డోన్ట్ డిస్టర్బ్’ అని తెలియజేసే ఫోకస్మోడ్, షేర్ ఫోటో ఆప్షన్... ఇలా ఎన్నో విషయాల్లో స్మార్ట్‌వాచ్‌లు యువతరానికి ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి రంగు, డిజైన్ల విషయంలో ఆసక్తి చూపే యువతరం ఇప్పుడు బరువు విషయంలోనూ అంతే ఆసక్తి ప్రదర్శిస్తోంది. కొత్త వాచ్ మార్కెట్లోకి రాగానే ‘కీ స్పెసిఫికేషన్’ జాబితాలో వాచ్ బరువు ఎన్ని గ్రాములో చూడడం అనేది ఇప్పుడు యువతరం తొలి ప్రాధాన్యతగా మారింది. పోటీలో భాగంగా యూత్‌ని ఆకట్టుకోవడానికి కంపెనీలు వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. తాజా విషయానికి వస్తే న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌కు సంబంధించి బయోయాక్టివ్ సెన్సర్లతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ప్రకటించింది కంపెనీ. గెలాక్సీ ఎన్నో సంవత్సరాలుగా స్లీప్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఎందుకంటే, నిద్రకు సంబంధించిన నిబంధనలు గాలికి వదిలేస్తుంటారు యువతరంలో ఎక్కువమంది. అలాంటి వారికి నిద్రకు సంబంధించిన ఆరోగ్యకరమైన పద్ధతులు అలవాటు చేయడానికి ఇలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రయోగాలు, ఆవిష్కరణలు కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమే అయినప్పటికీ వాటి వల్ల యువతరానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది మంచి విషయమే కదా! చదవండి: గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! కీమో థెరపీ తీసుకుంటూనే రన్నర్‌గానూ! -
అదిరిపోయే స్మార్ట్ గ్లాస్లెస్.. సెల్ఫీలు దిగొచ్చు, కాల్ చేయొచ్చు..ఇంకా ఎన్నో
టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయ్యే కొద్ది మార్కెట్లో కొత్త కొత్త గాడ్జెట్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని కాపాడేందుకు, లేదంటే ఆర్ట్ అటాక్ వచ్చిందని గుర్తుచేసే స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా స్మార్ట్ వాచ్లకు బదులు స్మార్ట్ గ్లాసెస్' గాడ్జెట్స్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ దేశీయ వాచ్ తయారీ దిగ్గజ సంస్థ టైటాన్.. టెక్నాలజీని జోడిస్తూ 'టైటాన్ ఐ ప్లస్' అనే స్మార్ట్ గ్లాసెస్‌ను ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో వైర్లెస్ ఇయర్‌ఫోన్, ఫిట్నెస్ ట్రాకర్‌తో పాటు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను డిజైన్ చేసింది.వీటితో పాటు మరెన్నో ఆసక్తికర ఫీచర్లు ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో ఉన్నాయి. టైటాన్ ఐఎక్స్ స్మార్ట్ గ్లాసెస్ స్పెసిఫికేషన్లు.. ►టైటాన్ ఐఎక్స్ స్మార్ట్ గ్లాసెస్‌లో ట్రూ వైర్లెస్ స్టెరో(టీడ్ల్యూఎస్) తో పనిచేసేలా రెండు ఓపెన్ ఇయర్ స్పీకర్లు ఉన్నాయి. ►ట్రూ వైర్లెస్ స్టెరో(టీడ్ల్యూఎస్) స్పీకర్లు అవుట్‌డోర్‌లో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ►కంట్రోల్ కోసం క్లియర్ వాయిస్ క్యాప్చర్ (సీవీసీ) టెక్నాలజీతో వీటిని రూపొందించింది. ఇది స్పష్టమైన వాయిస్‌ను క్యాప్చర్ చేయడమే కాకుండా ఆటోమేటిక్‌గా వాల్యూమ్‌ను అడ్జెస్ట్ చేస్తాయి. ►ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఫిట్నెస్ చేక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని కేలరీలు కరిగిపోయాయని తెలుసుకునేందుకు పెడోమీటర్స్ ఉన్నాయి. ►స్మార్ట్ గ్లాస్లో ఉన్న టెంపుల్ టిప్ ఫీచర్ సాయంతో ఇన్ కమింగ్ కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. అంతేకాదు పాటల వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడంతో పాటు సెల్ఫీలు కూడా దిగొచ్చు. ►సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ఛార్జింగ్ లేనట్లయితే ఎప్పటిలాగే ప్రిస్క్రిప్షన్ కళ్లజోడుగా వాడుకోవచ్చని టైటాన్ ఈ ఎక్స్ ప్రతినిధులు తెలిపారు. టైటాన్ స్మార్ట్ గ్లాసెస్ ధరలు.. టైటాన్ 2019, 2020లో ఫాస్ట్‌ట్రాక్ ఆడియో సన్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. తాజాగా మూడోకళ్లజోడును మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇక ప్రస్తుతం టైటాన్ ఐ ప్లస్ వెబ్సైట్లో టైటాన్ ఐఎక్స్ కళ్లజోడు ఫ్రేమ్ రూ. 9999 ధర ఉండగా సైట్, సన్, పవర్ లెన్సులను బట్టి వీటి ధరలో మార్పులుంటాయి. చదవండి: దేశంలో పెరిగిపోతున్న కరోనా, ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం! -
గడియారం చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని
వాషింగ్టన్: యాపిల్ స్మార్ట్ వాచ్ వీరోచిత గాథలు కొనసాగతునే ఉన్నాయి. గతంలో ఓ మహిళను కిడ్నాపర్ల చెర నుంచి కాపాడటం.. మధ్యప్రదేశ్‌లో ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైనం చదివాం. తాజాగా ఓ మహిళను గుండెపోటు బారిన పడి చనిపోకుండా కాపాడింది యాపిల్ స్మార్ట్ వాచ్. ఆ వివరాలు.. మిచిగాన్కు చెందిన డయాన్ ఫీన్స్ట్రా అనే మహిళకు ఓ రోజు యాపిల్ స్మార్ట్ వాచ్‌లో తన హృదయ స్పందనలు అసాధరణంగా నమోదవ్వడం గమనించింది. భర్తను పిలిచి దాన్ని చూపించింది. వెంటనే అతడు డయాన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించాడు. హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత డాక్టర్లు డయాన్‌కు ఈసీజీ నిర్వహించగా.. ఆమెకు కొన్ని రోజుల క్రితం గుండెపోటు వచ్చిందని.. కానీ దాని గురించి డయాన్‌కు తెలియలేదని గుర్తించారు. ఈ క్రమంలో డయాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఏప్రిల్ 22న నా గుండె నిమిషానికి 169 సార్లు కొట్టుకుంది. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు, కనీసం మెట్లు ఎక్కినప్పుడు కూడా గుండె ఇంత వెగంగా కొట్టుకోలేదు. అందుకే నా భర్తను పిలిచి.. తనకు ఇది చూపించి.. ఏమైనా సీరియసా అని అడిగాను. ఆయన నన్ను ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వాచ్ రికార్డైన హృదయస్పందనలు పరిశీలించి.. ఈసీజీ నిర్వహించారు. గతంలో నాకు గుండెపోటు వచ్చింది.. కానీ దాని గురించి నాకు తెలయలేదని తెలిపారు. ఇక పురుషులతో పోల్చుకుంటే.. మహిళల్లో గుండెపోటు సందర్భంగా కనిపించే లక్షణాలు చాలా వేరుగా ఉంటాయి’’ అని డయాన్ తెలిపారు. ‘‘ఇక వయసు పెరుగుతున్న కొద్ది నా ఎడమ చేతిలో నొప్పి.. ఎడమ పాదంలో వాపు వంటి లక్షణాలను నేను గమనించాను. అయితే గ్యాస్ సమస్య వల్ల ఇలా అనిపిస్తుందనుకున్నాను. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నా భుజంలో నొప్పి వచ్చేది. కానీ దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాను’’ అని తెలిపారు డయాన్. ఈసీజీ రిపోర్టు తర్వాత మరిన్ని టెస్టులు చేసి.. డయాన్‌కు స్టెంట్ వేయడం అవసరం అని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి.. స్టెంట్ వేశారు. ఈ క్రమంలో డయాన్.. జనాలు ఎప్పటికప్పుడు తమ హృదయ స్పందనలు చెక్ చేసుకుంటే.. గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. -
శామ్సంగ్... గూగుల్.. ఓ స్మార్ట్ వాచ్
శామ్సంగ్, గూగుల్ కలయికలో అధునాత ఫీచర్లతో స్మార్ట్ వాచ్ రాబోతుంది. టెకీలు, ఫిట్నెస్ లవర్లు, స్పోర్ట్స్ పర్సన్ అవసరాలను తీర్చే విధంగా సరికొత్త ఫీచర్లు ఈ వేరబుల్ గాడ్జెట్‌లో పొందు పరిచారు. దీనికి సంబంధించిన వివరాలను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్సంగ్ వెల్లడించింది. గూగుల్ ప్లస్ శామ్సంగ్ ఇప్పటి వరకు శామ్సంగ్ విడుదల చేసిన స్మార్ట్ఫోన్లు అన్నీ టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేశాయి. ఈసారి టైజన్ స్థానంలో గూగుల్ రూపొందించిన యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌ని శామ్సంగ్ ఉపయోగిస్తోంది. దీని వల్ల ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే ఫోన్లకు, ఈ స్మార్ట్ వాచ్‌కి మధ్య కనెక్టివి మరింత మెరుగ్గా ఉంటుందని శామ్సంగ్ చెబుతోంది. ఆధునిక ఫీచర్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఆటోమేటిక్‌గా స్మార్ట్ వాచ్‌లో డౌన్లోడ్ అయిపోతాయి. స్మార్ట్‌వాచ్‌లో వివిధ దేశాల టైమ్ జోన్, కాల్ బ్లాక్ తదితర ఆప్షన్లను అందివ్వబోతుంది శామ్సంగ్. దీంతో పాటు స్మార్ట్‌వాచ్ బ్యాటరీ సామర్థ్యం కూడా పెరగనుంది. ముఖ్యంగా టెకీలు, బిజినెస్ పర్సన్స్ ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు కాల్ బ్లాక్, అన్ బ్లాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లో కొత్తగా వచ్చిన అప్లికేషన్ ఎంతగానో ఉపయోగకరమని శామ్సంగ్ చెబుతోంది,. ఆగస్టులో ఈ స్మార్ట్‌వాచ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. చదవండి : లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు -
SAMSUNG WMC: ఫోకస్ అంతా వాటిపైనే
వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ వేదికగా కొత్త అప్డేట్స్ ప్రకటించేందుకు సామ్సంగ్ సిద్ధమైంది. కోవిడ్ కారణంగా వర్చువల్ పద్దతిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 28 రాత్రి 7:15 గంటలకు వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. సామ్సంగ్ యూట్యూబ్ ఛానల్, సామ్సంగ్ న్యూస్‌రూమ్ లైట్ల ద్వారా ఈ వర్చువల్ సమావేశాన్ని చూడొచ్చు. స్మార్ట్‌వాచ్ అప్డేట్స్ ఈరోజు జరిగే మొబైల్ కాంగ్రెస్‌లో స్మార్ట్ వాచెస్‌పై సామ్సంగ్ ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. స్మార్ట్ వాచెస్ మరింత సమర్థంగా, ఉపయోగకరంగా పని చేసేలా ప్రయత్నించాలంటూ డెవలపర్స్‌కి ఇప్పటికే సామ్సంగ్ సూచించింది. ప్రస్తుతం స్మార్ట్ వాచెస్‌లో సామ్సంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టైజన్ వాడుతుండగా.. ఇకపై వియర్ ఓస్‌కు షిఫ్ట్ కానుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు గెలాక్సీ వాచ్ 4కి సంబంధించి సామ్సంగ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లేంటీ ? స్మార్ట్ వాచెస్‌తో పాటు ఆగస్టులో విడుదల చేయనున్న సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 3, సామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 8లలో పొందుపరిచిన సరికొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఈ వర్చువల్ సమావేశంలో సామ్సంగ్ వెల్లడించనుంది. చదవండి : Tesla Electric Cars: టెస్లాకు భారీ దెబ్బ...! -
Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్ఫోన్తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్కు తదనంతర వాచ్‌గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై సుమారు రూ.2,000 వరకు స్మార్‌వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్‌ను షావోమి వెబ్సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది. చదవండి: షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి -
రియల్ మీ నుంచి రెండు స్మార్ట్ వాచెస్, సేల్స్ ప్రారంభం
లాస్ ఎంజెంల్స్ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా ప్రపంచంలో అతిపెద్ద గేమింగ్ ఆన్ లైన్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా రియల్ మీ సంస్థ రియల్ మీ వాచ్ 2, రియల్ మీ వాచ్ 2 ప్రో స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. దీంతో పాటు రియల్ మీ జిటి 5 జి స్మార్ట్‌ఫోన్, రియల్మీ ప్యాడ్, రియల్ మీ బుక్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ వాచ్ 2 ప్రైస్, ఫీచర్స్ రియల్మే వాచ్ 2 స్మార్ట్ ఫోన్ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ ప్లే, ఫుల్ ఛార్జింగ్ పెడితే 12 రోజుల వినియోగించుకునేలా బ్యాటరి వస్తుంది. ఇది IP68 (ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కోడ్) డస్ట్ మరియు వాటర్-రెసిస్టెంట్ కోటింగ్ తో మరియు 90 స్పోర్ట్స్ మోడ్లతో లభ్యమవుతుంది. అంతేకాదు బ్లడ్, ఆక్సిజన్ మరియు హార్ట్ బీట్ రేట్ ను కౌంట్ చేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్ ఫీచర్లను కలిగి ఉంది.దీని ధర 54.99 యూరోలు (సుమారు 4,889) తో కొనుగోలు చేయోచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ వాచ్ 2 ప్రో ప్రైస్ 'స్మార్ట్' రియల్ మీ వాచ్ 2ప్రో 1.75 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ వాచ్ 2 మాదిరిగానే రియల్మీ వాచ్ 2 ప్రో ఐపి 68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ తో వస్తుంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్లు, 100 కి పైగా వాచ్ ఫేస్‌లు, రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్, మాగ్నెటిక్ ఛార్జింగ్ బేస్ ఫీచర్స్ ఉన్నాయి. రియల్మీ వాచ్ 2 ప్రో ధర 74.99 యూరోలకే (రూ. 6,889 సుమారు.) సొంతం చేసుకోవచ్చు. నేటి నుండి రియల్మీ.కామ్ మరియు అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. రియల్ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ రియల్ మీ చెందిన రియల్ మీ టెక్ లైఫ్ రోబో వాక్యూమ్ విడుదలైంది. స్మార్ట్ మ్యాపింగ్, నావిగేషన్ సిస్టమ్‌కు సహాయపడే లిడార్ సెన్సార్లతో సహా 38 ఇంటర్నల్ సెన్సార్లతో వస్తుంది. కొత్తగా ప్రారంభించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌కు లిడార్ సెన్సార్ ఖచ్చితమైన రియల్ టైమ్ నావిగేషన్ మరియు ఖచ్చితమైన ఇన్-యాప్ రూమ్ మ్యాపింగ్ చేస్తుందని రియల్ మీ ప్రతినిథులు తెలిపారు. ఇక దాని పనితీరుకు సంబంధించి రియల్మీ టెక్లైఫ్ రోబోట్ సౌండ్ మోడ్‌లో శబ్దం స్థాయిలను 55dB కంటే తక్కువగా ఉంచుతుంది. 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 600 ఎంఎల్ డస్ట్ బిన్, 300 ఎంఎల్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ కలిగి ఉంది. ఇది వాక్యూమ్ ఒకేసారి నేలని శుభ్రపరుస్తుంది మరియు తుడుచుకుంటుందని రియల్ మీ ప్రతినిధులు విడుదల సందర్భంగా చెప్పారు. చదవండి: Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! -
శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..!
సాధారణంగా స్మార్ట్‌వాచ్స్, ఇయర్ బడ్స్, వాడేవారికి ఎక్కువగా వెంటాడే సమస్య బ్యాటరీ. బ్యాటరీ పూర్తిగా ఐపోతే అవి ఎందుకు పనికిరావు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను తప్పక ఛార్జ్ చేస్తూండాలి. కాగా సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలతో భవిష్యత్తులో ఈ ఛార్జింగ్ సమస్యకు వీడ్కోలు చెప్పవచ్చు. మన శరీరాన్నే వాహకంగా ఉపయోగించి స్మార్ట్‌వాచ్ లాంటి ఇతర వేయరబుల్స్ ను మొబైల్‌తో, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లతో ఛార్జీంగ్ చేయవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం ఈ టెక్నిక్‌ను ఆవిష్కరించింది. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ ద్వారా మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా మనం ధరించిన స్మార్ట్ వాచ్‌లను సులువుగా ఛార్జ్ చేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటి..? మమూలుగా మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంతోకొంత ఎలక్ట్రోమ్యాగ్నటిక్ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఈ క్షేత్రాలనుపయోగించి మన శరీరంలో ఏర్పాటుచేసిన రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌తో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, (స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్)లాంటి బ్యాటరీలను చార్జ్ చేయవచ్చును. ఫోటో కర్టసీ: నేచర్ ఎలక్ట్రానిక్స్ చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
సిస్కా నుంచి స్మార్ట్‌వాచ్..54 శాతం భారీ తగ్గింపు!
ప్రముఖ హోం లైటింగ్, స్మార్ట్ హోం పరికరాల తయారీదారు సిస్కా కంపెనీ కొత్తగా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. భారత్‌లో గణనీయమైన వృద్ధితో ఎదుగుతున్న స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి ప్రవేశించిన రెండో కంపెనీగా సిస్కా నిలిచింది. సిస్కా తన కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌వాచ్ బోల్ట్ ఎస్డబ్ల్యూ100ను ఆవిష్కరించింది. కాగా ఈ స్మార్ట్ వాచ్ 10 రోజుల లాంగ్‌లాస్టిక్ బ్యాటరీ బ్యాకప్‌ను కల్గి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఈ స్మార్ట్ వాచ్ 1.28 ఇంచుల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 10 రకాల విభిన్నమైన స్పోర్ట్స్ ట్రాకింగ్ మోడ్స్‌ను ఇందులో అమర్చారు. ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కల్గి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ వి5తో అన్ని రకాల ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చును. అంతేకాకుండా SpO2 పర్యవేక్షణ, చేతి శానిటైజేషన్ రిమైండర్, పల్స్‌రేటు, వెదర్ రిపోర్ట్ ను ఈ వాచ్ అందించనుంది. కాగా స్మార్ట్ వాచ్ స్పేక్ట్రా బ్లూ, స్పేస్ బ్లాక్, ఒషన్ గ్రీన్ కలర్ వేరియంట్లలో రానుంది. సిస్కా స్మార్ట్‌వాచ్ ధరను రూ. 5,499గా నిర్ణయించారు. కాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ వాచ్‌ను సుమారు 54 శాతం భారీ తగ్గింపుతో రూ. 2,499లకు అందించనుంది. చదవండి: ఆపిల్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం! -
రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ
ముంబై, సాక్షి: స్మార్ట్ ఫోన్స్ కంపెనీ రియల్ మీ.. స్మార్ట్ వాచీలను ప్రవేశపెట్టింది. ఎస్ ప్రో, ఎస్ బ్రాండ్లతో వీటిని విడుదల చేసింది. సర్క్యులర్ డిజైన్‌తోపాటు.. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్‌తో రూపొందించింది. కొంత ప్రీమియం మోడల్ అయిన ఎస్ ప్రో వాచీ ధర రూ. 9,999కాగా.. ఎస్ వాచీ ధర రూ. 4,999. వీటికి మధ్యస్థంగా ఎస్ మాస్టర్ ఎడిషన్ పేరుతో రూ. 5,999 ధరలో మరో మోడల్ వాచీని సైతం ప్రవేశపెట్టింది. వీటిని ఈ నెల 29 నుంచీ రియల్మీ, ఫ్లిప్‌కార్ట్ సైట్లతోపాటు.. స్టోర్లలోనూ విక్రయించనుంది. ఇతర వివరాలు చూద్దాం..(యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) ఫీచర్స్.. సింగిల్ బ్లాక్ డయల్ గల ఎస్ ప్రో, ఎస్ వాచీలు.. సిలికాన్ స్ట్రాప్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‌లో స్ట్రాప్స్ లభించనున్నాయి. వీటితోపాటు.. వేగన్ లెదర్ స్ట్రాప్స్ సైతం బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో లభిస్తాయి. వీటికి రూ. 499-999 అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్ ప్రో వాచీ 1.39 అంగుళాల అమోలెడ్ తెరను కలిగి ఉంటుంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో లభిస్తుంది. లైట్ సెన్సర్ ద్వారా బ్రైట్నెస్లో 5 లెవెల్స్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఏఆర్ఎం కార్టెక్స్ ఎం4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆధునిక ఆల్వేస్ ఆన్డిస్ప్లే ఫీచర్‌ను ఓటీఏ అప్డేట్ ద్వారా తదుపరి దశలో అందించనుంది. రియల్మీ లింక్ యాప్ ద్వారా 100 వాచ్ ఫేసెస్ అందుబాటులోకి వస్తాయి. ఔట్‌డోర్, ఇన్డోర్ రన్, వాక్, సైక్లింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, యోగా తదితర 15 రకాల స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌ను వినియోగించడం ద్వారా స్విమ్మింగ్‌లోనూ యూజ్ చేయవచ్చు. రోజంతా హార్ట్‌రేట్ మానిటరింగ్‌తోపాటు.. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్ విధానంతో లభిస్తుంది. 420 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మాగ్నిటిక్ చార్జింగ్ బేస్‌తో రెండు గంటల్లో పూర్తి చార్జింగ్కు వీలుంది. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఎస్ మోడల్ ఇలా ఎస్ వాచీ 1.3 అంగుళాల స్క్రీన్‌తో, 390 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందింది. 2.5డి కర్వ్డ్ గొరిల్లా గ్లాస్3ను అమర్చారు. రన్నింగ్, సైకిల్, ఎలిప్టికల్, ఫుట్‌బాల్, యోగా తదితర 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. రియల్ టైమ్ హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్‌కు ఎస్పీవో2 ఫీచర్‌ను కలిగి ఉంది. కనెక్ట్ చేసిన ఫోన్ నుంచి నోటిఫికేషన్స్ అందుకుంటుంది. స్విమ్మింగ్‌కు అనుకూలంకాదు. -
2 కొత్త ఫీచర్లతో Mi స్మార్ట్ బ్యాండ్ 5
ముంబై, సాక్షి: టెలికం కంపెనీ షియోమీ తయారీ ఎంఐ ఫిట్నెస్ బ్యాండ్ 5 తాజాగా రెండు కొత్త పీచర్స్‌ను జత చేసుకుంది. ఫర్మ్‌వేర్ అప్డేట్ ద్వారా ఫిట్నెస్ ట్రాకింగ్‌ను మరింత ఆధునీకరించింది. విజయవంతమైన ఎంఐ బ్యాండ్ 4కు పొడిగింపుగా.. స్లీక్ డిజైన్‌లో వచ్చిన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5లో రెండు ప్రధాన ఫీచర్స్‌ను అప్డేట్ చేసింది. 24గంటలపాటు నిద్రను ట్రాక్ చేసే స్లీప్ ట్రాకింగ్ సపోర్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. వెరసి ఈ సిరీస్‌లో వచ్చిన బ్యాండ్స్‌లో తొలిసారి స్లీప్ ట్రాకర్ ఫీచర్‌కు తెరతీసింది. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 ఓలెడ్ డిస్ప్లేతో 1.2 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. టచ్ బటన్ అడుగుభాగాన ఉంటుంది. యానిమేటెడ్ కేరక్టర్స్ ఎంఐ ఫిట్నెస్ బ్యాండ్ 5లో షియోమీ పలు సుప్రసిద్ధ కార్టూన్ కేరక్టర్స్‌తో కూడిన యానిమేటెడ్ వాచ్ ఫేసెస్‌కు వీలు కల్పించింది. ఫిట్నెస్ను ట్రాక్ చేసేందుకు 11 మోడ్స్ అందుబాటులో్ ఉంటాయి. మహిళలు మెన్స్ట్రువల్ సైకిల్స్‌ను ట్రాక్ చేసుకునేందుకు వీలుంది. శారీరక కదలికలు, హార్ట్‌రేట్ నమోదు చేసే పీఏఐ ఫంక్షనాలిటీని జత చేసింది. స్మార్ట్ఫోన్కుగల కెమెరా షట్టర్‌కు రిమోట్‌గా కూడా బ్యాండ్ 5ను వినియోగించవచ్చు. ఇక మరో ప్రధాన అంశం చార్జింగ్ టెక్నాలజీ. తాజా మోడల్లో చార్జింగ్ కోసం ట్రాకర్‌ను స్ట్రాప్స్ నుంచి వేరుచేయవలసిన అవసరముండదు. ఇతర స్మార్ట్ బ్యాండ్స్ తరహాలో మ్యాగ్నటిక్ డాక్‌ను అందిస్తోంది. తద్వారా స్ట్రాప్స్ తొలగించకుండానే బ్యాండ్‌ను డాక్లో ఉంచి చార్జింగ్ చేసుకోవచ్చు. -
చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో ఇయర్ బడ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్ వంటి వేరబుల్స్ వినియోగం భారత్‌లో అనూహ్యంగా అధికమవుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా 1.18 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయని ఐడీసీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి. ఇందులో ఇయర్‌వేర్ విభాగంలో 39.7 శాతం వాటా ఉన్న ట్రూ వైర్లెస్ స్టీరియో (ఇయర్‌బడ్స్) 40 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 1,156.3 శాతం పెరుగుదల. ధరలు తగ్గుముఖం పడుతుండడమూ వేరబుల్స్ సేల్స్ దూకుడుకు కారణం అవుతోంది. 2019 సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే స్మార్ట్ వాచ్ సగటు ధర రూ.13,125 నుంచి రూ.8,325లకు వచ్చి చేరింది. అలాగే ఇయర్‌బడ్స్ ధర 48 శాతం తగ్గి రూ.4,275లకు వచ్చింది. అందుబాటు ధరలో.. మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఆన్లైన్ విద్య, తరగతులు, వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ సమావేశాలు, వినోదానికి సమయం కేటాయించడం వంటి అంశాలూ అమ్మకాల వృద్ధికి దోహదం చేశాయని ఐడీసీ ప్రతినిధి అనిశా డుంబ్రే తెలిపారు. ట్రెండ్‌ను తయారీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలో వేరబుల్స్‌ను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. వైర్లెస్ డివైసెస్‌కు డిమాండ్ పెరగడంతో ఇయర్ వేర్ విభాగం 260.5 శాతం వృద్ధిని సాధించింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం హైగా చెప్పవచ్చు. ఈ విభాగంలో 32.4 శాతం వాటాతో బోట్ ముందు వరుసలో ఉంది. వన్ ప్లస్, వివో, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీల ఎంట్రీ కూడా అమ్మకాలకు బూస్ట్‌నిచ్చిందని కౌంటర్‌పాయింట్ తెలిపింది. రిస్ట్ బ్యాండ్స్ విభాగంలో 52.4 శాతం వాటాతో షావొమీ అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 14.6 శాతం వాటాతో రియల్మీ పోటీ పడుతోంది. భారత్‌లో రికార్డు స్థాయిలో స్మార్ట్ వాచెస్ అమ్ముడయ్యాయి. ఈ సెగ్మెంట్లో భారత బ్రాండ్ నాయిస్ 28.5 శాతం వాటాతో దూసుకెళ్తోంది. 24.2 శాతం వాటాతో రియల్మీ రెండవ స్థానంలో ఉంది. (భగ్గుమంటున్న కూరగాయల ధరలు) స్మార్ట్ వాచెస్ వైపు.. కస్టమర్లు అధునాతన వేరబుల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో రిస్ట్ బ్యాండ్స్‌కు బదులుగా స్మార్ట్ వాచెస్ కొనుగోలు చేస్తున్నారని ఐడీసీ తెలిపింది. తొలి అర్ధ సంవత్సరంలో తగ్గుదల చవిచూసిన రిస్ట్ బ్యాండ్స్ అమ్మకాలు.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు క్వార్టర్లో 83.3 శాతం పెరిగాయి. గతేడాది జూలై-సెప్టెంబరుతో పోల్చి చూస్తే 2020 మూడవ త్రైమాసికంలో 20.3 శాతం క్షీణించాయి. వాచెస్ విభాగం గతేడాదితో పోలిస్తే 119.9 శాతం వృద్ధితో సెప్టెంబరు క్వార్టర్లో 7,78,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్మార్ట్ వాచెస్ భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి. భారత వేరబుల్స్ విపణిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 6-8 శాతం ఉంటుందని కనెక్ట్ గ్యాడ్జెట్స్ సీవోవో ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు. -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న అక్షయ్
కరోనా వైరస్ లక్షణాలను గుర్తించే 500 స్మార్ట్ వాచ్‌లను నాసిక్ పోలీసుకు విరాళంగా అందించి బాలీవుడ్ స్థార్ అక్షయ్ కుమార్ మరోసారి తన ఉన్నత మనసును చాటుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ వాచ్‌లను ముంబై పోలీసులకు కూడా అందించారు. ఇంతక ముందు కూడా అక్షయ్ కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ అందించిన సహాయంపై నాసిక్ పోలీస్ కమిషనర్ విశ్వస్ నంగ్రే పాటిల్ ఖిలాడీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్మార్ట్ వాచ్‌లు ఎలా పనిచేస్తాయో, వీటి ద్వారా ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కమిషనర్ వివరించారు. (కరోనా పోరు: మరోసారి అక్షయ్ భారీ విరాళం) కరోనా కష్ట కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. తమకు తోచినంత సహాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. ఇక భారత్‌లో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర మొదటి వరుసలో ఉంది. ఇప్పటి వరకు 27,524 కేసులు బయటపడగా, 1029 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించారు. కాగా భారత్‌లో 85, 840 మంది కరోనా బారిన పడ్డారు. (అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం) -
స్మార్ట్ వాచ్‌లపై నిషేధం
లండన్: తమ దేశ క్రికెట్లో ఏమాత్రం అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అవినీతి నిరోధక నిబంధనలను మరింత కఠినం చేస్తూ మరింత పారదర్శకత క్రికెట్‌ను అభిమానులకు అందించేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా దేశవాళీ క్రికెట్లో స్మార్ట్ వాచ్‌లను నిషేధించింది. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో స్మార్ట్ వాచ్‌లు వాడకూడదని ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లు ఉపయోగించడం వలన సమాచార మార్పిడి జరిగే అవకాశం ఉండటంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈసీబీ పరిధిలో జరిగే ప్రతి ప్రత్యక్ష ప్రసారం జరిగే మ్యాచ్‌ల్లో ఈ నిషేధం ఉంటున్నట్లు తెలిపింది. అయితే లైవ్ టెలీకాస్ట్ కానీ మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్ రూమ్, డగౌట్లలో ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించవచ్చని పేర్కొంది. కౌంటీ చాంపియన్ షిప్-2019లో భాగంగా మైదానంలో ఉండగానే స్మార్ట్ వాచ్‌తో తాను ఇంగ్లండ్‌కు ఎంపికైన విషయం తెలిసిందని లాంక్షైర్ స్పిన్నర్ పార్కిన్సన్ పేర్కొన్నాడు. దీంతో అన్ని ప్రధాన మ్యాచ్‌ల్లో స్మార్ట్ వాచ్‌లను ఈసీబీ నిషేధించగా.. తాజాగా అన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు పొడిగించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్మార్ట్ వాచ్‌ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. -
యాపిల్ స్పెషల్ ఈవెంట్ అదిరిపోయే ఫోటోలు
-
స్విస్ వాచీల హైటెక్ రూటు!
లగ్జరీకి, ఖచ్చితత్వానికి స్విట్జర్లాండ్ (స్విస్)వాచీలు పెట్టింది పేరు. శతాబ్దాలుగా అనేక సవాళ్లను అధిగమిస్తూ దిగ్గజాలుగా ఎదిగిన స్విస్ వాచీ సంస్థలకు ప్రస్తుతం టెక్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌వాచీల రూపంలో మరో సవాలు ఎదురైంది. ప్రారంభంలో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌వాచీల తయారీపై స్విస్ దిగ్గజాలు కూడా దృష్టి పెడుతున్నాయి. వినూత్న స్మార్ట్, హైబ్రీడ్ వాచీలను రూపొందిస్తున్నాయి. సాంప్రదాయ వాచీలకు హైటెక్ హంగులు అద్దుతున్నాయి. ఇందుకోసం ట్యాగ్ హోయర్, స్వాచ్, ఫాజిల్ వంటి దిగ్గజాలు యాపిల్ పోటీ సంస్థలైన గూగుల్, ఇంటెల్ కార్పొరేషన్‌తో జత కడుతున్నాయి. ఓవైపు సాంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు టెక్నాలజీ ఫీచర్స్‌ను కూడా పొందుపరుస్తూ సొంత స్మార్ట్ వాచీలు, హైబ్రీడ్ వెర్షన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. న్యూఢిల్లీ: 2015లో యాపిల్ వాచీని తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు అంతర్జాతీయంగా స్విస్ వాచీల అమ్మకాలు తగ్గాయి. మళ్లీ కొన్నాళ్లుగా కాస్త పుంజుకున్నప్పటికీ యాపిల్ గట్టి పోటీనే ఇస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది యాపిల్ వాచీల అమ్మకాలు 40% పెరిగి 3.3 కోట్లకు చేరనున్నాయి. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలోనే యాపిల్ 88 లక్షల వాచీలను విక్రయించనుందని అంచనా. గణాంకాల ప్రకారం 2016లో మెకానికల్ వాచీల విక్రయాలను స్మార్ట్‌వాచీలు అధిగమించాయి. 2015లో అసలు ఊసే లేని హైబ్రీడ్ వాచీల అమ్మకాలు 2017లో 75 లక్షలుగా నమోదైనట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది. 2020 నాటికల్లా ఈ రెండు రకాల వాచీల అమ్మకాల పరిమాణం రెట్టింపవుతుందని సంస్థ అంచనా వేసింది. యాపిల్ సిరీస్ 4 వాచీల ధర 399 డాలర్ల నుంచి ఉంటున్న నేపథ్యంలో పెద్ద సంస్థలతో పోలిస్తే ఆ శ్రేణికి దరిదాపుల్లో తమ వాచీలను విక్రయించే చిన్న స్విస్ సంస్థలే ఎక్కువగా పోటీని ఎదుర్కొనాల్సి వస్తోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హైబ్రిడ్కి ప్రాధాన్యం.. కొన్ని సంస్థలు స్మార్ట్ వాచీల వైపు మళ్లుతుండగా.. చాలా మటుకు కంపెనీలు హైబ్రిడ్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. వీటిలో టచ్ స్క్రీన్లు ఉండవు. ఇవి యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌కి అనుసంధానమవుతాయి. కాల్స్, మెసేజీల్లాంటివేమైనా వస్తే వైబ్రేషన్, లైట్లు ఆరి వెలగడం వంటి ఫీచర్స్‌తో అలర్ట్ చేస్తాయి. బ్లూటూత్ కనెక్షన్‌తో వాచీలోని పుష్ బటన్స్‌ని ఉపయోగించి.. ఫోన్ కెమెరా, మ్యూజిక్ ఫంక్షన్స్ మొదలైనవాటిని ఆపరేట్ చేయొచ్చు. ట్యాగ్ హోయర్లో అత్యంత చౌకైన వాచీ ధర కూడా 1,200 డాలర్ల పైమాటే. లగ్జరీ స్విస్ వాచీ తయారీ సంస్థలపై యాపిల్ ప్రభావం మరీ అంతగా లేకున్నా.. అవి ముందుగా హైబ్రిడ్ వాచీలతో మొదలుపెట్టి. ఆ తర్వాత పూర్తి స్థాయి స్మార్ట్ వాచీల వైపు మళ్లాలని భావిస్తున్నాయి. వినూత్న ఫీచర్స్‌కు పెద్ద పీట.. స్మార్ట్‌వాచీలను సాధ్యమైనంత వినూత్నంగా తయారు చేసేందుకు స్విస్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ట్యాగ్ హోయర్ ఇటీవలే కనెక్టెడ్ మాడ్యులర్ 41 పేరిట తమ స్మార్ట్‌వాచీలకు అప్‌గ్రేడ్ అందించింది. ఈ వాచీల్లో ఫిట్నెస్ ట్రాకింగ్, జీపీఎస్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అటు మరో సంస్థ హుబ్లో .. ఇతర సంస్థల భాగస్వామ్యంతో లిమిటెడ్ ఎడిషన్ వాచీలను ప్రవేశపెడుతోంది. 2018 సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా బిగ్ బ్యాంగ్ రిఫరీ పేరిట ఇలాంటి వాటిని అందుబాటులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు గేమ్ అలర్ట్‌లు అందించడం తదితర ఫీచర్స్‌తో రూపొందించిన ఈ వాచీలను పరిమిత స్థాయిలో 2,018 మాత్రమే విక్రయించింది. స్వాచ్ గ్రూప్ తమ లేటెస్ట్ వాచీ.. స్వాచ్ బెలామీ 2లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఫీచర్‌ను పొందుపర్చింది. అంతేగాకుండా వాచీల కోసం స్వాచ్ ఓఎస్ పేరిట సొంత ఆపరేటింగ్ సిస్టంపై కూడా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఓఎస్‌పై పనిచేసే వాచీలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా హైబ్రిడ్ వాచీల మార్కెట్లో అమెరికాకు చెందిన ఫాజిల్ గ్రూప్ అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి మూడు హైబ్రిడ్ వాచీల్లో ఒకటి ఫాజిల్ గ్రూప్‌దే ఉంటోంది. ఎంపోరియో, అర్మానీ, డీజిల్ వంటి దిగ్గజ బ్రాండ్స్‌తో కలిసి ఈ గ్రూప్ ఈ ఏడాది సుమారు 25 కొత్త వాచీలను ప్రవేశపెట్టింది. వీటిల్లో గుండె కొట్టుకుంటున్న వేగాన్ని తెలిపే ఫీచర్‌తో పాటు గూగుల్ పే టెక్నాలజీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఫాజిల్ గ్రూప్ విక్రయించే హైబ్రిడ్ వాచీల్లో అత్యంత చౌకైన మోడల్స్‌లో క్యూ మోడర్న్ పర్సూట్ కూడా ఒకటి. దీని ధర 155 డాలర్లు (సుమారు రూ. 10,850). -
ఇక విదేశీ స్మార్ట్ఫోన్లు కొనాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ: అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వస్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత భారం కావడం ఖాయం. గత పదిహేనురోజుల్లోనే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడం ఇది రెండవ సారి. ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 17రకాల వస్తులపై దిగుమతి పన్నును పెంచింది. వీటిల్లో స్మార్ట్‌వాచీలు,స్మార్ట్‌ఫోన్ ఎక్విప్మెంట్స్/ కంపోనెంట్స్ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA) వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇన్‌పుట్స్‌పై కూడా దిగుమతి సుంకం పెంచింది. దీంతో వీటిపై ప్రస్తుతం 10శాతంగా ఉన్న పన్ను 20 శాతానికి చేరింది. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్ వస్తువులను నిషేధిస్తూ మరో నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్టయింది. ఇటీవల 19 రకాల (ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, లెదర్ వస్తువులు, విమాన ఇంధనం తదితర)వస్తువులపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించింది. కాగా కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో కొన్ని వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధిస్తామని సెప్టెంబరులో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరగా అక్టోబర్ నాటికి డాలరు మారకంలో భారత కరెన్సీ 7 శాతం క్షీణించి రికార్డు కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్ వాచ్లకు అనుమతి లేదు: ఐసీసీ
దుబాయ్: ఆటలో అక్రమాలకు ఆస్కారమిచ్చే ఏ మార్గాన్నీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉపేక్షించబోమంటోంది. ఇందులో భాగంగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి ఎటువంటి సమాచార సాధనాలు తీసుకెళ్లరాదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ)లో స్మార్ట్ వాచ్‌లు ధరించవద్దని పేర్కొంటూ ఈ మేరకు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ‘ఫోన్ లేదా వైఫైతో అనుసంధానమై సమాచారాన్ని స్వీకరించగల స్మార్ట్ వాచ్‌లను ధరించవద్దని క్రికెటర్లకు గుర్తు చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే మైదానానికి చేరిన వెంటనే ఫోన్‌తో పాటు అప్పగించేయాలి’ అని నిర్దేశించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించడంతో ఈ అంశం చర్చకు తావిచ్చింది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలకు దారితీస్తుందేమోనని భావించిన ఐసీసీ... తక్షణమే అప్రమత్తమైంది. క్రీడాకారులు ఈ తరహా పరికరాలను గ్రౌండ్లోకి తేవడంపై నిషేధం ఉంది. తాజా ఆదేశాల్లో దానిని డ్రెస్సింగ్ రూమ్‌కూ వర్తింపజేశారు. సహచరులతో సంభాషించేందుకు మ్యాచ్ అధికారులకు మాత్రం ప్రత్యేక పరికరాలను అనుమతిస్తారు. మరోవైపు గత నవంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో ఉన్న భారత కెప్టెన్ కోహ్లి వాకీటాకీలో మాట్లాడటం కెమెరాకు చిక్కింది. ఇది చర్చకు దారితీసింది. -
పాక్ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్
లండన్: పాకిస్థాన్ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్ వాచ్‌లతో ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్ హసన్ అలీ మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు ఇంగ్లాండ్ టూర్లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిటెస్ట్ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్ టీమ్‌కు ఆదేశాలు అందాయి. పాక్ టీమ్ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్లో స్మార్ట్ వాచ్‌ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్(కమ్యూనికేషన్‌కు సంబంధించి) డివైజ్‌లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడటం, పాక్ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. The ICC has confirmed that smart watches are not allowed on the field of play or areas designated as the Player and Match Officials Area (PMOA).https://t.co/MAv4mRNAqv pic.twitter.com/tYgDi1LJwn — ICC (@ICC) 25 May 2018 -
మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచెస్
సాక్షి, హైదరాబాద్: వాచ్ రిటైలర్ ఫాసిల్ ఇండియా లిమిటెడ్ తో రిలయన్స్ డిజిటల్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఫాసిల్ యొక్క సరికొత్త శ్రేణి స్మార్ట్ వాచీలను రిలయన్స్ డిజిటల్ తమ ఎంపిక చేసిన స్టోర్లలో విక్రయించనుంది. తొలుత హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్ స్టోర్ లలో ఫాసిల్ వాచీలు అందుబాటులో ఉంటాయని, రానున్న రోజుల్లో మిగిలిన స్టోర్లకు దీన్ని విస్తరించనున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. కాగా ఇప్పటికే తమ స్టోర్లలో స్కాజెన్, మైఖేల్ కోర్స్, మిన్ ఫిట్, డిజిల్ ఆన్ బ్రాండ్లకు వాచీలను విక్రయిస్తునట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. -
శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్‌లు
దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘గేర్ ఎస్2’, ‘గేర్ ఎస్2 క్లాసిక్’ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌వాచ్‌ల ధరలు వరుసగా రూ.24,300గా, రూ.25,800గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. చిత్రంలో ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న శాంసంగ్ ఇండియా (ఐటీ, మొబైల్) మార్కెటింగ్ డెరైక్టర్ మను శర్మ. -
ఫ్యాషన్ అలర్ట్
అమ్మాయిలూ... స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బ్యాండ్లను మరిచిపోండి. ఇప్పుడు మీ అభిరుచులకు సరిపడే, అచ్చమైన ఫ్యాషన్ స్టేట్మెంట్ గాడ్జెట్ వచ్చేసింది. బాగా వెడల్పుగా ఉన్న గాజులా కనపడే ఈ ‘ఐ క్యాచర్ బ్రాస్లెట్’ యువతులకు బాగా నప్పుతుంది. స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్‌తో కనెట్ట్ అయ్యే ఈ బ్రాస్లెట్ మన ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఫేస్బుక్, ట్వీటర్... ఇలా అన్ని సందేశాలను ఐదు అంగుళాల తెరపై చక్కగా చూపుతుంది. మనల్ని అలర్ట్ చేస్తుంది. అంటే మనం తరచూ ఫోన్‌ను చెక్ చేయనక్కర్లేదు. ఈ బ్రాస్లెట్ తెరపైనే వచ్చిన సందేశాలను చదువుకోవచ్చు. దీనికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే అమ్మాయిలు తాము వేసుకున్న డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా దీని డిస్ప్లే డిజైన్‌ను మార్చుకోవచ్చు. కాలిఫోర్నియాలోని ఒక్లాండ్కు చెందిన లుక్సీ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన దీని ధర దాదాపు 15,500 రూపాయలు. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లోనే అందుబాటులో ఉంది.