
సాక్షి, హైదరాబాద్: వాచ్ రిటైలర్ ఫాసిల్ ఇండియా లిమిటెడ్ తో రిలయన్స్ డిజిటల్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఫాసిల్ యొక్క సరికొత్త శ్రేణి స్మార్ట్ వాచీలను రిలయన్స్ డిజిటల్ తమ ఎంపిక చేసిన స్టోర్లలో విక్రయించనుంది. తొలుత హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్ స్టోర్ లలో ఫాసిల్ వాచీలు అందుబాటులో ఉంటాయని, రానున్న రోజుల్లో మిగిలిన స్టోర్లకు దీన్ని విస్తరించనున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది.
కాగా ఇప్పటికే తమ స్టోర్లలో స్కాజెన్, మైఖేల్ కోర్స్, మిన్ ఫిట్, డిజిల్ ఆన్ బ్రాండ్లకు వాచీలను విక్రయిస్తునట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది.


Comments
Please login to add a commentAdd a comment