Fossil
-
అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!
పాములకు సంబంధించిన వివిధ జాతులు, అతిపెద్ద పాములు గురించి విన్నాం. తాజాగా శాస్త్రవేత్తలు గుజరాత్లో అది పెద్ద పాము ఉనికికి సంబంధించిన శిలాజాన్ని గుర్తించారు. ఆ శిలాజంలో పాము వెన్నుపూస డైనోసర్ టీ రెక్స్(వెన్నుపూస) కంటే పొడవుగా ఉండే అతి పెద్ద పాము అవశేషాలని తెలిపారు. నిజానికి 2005ల ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పాముని కనుగొనడం జరిగింది. అయితే ఇటీవలే దాన్ని ఒక పెద్ద పాముగా నిర్థారించారు. దీనికి "వాసుకి ఇండికస్" అని పేరు పెట్టారు. పరిశోధనలో ఈ పాములో దాదాపు 27 వెనుపూసలు ఉన్నట్లు గుర్తించారు. అదిపెద్ద కొడచిలువ వలే కనిపించిందని, విషపూరితమైనది కాదని అన్నారు. ఈ పాము పొడవు సుమారు 50 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. దీని బరువు సుమారు టన్ను ఉంటుందని చెబుతున్నారు. ఈ వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రెడేటర్‌గా అభివర్ణించారు. ఈ పాము చిత్తడి నేలలో నివిశించిందని ఐఐటీ రూర్కిలోని పాలియోంటాలిజీ పరిశోధకుడు దేబిజిత్ దత్తా అన్నారు. ఈ జాతుల మూలాలను అన్వేషించే క్రమంలో ఈ పాము శిలాజానికి శివుడితో సంబంధం ఉందని, అందువల్ల దీనికి వాసుకి అని పేరు పెట్టామని చెప్పారు. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచిన కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి సరిసమానమైనదని అన్నారు. ఇక ఈ టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకు పైగా బరువుతో ఉంది. ఇక్కడ ఈ వాసుకిమ పాము శరీర పొడవుని టైటానోబోవాతో పోల్చగా, టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టైటానోబోవా కంటే వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేద? చెప్పలేమని అన్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ శిలాజం పొడిగ, ధూళిగా ఉన్న ప్రాంతంలో గుర్తించినప్పటికీ ఈ వాసుకి పాము సంచరించేటప్పుడు ఆ ప్రాంతంలోని భూమి చిత్తడిగా ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ పాముల పరిమాణ పరంగా ఎలా ఉండేవి, కాలక్రమంలో ఎలా మారాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఎలా విస్తరించాయి అనే దానిపై పూర్తి అవగాహన అందిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఆసియాలోని రెటిక్యులేటెడ్ అనే కొండ చిలువ(33 అడుగులు పొడవు)తో ఉంది. (చదవండి: రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?) -
ఆ గుండె వయసు.. 38 కోట్ల సంవత్సరాలు!!
వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. గోగో చేప.. ఊహాత్మక చిత్రం ఇదీ చదవండి: కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు -
150 మిలియన్ ఏళ్ల నాటి జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు
150 million-year-old marine invertebrate Named after Ukraine President: పోలాండ్లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు పెట్టారు. ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించారు. ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి. ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. (చదవండి: పాపం యాన్ యాన్.. తిండి మానేసి మరీ కన్నుమూసింది) -
మహారాష్ట్ర సమీపంలో డైనోసర్ ల ఆనవాళ్ళు
-
మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచెస్
సాక్షి, హైదరాబాద్: వాచ్ రిటైలర్ ఫాసిల్ ఇండియా లిమిటెడ్ తో రిలయన్స్ డిజిటల్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఫాసిల్ యొక్క సరికొత్త శ్రేణి స్మార్ట్ వాచీలను రిలయన్స్ డిజిటల్ తమ ఎంపిక చేసిన స్టోర్లలో విక్రయించనుంది. తొలుత హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్ స్టోర్ లలో ఫాసిల్ వాచీలు అందుబాటులో ఉంటాయని, రానున్న రోజుల్లో మిగిలిన స్టోర్లకు దీన్ని విస్తరించనున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. కాగా ఇప్పటికే తమ స్టోర్లలో స్కాజెన్, మైఖేల్ కోర్స్, మిన్ ఫిట్, డిజిల్ ఆన్ బ్రాండ్లకు వాచీలను విక్రయిస్తునట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. -
వేరబుల్ విభాగంలోకి ఫాజిల్ గ్రూప్
♦ ఫాజిల్, మిస్ఫిట్ సహా ఆరు బ్రాండ్లతో మార్కెట్లోకి ♦ వచ్చే ఏడాదికల్లా వందకు పైగా కొత్త ఉత్పత్తులు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అమెరికన్ లగ్జరీ వాచ్‌లు, ఫ్యాషన్ యాక్ససరీస్ల కంపెనీ ఫాజిల్... వేరబుల్ డివెజైస్ విభాగంలోకి పెద్ద ఎత్తున వస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ మిస్ ఫిట్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. మిస్ఫిట్ తాలూకు వేరబుల్ డివెజైస్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా. దీంతో పాటు మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లు కూడా ఫాజిల్ చేతిలోనే ఉన్నాయి. ఈ బ్రాండ్లు అన్నిటినుంచీ త్వరలో వేరబుల్ డివెజైస్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఫాజిల్ గ్రూప్ ఏసియా పసిఫిక్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాక్ క్విన్లాన్ ప్రకటించారు. బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ వేరబుల్ డివెజైస్ అన్నిటినీ ప్రదర్శించారు కూడా. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో తాము ఏటా 40 శాతం కాంపౌండింగ్ వృద్ధిని సాధిస్తున్నట్లు క్విన్లాన్ తెలియజేశారు. ‘‘తమ చేతికి ధరించే వస్తువు కేవలం సమయాన్ని చూపించటమే కాక మరిన్ని చేయాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. పెపైచ్చు అది చాలా వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఆ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకునే మేం ఈ మార్కెట్లోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నాం’’ అని కంపెనీ కనెక్టింగ్ డివెజైస్ విభాగ సీటీఓ సొన్నీ వ్యూ చెప్పారు. ఇండియాలో ప్రస్తుతం ఫాజిల్‌కు 400 స్టోర్లున్నాయని, ఆసియాలో జపాన్ తరవాత ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని ఫాజిల్ గ్రూప్ ఇండియా ఎండీ వసంత్ నంగియా చెప్పారు. 2020 నాటికి వాచ్‌ల అమ్మకాలను వేరబుల్ డివెజైస్ మించిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. వేరబుల్ డివెజైస్‌తో ఎన్ని కేలరీస్, దూరం, నిద్ర వంటి పలు అంశాలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయొచ్చని చెప్పారాయన. ప్రస్తుతం మిస్ఫిట్ బ్రాండ్ కింద లభిస్తున్న డివెజైస్ ప్రారంభ ధర రూ.7,495గా ఉంది. కంపెనీ ఫాజిల్ క్యూ బ్రాండ్ కింద వండర్, మార్షల్ అనే రెండు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ప్రారంభ ధర రూ. 21,995గా ఉంది. ఇక మైకేల్ కోర్, స్కాగెన్, ఎంపోరియో అర్మానీ, చాప్స్ బ్రాండ్లలో హైబ్రిడ్ స్మార్ట్‌వాచ్‌ల ధరలు రూ.9,995-రూ.29,495 శ్రేణిలో ఉన్నాయి.