ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్‌ఫోన్‌తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్‌కు తదనంతర వాచ్‌గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది.
షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై సుమారు రూ.2,000 వరకు స్మార్‌వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్‌ను షావోమి వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది.
Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..!
Published Mon, Jun 21 2021 4:05 PM | Last Updated on Mon, Jun 21 2021 4:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment