reduced price
-
వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. మిల్లర్లు తమ ఇష్టానుసారంగా ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. నాలుగు రోజుల కిందటి వరకు బాగానే ధర చెల్లించిన మిల్లర్లు ఒక్కసారిగా తగ్గించేశారు. శుక్ర, శనివారాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో క్వింటాల్‌పై రూ.300 నుంచి రూ.450 వరకు తగ్గించి కొనుగోలు చేశారు. నాలుగు రోజుల కిందటి వరకు సన్నరకం (చింట్లు) ధాన్యం క్వింటాల్‌కు రూ.2,200 చెల్లించగా, మిర్యాలగూడ ప్రాంతంలోని కొన్ని మిల్లుల్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.1,850 చెల్లించారు. ఇక త్రిపురారంలోని ఓ మిల్లులో శనివారం క్వింటాల్‌కు కేవలం రూ.1,750 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులు పడిగాపులు.. నల్లగొండ జిల్లాలో ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో సన్నాల కోతలు 15 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దీంతో పది రోజులుగా రైతులు మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముతున్నారు. మొదట్లో ధాన్యం తక్కువగా రావడంతో ఎక్కువ ధర చెల్లించిన మిల్లర్లు, ఇప్పుడు ధాన్యం రాక ఎక్కువ కావడంతో ధరను తగ్గించేశారు. అంతేకాక రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో రెండు, మూడు రోజల పాటు కొనుగోలు చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. రైతులు విసిగిపోయి తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తారనే ఉద్దేశంతోవారు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్ల త్రిపురారం మండలంలోని ఒక్కో మిల్లు వద్ద 20 నుంచి 30 ట్రాక్టర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 25 శాతం ఉమ్మడి జిల్లా నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ధాన్యం దిగుబడిలో 25 శాతం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తోంది. అత్యధింగా 250 రైస్ మిల్లులు ఉన్నది ఇక్కడే. నల్లగొండ జిల్లాలో 130, సూర్యాపేట జిల్లాలో 83, యాదాద్రి జిల్లాలో 37 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాలు, దొడ్డు ధాన్యం కలిపి దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో సన్నాలు 2,34,752 ఎకరాల్లో సాగు చేయగా, 4,59,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు ధాన్యం 2,09,226 ఎకరాల్లో సాగు చేయగా అందులో 6,54,157 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం 4,43,973 ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న, దొడ్డు ధాన్యం కలిపి 11,13,604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 4,61,532 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అందులో 3,45,081 ఎకరాలలో సన్న రకాలు, 1,16,449 ఎకరాలలో దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా 8,28,196 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 3,26,058 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.. ధర స్థిరంగా ఉండేలా చూడాలి నాకున్న 8 ఎకరాల్లో హెచ్ఎంటీ రకం సాగుచేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మిల్లుకు వెళుతున్నారు. మొదట్లో ధర బాగానే పెట్టినా ఇప్పుడు క్వింటాల్‌కు రూ.1,870 మాత్రమే చెల్లిస్తున్నారు. ధర స్థిరంగా ఉండేలా చూడాలి. – చల్లా ప్రదీప్‌కుమార్, అన్నపరెడ్డిగూడెం ధర తగ్గించారు మొన్నటి వరకు మిల్లర్లు రూ.2,200 పెట్టినా ఇప్పుడు ధర తగ్గించారు. నాకున్న 2.1 ఎకరాల్లో చింట్లు సాగు చేయగా 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.1,850 ఇస్తామంటున్నారు. – ధీరావత్ తుకారాం, ఏడుకోట్ల తండా రూ.1,750 ఇస్తున్నారు ఈసారి పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర తగ్గించారు. మొదట రూ. 2,200 ఉందని సంతోష పడ్డాం. ఇప్పుడు మిల్లుకు వచ్చేసరికి క్వింటాలుకు రూ.1,750 ఇస్తున్నా రు. గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – యేమిరెడ్డి వెంకట్‌రెడ్డి, త్రిపురారం -
Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్ఫోన్తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్కు తదనంతర వాచ్‌గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్‌పై సుమారు రూ.2,000 వరకు స్మార్‌వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్‌వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్‌ను షావోమి వెబ్సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది. చదవండి: షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి -
ఎరువు ధర తగ్గిందోచ్!
ఎట్టకేలకు ఎరువుల ధరలు తగ్గాయి. రైతుకు పెద్ద భారం తగ్గింది. ఏటా పెరుగుతున్న ధరలతో రైతు దిగాలుపడినా... తప్పనిసరి పరిస్థితుల్లో భారం భరించేవాడు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. రైతు మోములో చిరునవ్వు కనిపించింది. బొండపల్లి(గజపతినగరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆసరాగా నిలవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం పెరిగిన ఎరువుల ధరలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు వ్యవసాయం పెనుభారంగా పరిణమించిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పాలకులు ఎరువుల ధరలను భారీగా పెంచడంతో రైతులపై పెనుభారం పడింది. కేవలం రూ. 950లున్న డీఏపీ బస్తా ధర గడచిన ఐదేళ్లలో రూ. 1430ల వరకు పెరిగింది. అంతే గాకుం డా అన్ని రకాల ఎరువుల ధరలు గత ఐదేళ్లలో రూ. 200 లు నుంచి రూ. 400 ల వరకు పెరి గింది. ఈ తరుణంలో రైతులపై పడిన భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితమని రైతాం గం అభిప్రాయపడుతోంది. తగ్గించిన ధరలు ఈ నెల మొదటివారంనుంచి అమలులోకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డీలర్లు, సహకార సంఘాల వద్ద ఇప్పటికే నిల్వ ఉన్న సరకు తాజాగా నిర్థారించిన ధరలకే విక్రయిం చాలని ప్రభుత్వం అందరు డీలర్లు, సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. అలా కాదని పాత ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రైతులకు ఉపశమనం.. ఎరువుల ధరలు తగ్గించడం వల్ల రైతులపై భా రం తగ్గనుంది. ప్రతి బస్తా పైనా రెండు నెలల క్రితం రూ. 125 ల నుంచి రూ. 150ల వరకు కంపెనీని బట్టి ధరలు పెంచగా, ప్రభుత్వం దా నిని సవరిస్తూ ఒక్కో బస్తాపై రూ. 50ల వరకు తగ్గించింది. డీఏపీతోపాటు కొన్ని రకాల కాంపె ్లక్స్ ఎరువుల ధరలు తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరకనుంది. రైతుకు ఆసరా.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎరువుల ధరలు తగ్గడం వల్ల రైతులకు కొంత వరకు ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం భారంగా మారింది. ఈ తరుణంలో ధరలు తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకోవడం ముదావహం. – గెద్ద సత్యనారాయణ రైతు, బొండపల్లి కొత్త ధరలకే విక్రయించాలి.. ప్రభుత్వం డీఏపీ, పొటాష్‌తో సహా కొన్ని రకాలైన ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఒక్కో బస్తాపై రూ. 50లు తగ్గించింది. డీలర్లు, సహకార సంఘాల్లో ఎరువులు విక్రయించేవారు కొత్త ధరలకే ఎరువులు విక్రయించాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – కె,మహరాజన్, ఏడీఏ, గజపతినగరం రైతులకు కొంతవరకు మేలు.. ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత వరకు రైతులకు ఉపశమనం కలగనుంది. ఇప్పటిప్పుడే మండలం లో కురుస్తున్న వర్షాలకు నాట్లు పడుతున్నా యి. ఇప్పుడు డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల అవసరం ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది తొలగనుంది. – కర్రోతు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, వేండ్రాం, బొండపల్లి మండలం -
ఉల్లి రైతుల ఆందోళన
-
ఉల్లి రైతుల ఆందోళన
నిన్నటి వరకూ కస్టమర్స్ తో కన్నీరు పెట్టించిన ఉల్లి.. తాజాగా.. రైతులను ఆందోళన పరుస్తోంది. రెండు వారాల్లో అన్యూహ్యంగా ఉల్లిధర పడిపోయింది. గత నెలలో కిలో 100 రూపాయలు పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.3 పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ క్వింటాల్ రూ. 1200 తాజాగా రూ.300 పడిపోయింది. దీంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులను సమాధాన పరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
చక్కెర ఫ్యాక్టరీలకు చే(టు)దు కాలం
అమ్మకం ధర టన్ను రూ.2,600 ఉత్పత్తి వ్యయం రూ.3,400 ధరలేక పేరుకుపోతున్న నిల్వలు గడ్డు స్థితిలో చక్కెర ఫ్యాక్టరీలు మార్కెట్లో పంచదార ధర రోజురోజుకూ ఎప్పుడూ లేనంతగా తగ్గిపోతోంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున దేశీయ చక్కెర మార్కెట్లోకి దిగుమతి అవుతుండటంతో ఇక్కడి పంచదారకు డిమాండ్ తగ్గింది. క్రమంగా ధర క్షీణిస్తూ కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా లక్షలాది టన్నుల పంచదార కర్మాగారాల గిడ్డంగుల్లో మగ్గిపోతోంది. చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని లక్ష్మీపురం, ఉయ్యూరు, హనుమాన్‌జంక్షన్ చక్కెర కర్మాగారాల్లో పంచదార నిల్వలు గిడ్డంగులలో మూలుగుతున్నాయి. ఈ సీజన్లో ఉత్పత్తి అయిన పంచదారతో పాటు పాత నిల్వలు కూడా పేరుకుపోయాయి. లక్ష్మీపురం కర్మాగారంలో 1.18 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడి 8.5 శాతం, ఉయ్యూరులో 2.60 లక్షల టన్నులకు 9.5 శాతం, హనుమాన్‌జంక్షన్‌లో 1.16 లక్షల టన్నులకు 9 శాతం సగటు రికవరీ సాధించారు. దీంతో ఆయా ఫ్యాక్టరీల ద్వారా ఈ సీజన్లో వరుసగా 1.03 లక్షల టన్నులు, 2.47 లక్షల టన్నులు, 1.04 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయ్యి గోడౌన్లకు చేరింది. 2013 జూన్‌లో పంచదార ధర క్వింటాకు రూ.3,200 ఉండగా ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ జనవరి నాటికి రూ.2,600కు దిగజారింది. చలి ఎక్కువగా ఉంటే చక్కెర దిగుబడి బాగుంటుందని ఆశించి రికవరీపై గంపెడాశతో గత నవంబర్ మూడు, నాలుగో వారాల్లో క్రషింగ్ ప్రారంభించిన చక్కెర ప్యాక్టరీలకు నిరాశే మిగిలింది. చలి తగ్గిపోవటం వల్ల అనుకున్నంత రికవరీ రావటంలేదు. తగ్గిన ధరలతో చక్కెర కర్మాగారాలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. దిగుబడీ అంతంతే... ఈ ఏడాది చెరుకు దిగుబడీ ఆశాజనకంగా లేదు. క్రషింగ్ ప్రారంభానికి ముందే హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల కురిసిన భారీ వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది లక్ష్మీపురం ఫ్యాక్టరీ 3 లక్షల టన్నులు, ఉయ్యూరు 8 లక్షల టన్నులు, హనుమాన్‌జంక్షన్ ఫ్యాక్టరీ 2.40 లక్షల టన్నులు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు మూడింట ఒక వంతు మాత్రమే పూర్తయింది. ఆశించినమేర రికవరీ రాకపోవటంతో క్వింటా పంచదార తయారీకి రూ.3,200 నుంచి రూ.3,400 వరకు ఖర్చవుతోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటా పంచదార ధర రూ.2,600గా ఉంది. దీనినిబట్టి చూస్తే అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కంటే తయారీపై అయ్యే ఉత్పత్తి ఖర్చే ఎక్కువగా ఉంది. ఈ అదనపు భారంతో ఫ్యాక్టరీలు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం ఒక్క ఫ్యాక్టరీ పైనే కాదని, రైతులకు ఇచ్చే మద్దతు ధరపై కూడా పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి చక్కెర కర్మాగారాలు ఎలా నిలదొక్కుకుని బయటపడతాయో వేచిచూడాలి. పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదే? ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోవటానికి పూర్తి బాధ్యత పాలకవర్గం, యాజమాన్యానిదేననేది రైతుల వాదన. ప్రతి మూడేళ్లు లేదా నాలుగేళ్లకోసారి చక్కెర మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని చెబుతున్నారు. ఇది తెలిసినా ధర పతనమవుతున్న తొలినాళ్లలోనే పంచదారను అమ్మకుండా గిడ్డంగులలో నిల్వ ఉంచటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ యంత్రాంగం వైఫల్యమని విమర్శిస్తున్నారు.