చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది.
షావోమీ గతేడాది ఎస్‌యూ7 (ఎస్‌యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది.
ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్‌లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్‌యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
కాగా షావోమీ ఎస్‌యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్‌యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్‌యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment