సిస్కా నుంచి స్మార్ట్‌వాచ్‌..54 శాతం భారీ తగ్గింపు! | Syska Launches New Smart Watch Flipkart Offers Huge Discount | Sakshi
Sakshi News home page

సిస్కా నుంచి స్మార్ట్‌వాచ్‌..54 శాతం భారీ తగ్గింపు!

Published Fri, Jun 11 2021 6:21 PM | Last Updated on Fri, Jun 11 2021 6:27 PM

Syska Launches New Smart Watch Flipkart Offers Huge Discount - Sakshi

ప్రముఖ హోం లైటింగ్, స్మార్ట్ హోం ప‌రిక‌రాల‌ త‌యారీదారు సిస్కా కంపెనీ కొత్తగా స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. భారత్‌లో గణనీయమైన వృద్ధితో ఎదుగుతున్న స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన రెండో కంపెనీగా సిస్కా నిలిచింది. సిస్కా త‌న కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌వాచ్‌ బోల్ట్‌ ఎస్‌డ‌బ్ల్యూ100ను ఆవిష్క‌రించింది. కాగా ఈ స్మార్ట్‌ వాచ్‌ 10 రోజుల లాంగ్‌లాస్టిక్‌ బ్యాటరీ బ్యాకప్‌ను కల్గి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కోవిడ్‌-19 దృష్టిలో ఉంచుకొని స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఈ స్మార్ట్‌ వాచ్‌ 1.28 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 10 ర‌కాల విభిన్న‌మైన స్పోర్ట్స్ ట్రాకింగ్ మోడ్స్‌ను ఇందులో అమర్చారు. ఐపీ 68 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కల్గి ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ బ్లూటూత్‌ వి5తో అన్ని రకాల ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్లతో కనెక్ట్‌ చేసుకోవచ్చును. అంతేకాకుండా SpO2 పర్యవేక్షణ, చేతి శానిటైజేషన్ రిమైండర్, పల్స్‌రేటు, వెదర్ రిపోర్ట్ ను ఈ వాచ్‌ అందించనుంది. కాగా స్మార్ట్‌ వాచ్‌ స్పేక్ట్రా బ్లూ, స్పేస్‌ బ్లాక్‌, ఒషన్‌ గ్రీన్‌ కలర్ వేరియంట్లలో రానుంది.

సిస్కా స్మార్ట్‌వాచ్‌ ధరను రూ. 5,499గా నిర్ణయించారు. కాగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ వాచ్‌ను సుమారు 54 శాతం భారీ తగ్గింపుతో  రూ. 2,499లకు అందించనుంది.  

చదవండి: ఆపిల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాజెక్టు మరింత వేగవంతం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement