Fire-Boltt Launches The New Rock Smartwatch In India, Here More Details - Sakshi
Sakshi News home page

ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & మస్త్ ఫీచర్స్

Published Mon, Apr 10 2023 9:45 PM | Last Updated on Tue, Apr 11 2023 8:49 AM

Fire boltt rock smartwatch launched price and details - Sakshi

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఉత్పత్తులను విడుదల చేస్తూ మంచి ప్రజాదరణ పొందుతున్న ఫైర్ బోల్ట్ (Fire-Boltt) ఎట్టకేలకు మరో స్మార్ట్‌వాచ్‍ లాంచ్ చేసింది. అమోలెడ్ డిస్‍ప్లేతో విడుదలైన ఈ వాచ్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్ ధర రూ. 2,799. దీనిని ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులో ఉంటుంది. 550 నిట్స్ బ్రైట్‍నెస్ ఉండే రౌండ్ షేప్డ్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉన్న ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వంటి వాటిని పొందుతుంది.

కొత్త ఫైర్ బోల్ట్ రాక్ వాచ్ 390x390 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.3 రౌండ్ AMOLED డిస్‍ప్లే కలిగి ఉండటం వల్ల, చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఈ డిస్‍ప్లేకు గ్లాస్ కవర్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మెటల్ బటన్, క్రౌన్ వంటివి కూడా ఉన్నాయి.

(ఇదీ చదవండి: చైనాలో మెగా బ్యాటరీ ఫ్యాక్టరీకి సిద్దమవుతున్న మస్క్ - పూర్తి వివరాలు)

ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ కలిగి ఉండటం వల్ల మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. ఇందులో డయల్ ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్‍లో కాల్ లాగ్స్ కూడా చూడవచ్చు, మొబైల్‍కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాచ్‍కే నోటిఫికేషన్లు వస్తాయి. మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు.

(ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?)

ఈ వాచ్ స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను పొందుతుంది. ఈ ఫీచర్స్ కాకుండా ఇందులో 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‍లు దీనికి సపోర్ట్ చేస్తాయి. ఇది 260mAh బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జ్‌పై 7 రోజుల పనిచేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ వాచ్ ఐపీ68 రేటింగ్‍ను కలిగి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement