ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌వాచ్ విడుదలైంది. నాయిస్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వాచ్ ధర, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
కలర్‌ఫిట్ ఐకాన్ లైనప్‍లో విడుదలైన కొత్త ఐకాన్ 3 ధర కేవలం రూ.1,999 మాత్రమే. దీనిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లేదా నాయిస్ అఫీషియల్ వెబ్‍సైట్‍లో కొనుగోలు చేయవచ్చు. ఇది జెట్ బ్లాక్, మిడ్ నైట్ గోల్డ్, స్పేస్ బ్లూ, మ్యాట్ గోల్డ్, కామ్ బ్లూ, రోజ్ మయూవే అనే ఆరు కలర్ ఆప్షన్‍లతో లభిస్తుంది.
నాయిస్ ఐకాన్ 3 స్మార్ట్‌వాచ్ 1.91 ఇంచెస్ TFT స్క్వేర్ డిస్‍ప్లే కలిగి సన్నని బెజిల్స్ పొందుతుంది. ఇది సిలికాన్ స్ట్రాప్, మెటల్ బాడీ కలిగి స్క్రీన్ పాస్ కోడ్ ఫీచర్‌తో లభిస్తుంది. అంతే కాకుండా హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్‍పీఓ2 సెన్సార్, బ్రీత్ ప్రాక్టీస్ లాంటి హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.
(ఇదీ చదవండి: Suguna Foods: 5 వేలతో ప్రారంభమై అందరిని ఆశ్చర్యపరిచిన వ్యాపారం, ఇది!)
మొబైల్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు, నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు. సుమారు పది వరకు కాంటాక్టులను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 7 రోజుల వరకు పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్‍లో నాయిస్‍ఫిట్ యాప్ డౌన్‍లోడ్ చేసుకుని ఈ వాచ్‍కి కనెక్ట్ చేసుకుని ఫిట్‍నెస్, వర్కౌట్ వివరాలను చూడడం, సెట్టింగ్‍లను మార్చుకోవడం వంటివి కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment