దేశీయ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) యువతరాన్ని ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‍తో లేటెస్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది.
ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 2,999. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా తయారైంది, కాబట్టి వారికి ఇష్టమైన పింక్, వైట్, వైట్ ఓషియన్ స్ట్రాప్, వైట్ ప్లాటినమ్ స్ట్రిప్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది. ఈ వాచ్ ఇప్పుడు కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‍సైట్‍లో విక్రయానికి ఉంది.
(ఇదీ చదవండి: Global NCAP: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన స్లావియా, వర్టస్ - వివరాలు)
మార్కెట్లో విడుదలైన కొత్త ప్రిసీన్ స్మార్ట్‌వాచ్ 1.32 ఇంచెస్ హెచ్‍డీ ఫుల్ టచ్ రౌండ్ షేప్ డిస్‍ప్లే కలిగి మెటల్ బాడీ, రెండు మెటల్ బటన్లను పొందుతుంది. చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీని కోసం మైక్రోఫోన్, స్పీకర్ వంటివి ఉంటాయి. కావున బ్లూటూత్ ద్వారా ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారా మాట్లాడవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ డయల్ ప్యాడ్, కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలను కలిగి ఉండటం వల్ల నేరుగా వాచ్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పు నోటిఫికేషన్లను పొందవచ్చు. అంతే కాకుండా వాచ్ ద్వారా మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు.
(ఇదీ చదవండి: UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?)
ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, మెనిస్ట్రువల్ సైకిల్ రిమైండర్ లాంటి హెల్త్ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 7 రోజుల వరకు పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడినప్పుడు ఛార్జింగ్ మూడు రోజుల వరకు వస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment