భారతదేశంలో టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో యువత కూడా ఆధునిక పరికరాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ తీసుకువచ్చింది. ఇది మునుపటి మోడల్స్ కంటే పెద్ద సైజ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ వంటి వాటిని పొందుతుంది.
ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ మార్చి 06 నుంచి (రేపటి నుంచి) విక్రయానికి రానున్నట్లు సమాచారం. మొదటి సేల్స్ రూ. 1999 స్పెషల్ ప్రైస్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ బ్లాక్, బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ గ్రీన్, గోల్డ్ పింక్, సిల్వర్ గ్రే అనే మల్టిపుల్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండ: నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్ వీడియోకి గట్టి రిప్లే)
ఫైర్ బోల్ట్ టర్మినేటర్ వాచ్ 1.99 ఇంచెస్ స్క్వేర్ షేప్డ్ డిస్‍ప్లేతో వస్తుంది. అంతే కాకుండా ఇది బ్లూటూత్ కాలింగ్‍కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీని కోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్ వంటివి ఉన్నాయి. మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి వాటిని కూడా సింక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
లేటెస్ట్ ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్రీత్ ట్రైనింగ్ హెల్త్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది, ఫోన్‍కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment