శాంసంగ్ ‘గేర్ ఎస్2’ స్మార్ట్ వాచ్లు
దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘గేర్ ఎస్2’, ‘గేర్ ఎస్2 క్లాసిక్’ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌వాచ్‌ల ధరలు వరుసగా రూ.24,300గా, రూ.25,800గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. చిత్రంలో ‘గేర్ ఎస్2’ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న శాంసంగ్ ఇండియా (ఐటీ, మొబైల్) మార్కెటింగ్ డెరైక్టర్ మను శర్మ.