కాలిఫోర్నియా: కృత్రిమ మేథ (AI development) విషయంలో భారత్ తమకు కీలక మార్కెట్‌గా ఉందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రెసిడెంట్(Samsung President) టీఎం రోహ్ తెలిపారు. తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్25లో ఏఐ ఫీచర్లను పొందుపర్చడంలో బెంగళూరు, నోయిడాలోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాలు ముఖ్యపాత్ర పోషించినట్లు చెప్పారు. ఎస్25లోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ జెమినీ లైవ్ ఫీచర్‌లో కొరియన్, ఇంగ్లీష్ భాషలతో పాటు హిందీని కూడా చేర్చినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మౌలిక వసతులకు భారీ నిధులు
త్వరలో మరిన్ని భాషలను కూడా చేర్చనున్నామని, ఈ ప్రక్రియలోను భారత ఆర్‌అండ్‌డీ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని చెప్పారు. ఇవి ఇతర గెలాక్సీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా పని చేస్తున్నట్లు రోహ్ వివరించారు. ఈ నేపథ్యంలో పరిశోధన కేంద్రాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. దక్షిణ కొరియా వెలుపల తమకు అతి పెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రాలు భారత్‌లోనే ఉన్నట్లు రోహ్ చెప్పారు. పరిశ్రమ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల నుంచి ఏఐ ఫోన్ల వైపు మళ్లుతోందన్నారు. ఎస్25 మోడల్స్‌కి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను జోడించేందుకు కొన్ని దేశాల్లోని టెలికం సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment