న్యూఢిల్లీ: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు, అందరికీ సామాజిక భద్రత కోసం మౌలిక వసతులకు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున బడ్జెట్(Budget 2025-26) కేటాయింపులు అవసరమని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ఇలా 25 ఏళ్లపాటు నిధులు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఐఎస్‌ఎస్‌ఏ–ఈఎస్‌ఐసీ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా మంత్రి ప్రసంగించారు.
2012లో మౌలిక వసతుల కోసం చేసిన బడ్జెట్ కేటాయింపులు రూ.1.2 లక్షల కోట్లుగానే ఉండేవని, 2014లో నరేంద్ర మోదీ సర్కారు రూ.2.4 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. ‘2024కు వచ్చే సరికి బడ్జెట్ కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లకు పెరిగాయి. దీన్ని రూ.15 లక్షల కోట్లకు తీసుకెళ్లాలి. వచ్చే 25 ఏళ్ల పాటు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున ఖర్చు చేస్తే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఫలితంగా కొత్త రంగాల్లో ఉద్యోగాల కల్పన ఇనుమడిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త రంగాల్లో (క్విక్ కామర్స్ తదితర) కార్మికులకు సామాజిక భద్రతను ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment