
సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ నెక్ట్స్–జెనరేషన్ గ్లాసెస్ అరియ జెన్ 2 గురించి ప్రకటించింది. ‘అరియ జెన్2 గ్లాసెస్‌కు సంబంధించి మా ప్రయాణంలో తదుపరి దశ గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. మెషిన్ పర్సెప్షన్, కంటెక్ట్స్‌వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌తో సహా పరిశోధన రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’ అని మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
మెటా అరియా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా పరిశోధకులు, డెవలపర్ల కోసం రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ అని కంపెనీ పేర్కొంది. అధునాత వియరబుల్ టెక్నాలజీ(ధరించేందుకు వీలుగా ఉన్న వస్తువుల్లో వాడే టెక్నాలజీ) ఫీచర్లతో ఈ అద్దాలు మార్కెట్‌లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.
కీలక ఫీచర్లు ఇవే..
అధునాతన సెన్సర్లు: హార్ట్ రేట్ మానిటర్, స్పేషియల్ మైక్రోఫోన్లతో పాటు ఐ-ట్రాకింగ్, హ్యాండ్ ట్రాకింగ్, మోషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.
కృత్రిమమేధ: ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడకుండా స్పీచ్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ వంటి వేగవంతమైన, సమర్థవంతమైన కార్యాచరణలను ప్రాసెస్ చేసి వినియోగదారులకు డేటాను అందిస్తుంది.
బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6-8 గంటల ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పరిశోధన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.
తేలికపాటి డిజైన్: ఈ గ్లాసెస్ బరువు కేవలం 75 గ్రాములేనని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
ఈ గ్లాస్‌ల వినియోగానికి సంబంధించి మెటా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిశోధనలో వీటిని ఉపయోగించవచ్చు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రియల్‌టైమ్‌లో వస్తువులను, మన ముందుతున్న పరిస్థితులను ట్రాక్ చేసి డేటాను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment