మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్‌ కాల్‌ | 11 Year Old Murder Case Solved Because Of One Missed Call At Delhi | Sakshi
Sakshi News home page

మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్‌ కాల్‌

Published Fri, Feb 24 2023 2:56 PM | Last Updated on Fri, Feb 24 2023 3:23 PM

11 Year Old Murder Case Solved Because Of One Missed Call At Delhi - Sakshi

కిడ్నాప్‌కి గురైన 11 ఏళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపింది. అది​కూడా ఒక పట్టాన అంతు చిక్కని  ఈకేసు చిక్కుముడిని ఒక మిస్డ్‌కాల్‌ చేధించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఢిల్లీలోని నాంగ్లోయ్‌ ప్రాంతంలో 11 ఏళ్ల చిన్నారి ఫిబ్రవరి 9న పాఠశాలకు వెళ్లి కనిపించకుండాపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..చిన్నారి తల్లికి కూతురు కిడ్నాప్‌ అయ్యిన రోజే ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మిస్డ్‌ కాల్‌ వచ్చింది. దీంతో పోలీసులు మొబైల్‌నెంబర్‌ను ట్రాక్‌ చేసి పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఫిబ్రవరి 21న నిందితుడు రోహిత్‌ అలియాస్‌ వినోద్‌ అనే వ్యక్తిని అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే గాక బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రా మోర్‌ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు.

ఈ మేరకు పోలీసులు ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే ఆ చిన్నారి నలుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లి అని తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు బాధితురాలి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ఈ హత్యకు దారితీసిన కారణాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. 

(చదవండి: 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement