యూపిలో దారుణం.. తలలేని చిన్నారి మృతదేహం కలకలం.. | Headless Body Of 3 Year Old Boy In Delhi Cops Suspect Human Sacrifice | Sakshi
Sakshi News home page

యూపిలో దారుణం.. తలలేని చిన్నారి మృతదేహం కలకలం..

Published Wed, Dec 7 2022 12:13 PM | Last Updated on Wed, Dec 7 2022 12:16 PM

Headless Body Of 3 Year Old Boy In Delhi Cops Suspect Human Sacrifice - Sakshi

ఒక చిన్నారి తల, అవయవాలు లేకుండా మొండెంతో... దారుణమైన హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...యూపీలోని మీరట్‌లో ఒక  పొలంలో తల లేకుండా ఉ‍న్నా మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో పొరుగింటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది.

పోలీసులు నరబలిలో భాగంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో బాలుడిని చెరుకుతోటలో వదిలేసినట్లు చెప్పడంతో.. పోలీసుల బృందం మీరట్‌లోని ఇంచోలిలోని నాంగ్లీ-ఇసా గ్రామానికి చేరుకుంది. అక్కడ సమీపంలోనే ఆ బాధిత చిన్నారి తలను కనుగొన్నారు.

ఆ చిన్నారి వస్తువులు, బట్టలు ఆధారంగా నవంబర్‌ 30న తూర్పు ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌లో తప్పిపోయిన చిన్నారిగా గుర్తించారు పోలీసులు. చిన్నారి దారుణ హత్య గురించి తెలుసుకుని...కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. ఐతే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement