headless body
-
యూపిలో దారుణం.. తలలేని చిన్నారి మృతదేహం కలకలం..
ఒక చిన్నారి తల, అవయవాలు లేకుండా మొండెంతో... దారుణమైన హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...యూపీలోని మీరట్‌లో ఒక పొలంలో తల లేకుండా ఉన్నా మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పొరుగింటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు నరబలిలో భాగంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు విచారణలో బాలుడిని చెరుకుతోటలో వదిలేసినట్లు చెప్పడంతో.. పోలీసుల బృందం మీరట్‌లోని ఇంచోలిలోని నాంగ్లీ-ఇసా గ్రామానికి చేరుకుంది. అక్కడ సమీపంలోనే ఆ బాధిత చిన్నారి తలను కనుగొన్నారు. ఆ చిన్నారి వస్తువులు, బట్టలు ఆధారంగా నవంబర్ 30న తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో తప్పిపోయిన చిన్నారిగా గుర్తించారు పోలీసులు. చిన్నారి దారుణ హత్య గురించి తెలుసుకుని...కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. ఐతే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
స్పీడ్ న్యూస్ @ 01:30 PM 16 January 2022
-
తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం
గువాహటి : గువాహాటిలోని నీలాచల్ కొండ ప్రాంతంలో ఉన్న కామాఖ్య దేవీ దేవాలయంలో సమీపంలో తలలేని ఓ మహిళ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏటా ఇక్కడి ఆలయంలో జరిగే అంబుబాచి పండుగ ఉత్సవంలో భాగంగా మహిళను కొందరు దుండగులు నరబలి ఇచ్చి ఉంటారని, అందులో భాగంగానే మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. మూఢ నమ్మకాలను నమ్మే దుర్మార్గులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. కామాఖ్యా ఆలయం పక్కన ఉన్న బనాదుర్గ దేవాలయం మెట్లపైన ఈ భీకరమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంతోపాటు పూజా సామాగ్రి కూడా లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ మృతదేహం ఉన్న స్థలానికి భద్రత కల్పించారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు ఇక్కడ జరిగే ఆధ్మాత్మిక ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాన్నిమంగళవారం సందర్శించిన విషయం తెలిసిదే. -
ప్రాణత్యాగమా.. బలిచ్చారా
దిస్పూర్ : ప్రముఖ కామాఖ్యా దేవి ఆలయం సమీపంలో బుధవారం తలలేని మహిళ మృతదేహం(మొండెం) పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. క్షుద్ర పూజల్లో భాగంగా బలిచ్చారా లేక స్వయంగా ప్రాణ త్యాగం చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం సమీపంలో మృతదేహాన్ని కనుగొనడంతో ప్రాణత్యాగం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం చుట్టుపక్కల మట్టి ప్రమిద, కుండ, పూజ నిమిత్తం ఉపయోగించే ఎరుపు దారం, ఓ ప్లాస్టిక్ బాటిల్ వంటి వస్తువులను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘మృత దేహం దగ్గర లభ్యమైన వస్తువులన్నింటిని పూజా కార్యక్రమాల కోసమే వినియోగిస్తారు. ప్లాస్టిక్ బాటిల్లో నూనె తీసుకువచ్చారేమో అనిపిస్తుంది. అంతేకాక మృతురాలి శరీరం మీద దాడి చేసినట్లు, పెనుగులాడినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ప్రాథమిక రిపోర్టులో తెలిసింది. ఇక ఈ ప్రాంతంలో అనుమానాస్పాదంగా ఎలాంటి కేకలు, అరుపులు వినపడలేదని స్థానికులు తెలిపారు. అంటే మృతురాలు స్వయంగా ప్రాణత్యాగం చేసి ఉండాలి.. లేదంటే ఎవరైనా ఆమెకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉండాలి. ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు సాగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు. -
ఆదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
విశాఖపట్నం : విశాఖపట్నం బుచ్చయ్యపేట మండలం పంగిడిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో 10 రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ మృతదేహాన్ని గ్రామస్తులు బుధవారం గుర్తించారు. మృతదేహం నుంచి తల, మొండెం వేరు చేసి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళను హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కలకలం రేపిన తల లేని బాలిక శవం
గోరక్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ రైల్వేస్టేషన్లో తలలేని బాలిక శవం కలకలం రేపింది. చౌరీచౌరా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలోని అప్పర్ బెర్త్‌పై నల్లని కవర్ ఒకటి శుభ్రం చేస్తున్నవారి కంట పడింది. దాంట్లోంచి అతిక్రూరంగా కుక్కి పడేసిన తల లేని బాలిక శవం బయటపడింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసును త్వరలో ఛేదిస్తామని వారు తెలిపారు.