ఆదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం | headless body recovered in pangidi | Sakshi
Sakshi News home page

ఆదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

Published Wed, Oct 5 2016 9:38 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

headless body recovered in pangidi

విశాఖపట్నం : విశాఖపట్నం బుచ్చయ్యపేట మండలం పంగిడిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో 10 రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ మృతదేహాన్ని గ్రామస్తులు బుధవారం గుర్తించారు. మృతదేహం నుంచి తల, మొండెం వేరు చేసి ఉన్నాయి.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విశాఖపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళను హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement