ఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (19)ని గర్భవతిని చేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను పూడ్చిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీకి చెందిన సోనీ (19) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంజూ అకా సలీమ్ అనే ఓ యువకుడితో పరిచయం అయ్యాడు. వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే.. పెళ్లి చేసుకోవాడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అబార్షన్ చేయించుకోవాలన్నాడు.
#LoveJihad: In a tragic incident in Nangloi, Delhi, a 19-year-old pregnant woman named Soni was allegedly murdered by her boyfriend, Mohammad Salim, also known as Sanju, with the assistance of two accomplices.
Soni, seven months pregnant, had been pressing Salim for marriage,… pic.twitter.com/M0cqJDDfCq— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 26, 2024
దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే సోమవారం అతడిని కలిసేందుకు యువతి వెళ్లగా.. సలీమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను హర్యానాలోని రోహ్‌తక్‌కు తీసుకెళ్లి హత్య చేశాడు. ప్రస్తుతం సోని ఏడు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు. ఇక.. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుతులు సలీమ్, అతడి స్నేహితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: ఢిల్లీ బర్గర్ కింగ్ హత్య కేసు: ‘లేడీ డాన్’ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment