ఢిల్లీ: దేశరాజధాని మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతోంది. సెంట్రల్ ఢిల్లీలో ఓ యువకుడి హత్యతో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితికి చేరుకుంది. దీంతో పటేల్‌నగర్ ఏరియాలోని రంజిత్ నగర్ ప్రాంతంలో, బల్జీత్‌నగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మత కోణంలో ఈ దాడి జరిగిందనే ప్రచారం మొదలవ్వడంతో.. డీసీపీ శ్వేత చౌహాన్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
చనిపోయింది బజరంగ్ దళ్ కార్యకర్త కావడం, అతనిపై కిరాతకంగా దాడి చేసింది ఉఫీజా, అద్నాన్, అబ్బాస్ కావడంతో.. మత కోణంలో చర్చ జరుగుతోంది అక్కడ. 13వ తారీఖు అర్ధరాత్రి యువకుడిపై దాడి జరగ్గా.. చికిత్స పొందుతూ అతను శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఆదివారం స్థానికులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని వ్యతిరేక నినాదాలతో హెరెత్తించారు బజరంగ్ దళ్ ప్రతినిధులు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం తొలుత అంత్యక్రియలు నిర్వహించకుండా.. నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో పటేల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించి.. యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
అక్టోబర్ 12వ తేదీ రాత్రి సమయంలో బల్జీత్ నగర్‌కు చెందిన నితేశ్(25) తన స్నేహితులు మాంటీ, అలోక్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో బైక్‌పై దూసుకొచ్చిన ఓ వ్యక్తిని అడ్డగించి దాడి చేశారు. ఈ క్రమంలో దెబ్బలు తిన్న వ్యక్తి తన స్నేహితులను తీసుకొచ్చి.. నితేశ్, మాంటీ, అలోక్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు దుర్బాషలాడుకోవడంతో.. గొడవ పెద్దదైంది.
అర్ధరాత్రి సమయంలో నితేష్ అతని స్నేహితులపై రంజిగ్ నగర్ దగ్గర కర్రలు, రాడ్లతో దాడి చేశారు నిందితులు. నితిశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. ‘‘దాడికి పాల్పడింది ఉఫిజా, అబ్బాస్, అద్నాన్‌లుగా గుర్తించాం. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో మత కోణం ఏమీ లేదని.. చిన్నగొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని, అనవసరంగా మతం రంగు పులుమొద్ద’’ని డీసీపీ శ్వేతా చౌహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. నితేష్ కుటుంబ సభ్యులు సైతం ఒకరినొకరు దుర్బాషలాడిన క్రమంలోనే దాడి జరిగిందని చెప్పడం గమనార్హం. అయితే..
స్థానికులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాత్రం ఈ హత్యలో మత కోణం ఉందని వాదిస్తున్నారు. నితేశ్ ఈ మధ్యే బజరంగ్ దళ్‌లో చేరాడని, అందుకే అతన్ని టార్గెట్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దగ్గర్లోని మసీదు దగ్గరి నుంచి కొందరు దూసుకొచ్చి నిందితులతో కలిసి దాడి చేశారని చెప్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం స్థానికులు చెప్పేదాంట్లో వాస్తవం లేదని అంటున్నారు. అంతేకాదు.. నితేశ్, అలోక్‌లపై ఇంతకు ముందు చాలా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
A 25-year-old youth named Nitesh died on Saturday night after he was assaulted on last wednesday night by some people in Ranjit Nagar locality of Patel Nagar area in Delhi. Accused are identified as Ufiza, Adnan and Abbas. pic.twitter.com/yk880kIHzP
— Nikhil Choudhary (@NikhilCh_) October 16, 2022
ఇదీ చదవండి: ప్రాణస్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేశారు!
Comments
Please login to add a commentAdd a comment