rapid action force
-
మణిపూర్‌లో భీకర హింస
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పీ, తెంగౌన్పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ వలసల వల్లే.. మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అపార్థం వల్లే అనర్థం: సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. గిరిజన సంఘీభావ యాత్ర గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది. -
బజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో ఉద్రిక్తత
ఢిల్లీ: దేశరాజధాని మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతోంది. సెంట్రల్ ఢిల్లీలో ఓ యువకుడి హత్యతో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితికి చేరుకుంది. దీంతో పటేల్‌నగర్ ఏరియాలోని రంజిత్ నగర్ ప్రాంతంలో, బల్జీత్నగర్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మత కోణంలో ఈ దాడి జరిగిందనే ప్రచారం మొదలవ్వడంతో.. డీసీపీ శ్వేత చౌహాన్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చనిపోయింది బజరంగ్ దళ్ కార్యకర్త కావడం, అతనిపై కిరాతకంగా దాడి చేసింది ఉఫీజా, అద్నాన్, అబ్బాస్ కావడంతో.. మత కోణంలో చర్చ జరుగుతోంది అక్కడ. 13వ తారీఖు అర్ధరాత్రి యువకుడిపై దాడి జరగ్గా.. చికిత్స పొందుతూ అతను శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఆదివారం స్థానికులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని వ్యతిరేక నినాదాలతో హెరెత్తించారు బజరంగ్ దళ్ ప్రతినిధులు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం తొలుత అంత్యక్రియలు నిర్వహించకుండా.. నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో పటేల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించి.. యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అక్టోబర్ 12వ తేదీ రాత్రి సమయంలో బల్జీత్ నగర్‌కు చెందిన నితేశ్(25) తన స్నేహితులు మాంటీ, అలోక్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో బైక్‌పై దూసుకొచ్చిన ఓ వ్యక్తిని అడ్డగించి దాడి చేశారు. ఈ క్రమంలో దెబ్బలు తిన్న వ్యక్తి తన స్నేహితులను తీసుకొచ్చి.. నితేశ్, మాంటీ, అలోక్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు దుర్బాషలాడుకోవడంతో.. గొడవ పెద్దదైంది. అర్ధరాత్రి సమయంలో నితేష్ అతని స్నేహితులపై రంజిగ్ నగర్ దగ్గర కర్రలు, రాడ్లతో దాడి చేశారు నిందితులు. నితిశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. ‘‘దాడికి పాల్పడింది ఉఫిజా, అబ్బాస్, అద్నాన్లుగా గుర్తించాం. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో మత కోణం ఏమీ లేదని.. చిన్నగొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని, అనవసరంగా మతం రంగు పులుమొద్ద’’ని డీసీపీ శ్వేతా చౌహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. నితేష్ కుటుంబ సభ్యులు సైతం ఒకరినొకరు దుర్బాషలాడిన క్రమంలోనే దాడి జరిగిందని చెప్పడం గమనార్హం. అయితే.. స్థానికులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాత్రం ఈ హత్యలో మత కోణం ఉందని వాదిస్తున్నారు. నితేశ్ ఈ మధ్యే బజరంగ్ దళ్‌లో చేరాడని, అందుకే అతన్ని టార్గెట్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దగ్గర్లోని మసీదు దగ్గరి నుంచి కొందరు దూసుకొచ్చి నిందితులతో కలిసి దాడి చేశారని చెప్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం స్థానికులు చెప్పేదాంట్లో వాస్తవం లేదని అంటున్నారు. అంతేకాదు.. నితేశ్, అలోక్‌లపై ఇంతకు ముందు చాలా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. A 25-year-old youth named Nitesh died on Saturday night after he was assaulted on last wednesday night by some people in Ranjit Nagar locality of Patel Nagar area in Delhi. Accused are identified as Ufiza, Adnan and Abbas. pic.twitter.com/yk880kIHzP — Nikhil Choudhary (@NikhilCh_) October 16, 2022 ఇదీ చదవండి: ప్రాణస్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేశారు! -
హకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవం (ఫోటోలు)
-
శతమానం: సెంచరీలోనూ సేవాగుణం తగ్గలే!
ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు. ఈ కోవకు చెందిన కేట్ ఆర్చర్డ్ వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేయడానికి పూనుకుంది.‘సెంచరీలోనూ స్పీడు తగ్గలే’ అంటూ ఏకంగా యుద్ధవిమానం నడిపేసింది. ఇంగ్లాండ్‌లోని కార్నవాల్లో నివాసముంటోన్న కేట్ ఆర్చర్డ్ ఆంగ్లో ఇండియన్. పదముగ్గురు సంతానంలో కేట్ ఒకరు. కేట్ చిన్నవయసులో ఆమె కుటుంబం ఇండియాలోనే ఉండేది. కేట్ తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1941లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌లో తన ఇద్దరు తోబుట్టువులతో కలసి 20 ఏళ్ల వయసులో వాలంటీర్‌గా చేరింది. వాలంటీర్‌గా పనిచేస్తూనే ఫస్ట్‌క్లాస్ వారెంట్ ఆఫీసర్‌గా, సర్వీస్ అండ్ ఇండియా సర్వీస్ మెడల్స్‌ను అందుకుంది. తరువాత ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన చెన్నైలోని ఐదోనంబర్ ఫిల్టర్ రూమ్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసింది. ఇలా పనిచేస్తూనే రెండో ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధ విమానాలకు సిగ్నల్స్‌ను అందించేది. శత్రు యుద్ధవిమానాలను కూల్చడంలో ఈ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర పోషించేవి. 24 గంటలపాటు వార్నింగ్ సిస్టమ్స్‌ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పైలట్లకు సూచనలు ఇస్తుండేది. పనిప్రదేశంలో సహోద్యోగి నచ్చడంతో పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం కేట్కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్. ‘‘ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయిన వారంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. వీరికి సాయం చాలా అవసరం. అందుకే ఈ ట్రిప్‌ను చేపట్టాను. ట్రిప్ చాలా బావుంది. కొన్నిసార్లు నేను కూడా విమానాన్ని నియంత్రించ గలిగాను’’ అని చిరునవ్వుతో చెబుతున్న కేట్ సేవకు ఆకాశమే హద్దన్నట్లుగా ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది. -
పులిపై మత్తు ప్రయోగం.. రంగంలోకి షూటర్లు
సాక్షి, మంచిర్యాల : ఇద్దరిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన ఓ యువతిపై పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలతో పులిని బంధించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో అటవీశాఖ అధికారులు నెల రోజులుగా పులి రాకపోకలను గమనిస్తూ.. బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో 10 బోన్లు, 100కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఎర వేసిన పశువులను తింటున్న పులి.. బోనులోకి మాత్రం వెళ్లడం లేదు. దీంతో మత్తు మందు ప్రయోగించి బంధించాలని నిర్ణయించారు. ఇందుకు చంద్రాపూర్ ర్యాపిడ్ యాక్షన్ టీంకు చెందిన ఆరుగురు అధికారులు, హైదరాబాద్ నుంచి షూటర్లను రప్పించి ఆపరేషన్ ప్రారంభించారు. కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు డైరెక్టర్ వినోద్‌కుమార్ సహా జిల్లా అటవీ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, 100 మంది వరకు అటవీ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు పులిని బంధించడంపై అధికారులు పూర్తి గోప్యత పాటిస్తున్నారు. చదవండి: బోరు వేయని బోరిగాం.. అదెలా సాధ్యమంటారు? మంచెపై ఉంటూ మత్తు ప్రయోగం పులి తరచూ సంచరించే బెజ్జూరు రేంజ్ తలాయి బీట్ పరిధిలోని కంది భీమన్న అటవీ ప్రాంతంలో ఎరగా ఓ పశువును చెట్టుకు కట్టేసి ఉంచారు. ఎరపై పులి ఈ నెల 11న దాడి చేసి ఆకలి తీర్చుకుంది. మరోమారు మిగిలిన మాంసం తినేందుకు వచ్చింది. రెండుసార్లు అక్కడికి వచ్చినప్పటికీ పక్కనే బోనులోకి మాత్రం వెళ్లడం లేదని అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతానికి మళ్లీ పులి వచ్చేలా బుధవారం మరో పశువును ఎరగా ఉంచారు. ఎర ఉన్న ప్రాంతానికి 20 మీటర్ల దూరంలోనే తాత్కాలిక మంచె ఏర్పాటు చేశారు. ఈ మంచెలో షూటర్లు ఉంటూ పులి రాగానే తుపాకీతో మత్తు మందు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అడవిలో రాత్రి వేళల్లోనూ మంచెపైనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. మత్తు మందు ఇచ్చాక స్పృహ కోల్పోయినట్లు నిర్ధారించుకున్నాకే పులిని ప్రత్యేక వాహనంలో వేరే ప్రాంతానికి తరలించనున్నారు. చదవండి: ఏ పులి ఎక్కడ తిరుగుతుందో! -
చార్మినార్ వద్దే ఎందుకు?: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద శనివారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పెద్ద ఎత్తున బలగాలను దింపి పాతబస్తీ వీధుల్లో కవాతు చేపట్టింది. దేశ వ్యాప్తంగా పలు సున్నితమైన ప్రాంతాల్లో ఈ విధంగా బలగాలను అప్రమత్తం చేసింది. అయితే నగరంలో కేవలం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చార్మిచార్ వద్ద మాత్రమే ఎందుకు మార్చ్ నిర్వహించారు. సిక్రింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా కానీ, హైటెక్‌సిటీలో గానీ ఎందుకు చేయట్లేదు’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా ఢిల్లీలోని చెలరేగిన హింసతో దేశ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణలో ఇప్పటివరకు 42 మందిమృతి చెందారు. సున్నితమైన అంశం అయినందున దేశ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ అప్రమత్తయింది. దీనిలో భాగంగానే ఉత్తర భారతంలోని పలుముఖ్య పట్టణాలతో పాటు దక్షిణాదిన సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను అలర్ట్ చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకూడదని భరోసా ఇచ్చేందుకు ఈ మార్చ్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. -
కొత్తగా 5 ఆర్ఏఎఫ్ కేంద్రాలు
న్యూఢిల్లీ: కొత్తగా 5 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఏఎఫ్ల సంఖ్య 15కు చేరుకోనుంది. ఈ కొత్త కేంద్రాలు వారణాసి (ఉత్తర ప్రదేశ్), జైపూర్ (రాజస్తాన్), మంగళూరు (కర్ణాటక), హజ్‌పూర్ (బీహార్), నూహ్ (హరియాణా)ల్లో ఏర్పాటు చేస్తున్నారు. యూపీలో ఆర్‌ఏఎఫ్‌కు వారణాసి నాలుగో స్థావరం. మంజూరైన కేంద్రాల పార్లమెంట్ నియోజక వర్గాల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ, హజ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రాతినిథ్యం వహిస్తుం డటం గమనార్హం. ఆర్ఏఎఫ్లో ఒక్కో బెటా లియన్‌కు 1000 మంది సైనికులు ఉంటారు. -
మూడేళ్లలో నక్సలిజం అంతం
లక్నో: రాబోయే మూడేళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను ఎదుర్కోవడంలో సీఆర్పీఎఫ్ బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. సీఆర్పీఎఫ్ అనుబంధ విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) 26వ వార్షికోత్సవ వేడుకల్లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ..‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు. రాబోయే 2–3 ఏళ్లలో దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. గతంలో దేశవ్యాప్తంగా 126 జిల్లాల్లో తీవ్రవాదుల ప్రాబల్యముంటే.. ఈ సంఖ్య ప్రస్తుతం 10 నుంచి 12 జిల్లాలకు పడిపోయింది. మీ (సీఆర్పీఎఫ్ జవాన్ల) అంకితభావం, ధైర్యం, కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఆర్ఏఎఫ్ బలగాలు స్పందించడంలో వేగంగా ఉండాలే తప్ప ప్రజలతో దురుసుగా వ్యవహరించకూడదు’ అని తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ విశేష కృషి చేస్తోందని ప్రశంసిం చారు. భద్రతాబలగాలు 2018లో ఇప్పటివరకూ 131 మంది ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులను మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ తెలిపారు. దీంతోపాటు 1,278 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 58 మంది లొంగిపోయారని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కశ్మీరీ యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అయినా రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నాయని కితాబిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో యాపిల్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు కాల్చిచంపడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఆందోళనలు, అల్లర్ల సందర్భంగా ఆర్ఏఎఫ్ బలగాలు సత్వరం స్పందించాలే తప్ప ప్రజలతో దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. సుశిక్షితులైన భద్రతాబలగాలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించి కూర్రులుగా గుర్తింపు తెచ్చుకోకూడదు. విధి నిర్వహణ సందర్భంగా ప్రజలతో ఎప్పుడు, ఎంతమేరకు, ఎలా వ్యవహరించాలన్న అంశంపై జవాన్లకు అవగాహన ఉండాలి’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 1991లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, అలహాబాద్, ముంబై, అలీగఢ్, కోయంబత్తూర్, జంషెడ్పూర్, భోపాల్, మీరట్‌లో ఆర్ఏఎఫ్ బెటాలియన్లను మోహరించారు. -
సన్నిధానం చుట్టూ భారీ భద్రత
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచరంతో ఈ ఏడు భారీ భద్రతను పెంచారు. అలాగే ఈ సంవత్సరం ఆలయానికి భక్తులు ఎన్నడూ లేనంతగా వస్తారనే అంచనాలతో భధ్రతను కేరళ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. శబరిమల ఆలయం చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేరళ పోలీస్ బలగాలు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే.. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఇప్పటికే నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. డ్రోన్లతో పహారా! శబరిమల అయ్యప్ప సన్నిధానంకు ఈ ఏడు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రధానంగా సన్నిధానంను ప్రతిక్షణం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది. సన్నిధానంతో పాటు పంబా, అడవిదారి, ఎరుమేలి, ఇతర ముఖ్యప్రాంతాల్లో సైతం భద్రను పెట్టినట్టు సన్నిధానం ప్రత్యేక పోలీసు అధికారి కేకే జయరామన్ తెలిపారు. పదునెట్టాంబడి చుట్టూ పారా మిలటరీ బలగాలు పహారా కాస్తుంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచీ! అయ్యప్ప భద్రత కోసం కేరళ పోలీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకనుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నట్లు కేకే జయరామన్ చెప్పారు. అయ్యప్పలు సహరించాలి అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానంగా నీలిమల, మరక్కూట్టం యూ టర్న్, లోయర్ తిరుమట్టం వద్ద సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పారు. అనుమతి ఉన్న వారికే! సన్నిధానానికి వెళ్లే ప్రత్యేకదారిలో.. కేవలం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనుమతి పత్రం, లేదంటే కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డు ఉండాలని చెప్పారు. -
పోలీసులకు క్లాస్ పీకిన రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : 'ఇది 21వ శతాబ్దం.. పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో పాశవికంగా ఉండొద్దు. వారు ప్రజలతో సన్నిహిత వర్గంగా వ్యవహరించాలి' అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అల్లర్లు, నిరసనలువంటి సందర్భాల్లో సవాల్‌గా మారిన అంశాల్లో సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని సూచించారు. కేంద్ర పరిధిలోని రాష్ట్ర పరిధిలోని పోలీసులంతా కొత్త పరిజ్ఞానం, కొత్త సైకలాజికల్ సొల్యూషన్స్ అందిపుచ్చుకొని వాటి సాయంతో దాడులకు దిగే వారి, ఆందోళన చేసేవారి ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిల్వర్ జుబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ఇక్కడ వారి నుద్దేశించి మాట్లాడారు. కులం పేరిట, మతంపేరిట, ప్రాంతాల పేరిట ఎవరు దాడులకు ప్రయత్నిస్తున్నారో వారిని ఈ బలగాలు గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు తమ బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని తనకు కూడా తెలుసని, కానీ, అలాంటి సందర్భాల్లో కూడా వారు చూపించాల్సిన ఫోర్స్కంటే ఎక్కువగా ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది'
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో హింసాత్మక ఘటన పథకం ప్రకారమే జరిగిందనిపిస్తోందని అడిషనల్ డీజీ ఠాకూర్ అన్నారు. జిల్లాలో ఐదు వేలమంది సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించినట్టు తెలిపారు. ఆదివారం తునిలో కాపుల ఆందోళన సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారని అడిషనల్ డీజీ చెప్పారు. తుని ఘటనలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటన వెనుక నిఘా వైఫల్యం లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైలు ప్రయాణికులను పోలీసులు కాపాడారని, లేదంటే ప్రాణనష్టం జరిగేదని ఠాకూర్ వెల్లడించారు. -
సమాజ శాంతి కోసం ‘ర్యాపిడ్ యాక్షన్’
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి శామీర్‌పేట్: సమాజ శాంతి కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సేవలు అందించడం ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం హఢకీంపేట్లోని ఆర్ఏఎఫ్ 99వ బెటాలియన్‌లో జరిగిన 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఆర్ఏఎఫ్ బెటాలియన్ శ్రమిస్తోందని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖలో పుష్కలంగా నిధులున్నాయని, దేశరక్షణకు ఎలాంటి లోటు లేదన్నారు. సాయుధ దళంలో పనిచేస్తున్న చిన్నస్థాయి జవాన్ల నుంచి ఉన్నతాధికారుల వరకు నేరుగా సంప్రదిస్తే సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. దేశసేవకు కృషిచేస్తున్న జవాన్లకు 25ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు దక్కలేదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించిందన్నారు. సుమారు 25 వేల మంది జవాన్లకు రిక్రూట్ చేశామని, త్వరలో మరో 5 బెటాలియన్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు కేంద్రం రాష్ట్ర ముఖ్య అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డీజీ ప్రకాశ్‌మిశ్రా, సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ దుర్గాప్రసాద్, ఆర్ఏఎఫ్ ఐజీ బండారి, ఎస్ఎస్ ఐజీ విష్ణువర్ధన్‌రావు, 99 ఆర్ఏఎఫ్ కమాండెంట్ రిజ్వాన్, మీడియా కో-ఆర్డినేటర్ పాపారావ్ ఉన్నారు. -
సమస్యాత్మక గ్రామాల్లో ఆర్ఏఎఫ్ బృందం సర్వే
ఒంగోలు క్రైం : జిల్లాలో సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక, సామాజిక, మత సంబంధ గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బృందం సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్- 99 ఆర్ఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ నేతృత్వంలోని 70 మందితో కూడిన బృందం జిల్లాలో పర్యటించేందుకు మంగళవారం ఒంగోలు చేరుకుంది. అసిస్టెంట్ కమాండెంట్ కె.పాపారావుతో పాటు ఆర్ఏఎఫ్ బృందం ఒంగోలు డీఎస్పీ పి.జాషువాను ఆయన కార్యాలయంలో కలిసింది. ఒంగోలు పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. సింగరాయకొండ, కొత్తపట్నం, మర్రిపూడి, జరుగుమల్లి, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలతో పాటు ఒంగోలు నగరంలోని ప్రాంతాలకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నుంచి సేకరించింది. సామాజిక ఘర్షణలు జరుగుతున్న గ్రామాలను సైతం పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు సర్వే దోహదపడుతుందని డిప్యూటీ కమాండెంట్ హెచ్‌పీ సింగ్ వివరించారు. 70 మంది ప్రత్యేక పోలీసులు వారం పాటు జిల్లా మొత్తం పర్యటించి సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వాటి పరిసరాలపై కూడా పూర్తి స్థాయి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు సింగ్ చెప్పారు. -
అల్లర్లపై పది కేసులు నమోదు
ఐదు కేసుల దర్యాప్తు పూర్తి 23 మంది అరెస్టు కొనసాగుతున్న కర్ఫ్యూ రంగంలోకి అదనపు బలగాలు అఅత్తాపూర్, న్యూస్‌లైన్: సిక్ చావ్నీ అల్లర్లకు సంబంధించి పోలీసులు మొత్తం పది కేసులు నమోదు చేసి, 23 మందిని అరెస్టు చేశారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బీఎస్ఎఫ్, సాయుధ పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు.ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా.. ముఖ్యంగా పాతబస్తీలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శుక్రవారం ప్రార్ధనలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు సిక్ చావ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల వెసులుబాటు కోసం గురువారం ఉదయం గంట పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అత్యవసర పనులు చక్కబెట్టుకున్నారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిషన్‌బాగ్ నుంచి ఎంఎం పహాడీ వరకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. కిషన్‌బాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాల నుంచి సిక్ చావ్నీ హర్షమహల్ వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా, కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం సాహసించడంలేదు. జనం సంచారం లేకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపించాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యగా దక్షిణ మండల పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో శుక్రవారం 144 సెక్షన్‌ను విధించారు. కాగా, కాల్పులు జరిగిన ప్రాంతాన్ని గురువారం రాష్ర్ట డీజీపీ ప్రసాద్‌రావు సందర్శించారు. ఇరువర్గాలు సంయమనం పాటించాలని కోరా రు. ఇదిలా ఉండగా, పోలీసు కాల్పుల్లో చనిపోయిన ముగ్గురి కుటుంబసభ్యులకు రూ. 6 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాజేంద్రనగర్ తహసీల్దార్ అశోక్‌కుమార్ గురువారం అందజేశారు. ప్రార్ధనలకు గట్టిబందోబస్తు.... శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఆయా ప్రాంతాలలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్ తెలిపారు. ప్రార్ధనలు జరిగే హర్షమహల్, అత్తాపూర్ బడీమసీద్, చోటామసీద్, నౌనెంబర్, ఎంఎం పహాడీ, మహ్మదాబాద్, వాదియా మహ్మద్, చింతల్మెట్, జలాల్‌బాబానగర్, బాసిత్‌బాబానగర్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాంబాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాలలోని ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కుషాల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స... మెహిదీపట్నం: సిక్ చావ్నీ అల్లర్లలో గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స చేస్తున్నట్టు నానల్‌నగర్‌లోని ప్రీమియర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్మహేష్ మర్దా తెలిపారు. తూటాలు, ఇతర గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో అవసరమైన వారికి తమ డాక్టర్ల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సలను నిర్వహించిందని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పుకార్లను నమ్మవద్దు: సీవీ ఆనంద్ సిక్ చావ్నీ అల్లర్ల ఘటనపై పది కేసులు నమోదు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం రాత్రి రాజేంద్రనగర్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిక్ చావ్నీ ఘటనపై పది కేసులు నమోదు చేశామని, వీటిలో ఐదు కేసులు దర్యాప్తు పూర్తి చేసి 23 మందిని నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. అల్లర్లును అదుపుచేసే క్రమంలో బీఎస్ఎఫ్ దళాలు వంద రౌండ్లు వరకు కాల్పులు జరిపాయని చెప్పారు. ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్స్‌యాప్‌లో ఘటనకు సంబంధించి కొందరు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసినట్టు గుర్తించామన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లు నమ్మవద్దని కోరారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనలు ఉండడంతో పాటు బందోబస్తు దృష్ట్యా 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. అల్లర్లు చెలరేగడానికి కారణమైన అల్లరి మూకలను గుర్తించడానికి ఫొటోలు, వీడియోలను పరిశీలిస్తున్నామన్నారు. కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించామన్నారు. గాయపడ్డ వారికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. -
కిషన్‌బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ సిక్చావ్ని అల్లర్లపై గవర్నర్ నరసింహన్ న్యాయ విచారణకు ఆదేశించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50వేల సహాయాన్ని ప్రకటించారు. ఘర్షణల్లో ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు. పాతబస్తీ ప్రజలందరకూ ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
చెదిరిన ప్రశాంతత
- భయం గుప్పిట్లో సిక్ చావ్ని - కొనసాగుతున్న కర్ఫ్యూ - సాయుధ దళాల పహారా - రోడ్లు నిర్మానుష్యం - సంయమనం పాటించమంటున్న పోలీసులు అత్తాపూర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: క్షణంక్షణం.. భయం భయం.. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన.. వెరసి కిషన్‌బాగ్ సిక్చావ్ని ప్రజలు బుధవారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పొద్దుపొద్దునే ఇరువ ర్గాల మధ్య జరిగిన ఘర్షణ దరిమిలా రాళ్లదాడి.. గృహదహనాలు, వాహనాల ధ్వంసం, పోలీసు కాల్పులు.. కత్తిపోట్లతో కిషన్‌బాగ్ సిక్చావ్ని అట్టుడికి పోయింది. కళ్ల ముందు జరిగిన కల్లోలానికి స్థానికులు తల్లడిల్లి పోయారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం.. మరో 25 మంది గాయపడ్డారని తెలియడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాలేదు. సాయంత్రం వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. రోజంతా ఈ ప్రాంతం కర్ఫ్యూ నీడలో, పోలీసు బూట్లు, సైరన్ మోతలతో మార్మోగింది. అంతటా ఘటన గురించే చర్చించడం కనిపించింది. అడుగడుగునా పోలీసులే.. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు, టాస్క్‌ఫోర్స్, క్రైం బ్రాంచ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బందినంతా సిక్చావ్ని ప్రాంతంలో మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు శంషాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని సైతం రప్పించి బందోబస్తును ముమ్మరం చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి బందోబస్తును నిర్వహించారు. కేంద్ర బలగాలు సాయంత్రం ప్రధాన రహదారితో పాటు బస్తీల్లో కవాతు నిర్వహించారు. నిఘా వైఫల్యం.. నాలుగు రోజుల నుంచి సిక్‌చావ్నీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం సాధారణ ప్రజలకు తెలుసుకున్నా మన నిఘా వర్గాలు మాత్రం పసికట్టడంలో విఫలమయ్యాయి. నాలుగురోజుల క్రితం కిషన్‌బాగ్‌లోని ఓ ప్రార్ధనా మందిర ప్రధాన ద్వారానికి గుర్తుతెలియని వ్యక్తులు మాంసపు ముద్దలను పెట్టారని ఓ వర్గం వారు ఆరోపించినా పోలీసులు పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి అదే వర్గానికి చెందిన జెండాను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేయడం ఘర్షణలకు దారితీసింది. దశాబ్దం క్రితం ఇదే చోట, ఇదే కారణంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగిన విషయాన్ని నిఘా వర్గాలు మరచిపోయాయి. ఎవరికి వారు పట్టనట్టు వ్యవహరించారని, ప్రాణాల మీదకు వచ్చేంత వరకు నిద్ర మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇరు వర్గాల ఘర్షణలకు ముఖ్యంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలనే ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ బీఎస్ఎఫ్ బలగాలను ఎందుకు ఉపయోగించారనే విషయమై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. పదకొండేళ్ల క్రితం ఇలాగే.. పదకొండేళ్ల క్రితం ఇదే జెండాను కొందరు గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి వేళ దగ్ధం చేశారు. ఉదయం చూసిన మరో వర్గం ప్రజలు కోపోద్రిక్తులై పరస్పరం ఒకరిపై ఒకరు దాడు లు చేసుకున్నారు. రెండు గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన అనేక ఇళ్లు లూటీలకు గురయ్యాయి. ప్రస్తుతం బుధవారం ఇదే సంఘటన పునరావృతం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత అనుభవాన్ని తలుచుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పోలీసుల వైఫల్యంతోనే దాడులు: లోథా పోలీసుల వైఫల్యంతోనే దాడులు జరిగాయని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర బీజేపీ గోరక్షా సెల్ అధ్యక్షులు రాజాసింగ్‌లోథా ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం రెచ్చగొట్టే విధంగా ఓ వర్గం వారు ప్రవర్తించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మార్చురీ వద్ద ఉద్రిక్తత ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలియగానే బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎంఐఎం నాయకులు పాషాఖాద్రి, అహ్మద్ బలాల అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించేంత సేపు ఆసుపత్రి గేట్లను మూసివేశారు. ఉస్మానియా మార్చురీ అధిపతి టకీయుద్దీన్ ఆధ్వర్యంలో డాక్టర్లు సుధ, జనార్దన్, అభిజిత్‌లు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అల్లరి మూకలను గుర్తించే పనిలో పోలీసులు అల్లర్లతో పాటు రాళ్లు రువ్విన యువకులను గుర్తించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మీడియా వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా మూకలను గుర్తించవచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరిస్తున్నామని, వీటి సాయంతో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సంయమనం పాటించండి: సీవీ ఆనంద్ ఇరువర్గాలు సంయమనం పాటించాలని, వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. అల్లర్లు పూర్తిగా సద్దుమణిగే వరకు బందోబస్తు కొనసాగిస్తూ ఉంటామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామన్నారు. కర్ఫ్యూ సడలించే విషయంపై ఇంకా నిర్ణయించలేదన్నారు. -
మండుతున్న ముజఫర్‌నగర్
-
మండుతున్న ముజఫర్‌నగర్
ముజఫర్‌నగర్: మత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి.అల్లర్లలో మరణించినవారి సంఖ్య ఆదివారం నాటికి 21కి చేరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం భారీగా బలగాలు మోహరించింది. అయినా అల్లర్లు అదుపులోకి రావడం లేదు. జిల్లాలోని సివిల్ లైన్స్, కొత్వాలి, నైనీ మండి ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు, పీఏసీ బలగాలు కవాతు చేశాయి. ‘‘ఇప్పటిదాకా అల్లర్లలో 21 మంది మరణించారు. కొందరి ఆచూకీ లభించడం లేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు’’ అని జిల్లా కలెక్టర్ కౌశాల్ రాజ్ శర్మ వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి కాస్త అదుపులోనే ఉంద ని, ఇప్పటిదాకా 30 మందిని అరెస్టు చేశామని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్మీ బలగాలతోపాటు 10 వేల మంది పీఏసీ, 1300 మంది సీఆర్పీఎఫ్, 1200 మంది ఆర్ఏఎఫ్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. శనివారం చెలరేగిన హింసాకాండలో ఐబీఎన్7 చానల్ పార్ట్‌టైమ్ విలేకరి రాజేశ్ వర్మ, పోలీసులు కుదుర్చుకున్న ఒక ఫొటోగ్రాఫర్‌తోపాటు 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీడియో రేపిన చిచ్చు..! ముజఫర్‌నగర్ జిల్లా కావాల్ గ్రామంలో ఆగస్టు 27న ముగ్గురు వ్యక్తులు హత్యకు గురవడం, తదంనతర పరిణామాలతో అల్లర్లు చెలరేగుతున్నాయి. ‘‘కావాల్ గ్రామంలో ఇటీవల ఒక సంఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన నకిలీ వీడియోలను ఎవరో ఇంటర్నెట్లో పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ వీడియోను ఇంటర్నెట్ నుంచి తీసివేసినా గ్రామంలో ఆ ఘటనకు సంబంధించిన సీడీలు పంపిణీ అయ్యాయి. దీంతో ఒక వర్గానికి సంబంధించినవారు మహాపంచాయితీ తలపెట్టడంతో చుట్టుపక్కల ఊళ్లవారు కూడా వచ్చారు. ఫలితంగా శాంతిభద్రతల సమస్య తలెత్తింది’’ అని పోలీసులు వివరించారు. జిల్లాలో ఓ చోట్ల కొందరు దుండగులు ఆర్మీ జవాన్లపైకి కాల్పులు జరిపారని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కమల్ సక్సేనా చెప్పారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు బలగాలకు ఇచ్చారా అని ప్రశ్నిచంగా.. పరిస్థితి అదుపు తప్పుతుందని భావిస్తే కాల్పులు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. కాగా, పొరుగు జిల్లా మీరట్‌కు కూడా అల్లర్లు వ్యాపించినట్లు వదంతులు వచ్చాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఆ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు, మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూపీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పక్కనున్న ఉత్తరాఖండ్ కూడా అప్రమత్తమైంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారు నుంచి నివేదిక కోరింది. అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని హోంశాఖ సూచించింది. ఎస్పీ కన్నా బీఎస్పీ పాలనే నయం: దిగ్విజయ్ న్యూఢిల్లీ: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంటే బీఎస్పీ పాలనే నయమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అల్లర్లను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సామాజిక వెబ్సైట్లో మండిపడ్డారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.