సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచరంతో ఈ ఏడు భారీ భద్రతను పెంచారు. అలాగే ఈ సంవత్సరం ఆలయానికి భక్తులు ఎన్నడూ లేనంతగా వస్తారనే అంచనాలతో భధ్రతను కేరళ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. శబరిమల ఆలయం చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కేరళ పోలీస్ బలగాలు ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే.. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను ఇప్పటికే నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది.
డ్రోన్లతో పహారా!
శబరిమల అయ్యప్ప సన్నిధానంకు ఈ ఏడు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ప్రధానంగా సన్నిధానంను ప్రతిక్షణం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపింది. సన్నిధానంతో పాటు పంబా, అడవిదారి, ఎరుమేలి, ఇతర ముఖ్యప్రాంతాల్లో సైతం భద్రను పెట్టినట్టు సన్నిధానం ప్రత్యేక పోలీసు అధికారి కేకే జయరామన్ తెలిపారు. పదునెట్టాంబడి చుట్టూ పారా మిలటరీ బలగాలు పహారా కాస్తుంటాయన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచీ!
అయ్యప్ప భద్రత కోసం కేరళ పోలీసులతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకనుంచి అదనపు బలగాలను తెప్పించుకున్నట్లు కేకే జయరామన్ చెప్పారు.
అయ్యప్పలు సహరించాలి
అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధానంగా నీలిమల, మరక్కూట్టం యూ టర్న్, లోయర్ తిరుమట్టం వద్ద సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందని చెప్పారు.
అనుమతి ఉన్న వారికే!
సన్నిధానానికి వెళ్లే ప్రత్యేకదారిలో.. కేవలం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అనుమతి పత్రం, లేదంటే కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటీ కార్డు ఉండాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment