కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం | Governor narasimhan orders magistrate probe into kishanbagh sikh chawni incident | Sakshi
Sakshi News home page

కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం

Published Thu, May 15 2014 12:48 PM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM

కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం - Sakshi

కిషన్బాగ్ అల్లర్లపై న్యాయ విచారణకు ఆదేశం

హైదరాబాద్ : హైదరాబాద్లోని కిషన్బాగ్  సిక్‌చావ్ని అల్లర్లపై గవర్నర్ నరసింహన్ న్యాయ విచారణకు ఆదేశించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50వేల సహాయాన్ని ప్రకటించారు. ఘర్షణల్లో ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు. పాతబస్తీ ప్రజలందరకూ ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా  ఈ ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement