
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడకుడు, ఒక కూతురు ఉన్నారు.
బాధితురాలు వేస్ట్ మెటీరియల్‌ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అవ్వగా.. నేడు ఆలస్యంగా మహిళ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గవర్నర్ ఆవేదన
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు.
చదవండి: ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా
Comments
Please login to add a commentAdd a comment