Nanakram guda
-
ఇగ్నిషియో క్రికెట్ సిరీస్ విజేతగా ‘బ్యాట్ కేవ్’ జట్టు
ఎస్ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 విజేతగా ది బ్యాట్ కేవ్ జట్టు నిలిచింది. నానక్ రామ్ గూడ లో శుక్రవారం నిర్వహించిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో క్లాసిక్ కల్ట్ స్టార్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 163/5 స్కోరు చేయగా, ది బ్యాట్ కేవ్ జట్టు 16.5 ఓవర్లలో 165/5 స్కోరు చేసి విజేతగా నిలిచింది.టోర్నమెంట్‌కు ది బ్యాట్ కేవ్, వావ్ కాజ్. కామ్, హైరింగ్ ఐ, టాలెంట్ కన్సల్టింగ్ స్పాన్సర్స్ గా, ఇగ్నిటియో చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ప్రణీత్ కళ్లేపు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మోహన్, బెస్ట్ బ్యాట్స్‌మెన్ గా ప్రణీత్ కళ్లేపు, బెస్ట్ బౌలర్ గా రాధా నిలిచారు. ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ విజేతల ట్రోఫీని అందజేశారు. చిన్నతనంలో సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అభివృద్ధి ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇగ్నిషియో అత్యుత్తమ సేవలను అందిస్తున్నదని తెలిపారు. అందరూ ఆటను ఆస్వాదిస్తూ కొనసాగించాలని ప్రోత్సహించారు. -
గచ్చిబౌలిలో మహిళపై హత్యాచారం.. గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడకుడు, ఒక కూతురు ఉన్నారు. బాధితురాలు వేస్ట్ మెటీరియల్‌ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అవ్వగా.. నేడు ఆలస్యంగా మహిళ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ ఆవేదన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు. చదవండి: ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా -
హైదరాబాద్ నానక్ రాంగూడలో విషాదం..
-
హైదరాబాద్‌లో మరో ఇంటిని కొనుగోలు చేయనున్న ప్రభాస్.. రూ. 200 కోట్లతో
బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత సినిమాల ఎంపికలో ప్రభాస్ చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్‌తోపాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో రూ.120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం. చదవండి: సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! కాగా నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్లతో సహా ఇతర రంగాలకు చెందిన పేరుమోసిన వ్యక్తులు నివసిస్తుంటారు. అంతేగాక షూటింగ్ జరిగే ప్రదేశాలకు చేరువలో ఉంది. ఇప్పటికే బాహుబలికి జూబ్లీహిల్స్‌లో ఓ భవంతి ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటి నుంచో ప్రైమ్ రియల్ ఎస్టేట్ కొనాలని ప్రభాస్ ఎజెండాలో ఉంది. ఇప్పుడు కొన్న స్థలంలో తనకు అనుకూలంగా నిర్మించుకోనున్నట్లు వినికిడి. చదవండి: విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై -
1,000 కోట్లతో ఒలింపస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమధుర, వాసవి గ్రూప్‌లు సంయుక్తంగా కలిసి నానక్‌రాంగూడలో ఒలింపస్ పేరిట లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే ఎత్తయిన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్ తెలిపారు. 5.06 ఎకరాలు, 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+ 44 అంతస్తులలో ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 854 ఫ్లాట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. 50 వేల చ.అ. క్లబ్‌హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ సూట్స్, స్పోర్ట్స్ బార్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
అద్దాల మేడలు.. అందమైన భవంతులు..
రాయదుర్గం: నగరానికి శివారులో నానక్‌రాంగూడ ఒకప్పుడు రాతి, మట్టిగుట్టలు, పంట పొలాలు ఉండేవి. అయితే ఇపుడు అక్క బహుళ అంతస్తుల అద్దాల మేడలతో రూపురేఖలే మారిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ నేడు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ఆమెజాన్ రాకతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. సుమారు 313 ఎకరాల విశాల స్థలంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం రూపుదిద్దుకుంది. ఇందులో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రేడింగ్, ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఆఫీస్ ఆపరేషన్స్, కమొడిటీస్ ఎక్ఛేంజ్, వెంచర్ క్యాపిటల్, అసెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో సుమారు రెండున్నర లక్షల మంది ఐటీ, ఇతర కేటగిరీల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే వెలిసిన కంపెనీలు ఇవే... నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అనేక కంపెనీలు వెలిశాయి. అందులో తాజాగా 12.3 ఎకరాల విశాల స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసినవిషయం తెలిసిందే. ఇందులో 15వేల మందికి ఉపాధి కలుగనున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్, ఐఆర్డీఏ, ఐసీఐసీఐ, ఐఐఆర్ఎం, హనీవెల్, కాంగ్నిజెంట్, హిటాచీ కన్సల్టింగ్, వర్చూషా, యాక్సెంచర్, టీసీఎస్, సైయింట్, క్యాపెజెమినీ, కంప్యూటర్ అసోసియేట్స్, ఓఎన్జీసీ,ప్రాంక్లిన్ టెంపుల్టన్, విజువల్సాఫ్ట్ వంటి అతిపెద్ద సంస్థలు వెలిశాయి. ఇందులో సీఏ సంస్థనే అతిపెద్దగా 20కి పైగా ఎకరాల్లో వెలిసింది. కాగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , వేవ్‌రాక్, విజువల్సాఫ్ట్, క్యాపెజెమిని, కాంగ్నిజెంట్, హనీవెల్, సెయింట్ వంటి సంస్థలు పదిఎకరాలకుపైగా ఏర్పాటయ్యాయి. షెరటాన్, హయ్యత్, ఓక్వుడ్ రెసిడెన్సీ వంటి స్టార్ హోటళ్ళు కూడా వెలిశాయి. క్యూసిటీ, కపిల్ టవర్స్, యాక్సెంచర్ వంటి అతిపెద్ద భవనాలు వెలిశాయి. వైద్యసౌకర్యం కోసం కాంటినెంటల్ ఆస్పత్రి, వాహనాల కోసం వరుణ్‌మోటార్స్ వంటివి కూడా నిర్వహిస్తున్నారు. వీటి చెంతనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, ఇన్ఫోసిస్, టీఎస్ఐఐసీ సైబరాబాద్జోన్ కార్యాలయం, జలమండలి గచ్చిబౌలి సెక్షన్ కార్యాలయం, శాంతిసరోవర్‌లోని ఇన్నర్‌స్పేస్ భవనం కూడా ఉన్నాయి. నిన్న వన్‌ప్లస్ .....త్వరలో అమెరికన్ కాన్సులేట్, గూగుల్...... ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో మరికొన్ని సంస్థలు రానున్నాయి. వాటిలో సోమవారం రోడ్ నెంబర్–2లో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. త్వరలో అమెరికన్ కాన్సులేట్, గూగుల్ సంస్థలు రానున్నాయి. వీటిలో అమెరికన్ కాన్సులేట్‌కు 12.17 ఎకరాలు, గూగుల్ సంస్థకు ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మరో ఏడాదిన్నరలో అమెరికన్ కాన్సులేట్ భవనాన్ని పూర్తి చేయాలని బావిస్తున్నట్లు తెలిసింది. దీని రాకతో ప్రతి నిత్యం రెండున్నర వేల మందిని వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మరింతగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరుగనుంది. లింకు రోడ్లపై దృష్టి పెట్టిన టీఎస్ఐఐసీ సంస్థ.... నానక్‌రాంగూడ ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి రాకపోకలు నగరం నుంచి చుట్టూరా ఉండే ప్రాంతాల నుంచి సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందు కోసం ఈ రెండు ప్రాంతాల కోసం లింకు రోడ్ల నిర్మాణంపై టీఎస్ఐఐసీ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం రోజురోజుకూ బిజీగా మారుతోంది. ఇప్పటికే రెండున్నర లక్షల మంది పనిచేస్తుండగా మరో 20వేల మంది దాకా పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో టీఎస్ఐఐసీ పాలకమండలి, ఉన్నతాధికారుల చొరవతో లింకురోడ్ల నిర్మాణం, ఆర్టీసీ బస్సులతోపాటు టీఎస్ఐఐసీ ద్వారా ఆరు ఉచిత బస్సులను ఐటీ ఉద్యోగుల కోసమే నడుపుతున్నాం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తాం. హరితహరంలో గ్రీనరీని పెంచుతున్నాం. – వినోద్‌కుమార్, జోనల్ మేనేజర్– సైబరాబాద్జోన్ టీఎస్ఐఐసీ -
హైదరాబాద్‌లో భారీ పేలుడు..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలిలో గల నానక్రాంగూడాలో శుక్రవారం సాయంత్రం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఫొనెక్స్ భవనంలో ఈ పేలుడు జరిగింది. పేలుడి ధాటికి పక్కనే ఉన్న లారీ, జేసీబీలు ధ్వంసం అయ్యాయి. దగ్గరలో ఉన్న అపార్ట్మెంటుకు పగుళ్లు ఏర్పడ్డాయి. అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అందులోని వారికి గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. కొండ ప్రాంతంలో నిర్మాణం కావడంతో రాళ్లను పగుల గొట్టేందుకు పేలుడు పదార్థాలను అమర్చివుంటారని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పగటి పూట పేలుడు పదార్థాలు వినియోగించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. భవన నిర్మాణ సైట్లో మరిన్ని పేలుడు పదార్థాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాలు కావడంతో లోపలికి వెళ్లకుండా, బాంబు స్క్వాడ్ వచ్చేవరకూ వేచి చూడాలని నిర్ణయించారు. పుప్పాల గూడ ఫినిక్స్ సెజ్‌లో ఈ పేళుల్లు జరిగాయి. బ్లాస్టింగ్ వల్ల ఈ పేళుల్లు జరగలేదు. పేలుడు సామాగ్రి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అందుకే టిప్పర్‌తో సహా ఆ ప్రాంతంలో ధ్వంసమయ్యాయి. సురేష్ అనే సూపర్ వైజర్, రమేష్ అనే డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేశాం. పేళుల్ల కోసం ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనేది చెక్ చేస్తున్నాం. -మదాపూర్ డీసీపీ. వెంకటేశ్వర్ రావు -
వెలుగు చూస్తున్న సత్తూ సింగ్ అరాచకాలు
-
మంత్రి కుటుంబసభ్యులైనా అరెస్టు చేస్తాం: కేటీఆర్
నానక్‌రాంగూడ ప్రాంతంలో కుప్పకూలిన భవన యజమాని ఒక మంత్రికి దగ్గర అన్నట్లుగా కొన్ని కథనాలు వచ్చాయని.. ఈ ఘటనలో నిందితులు స్వయానా మంత్రి కుటుంబ సభ్యులైనా కూడా వదిలేది లేదని, అరెస్టు చేసి తీరుతామని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. భవనం కూలిన స్థలానికి వచ్చి సహాయ పనులను పర్యవేక్షించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను, ఏసీపీని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించామని అన్నారు. తాను సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తానన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, బిల్డర్ల దురాశ కారణంగా ఇలా జరుగుతోందని, కనీస విద్యార్హతలు లేకపోయినా ఎవరైనా కూడా బిల్డర్లుగా అయిపోవచ్చని ఆయన అన్నారు. దురాశ కారణంగా చిన్న స్థలంలోనే ఇంత పెద్ద భవనం కట్టారని, అందులోనూ నాణ్యత లేకపోవడంతో అది కుప్పకూలిందని చెప్పారు. భవన యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సెల్ స్విచాఫ్ చేసి ఉందంటున్నారని, మరికొందరు శబరిమల వెళ్లారంటున్నారని.. ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సత్యనారాయణ సింగ్ కుటుంబసభ్యులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నాని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందే నిర్మాణాలను అడ్డుకుని ఉంటే ప్రమాదం సంభవించేది కాదని అన్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్‌ను తిరిగి తెరవడానికి కూడా తాము అనుమతి ఇవ్వలేదని, వాళ్లు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని.. జీహెచ్ఎంసీ వైపు నుంచి ఎవరినీ ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. నానక్‌రాంగూడ అనేది గ్రామపంచాయతీ అని, పైగా ఈ స్థలం గ్రామకంఠని.. ఇలాంటి నిర్మాణాలను నియంత్రించాలంటే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ ఘటన జరగకముందే, మొన్నటినుంచి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ నడుస్తోందని, అధికారులు మొత్తం 12 బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను కూల్చివేసే చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలా జరగడం దురదృష్టకరం, బాధాకరమని, ప్రభుత్వం పక్షాన పూర్తి పునరావాస చర్యలు తీసుకుంటాం, పరిహారం ఇస్తామని అన్నారు. ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరారు. -
హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం
-
హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం భూకబ్జా బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నానక్ రాం గూడ ప్రాంతంలోని ఆమె ఆరు ఎకరాల స్థలాన్ని నయీం కబ్జా చేసి మరీ స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ హత్యకేసులోనూ నయీం పాత్ర ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ నయవంచక దందాలో నయీంకు కొంతమంది పోలీసులు సైతం సహకరించినట్లు వెలుగుచూడటం ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ ఐపీఎస్ అధికారి పాత్రపై సిట్ దృష్టి పెట్టింది. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ తన దందాను విస్తరించేందుకు నయీం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సహకరించినందుకు పోలీసులకు రూ.5 కోట్లు అతడు చెల్లించినట్లు తెలుస్తోంది. తను చేసిన అక్రమాలన్నీ పూసగుచ్చినట్టు నయీం డైరీలో రాసుకున్న సంగతి తెలిసిందే. నయీం డైరీని విశ్లేషిస్తున్నకొద్దీ ఇలాంటి వాస్తవాలెన్నో వెలుగుచూస్తున్నాయని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. వికారాబాద్‌లో నయీంకు చెందిన 15 ఎకరాలు ఫాంహౌస్‌ను తాజాగా సిట్ అధికారులు గుర్తించారు. అలాగే దుర్గామాత సొసైటీలో 60 ప్లాట్లు నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్ అధికారికి శంషాబాద్‌లో భూమి ఉందని, ఆ పోలీస్ అధికారి ఈ లావాదేవీలను నయీం దగ్గరుండి నడిపించినట్లు సమాచారం. ఆ అధికారికి శంషాబాద్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు 10 ఎకరాల్లో ఫంక్షన్ హాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో ఓ న్యాయవాది హత్య వెనుక నయీం హస్తమున్నట్లు సమాచారం. రెండెకరాల స్థల వివాదంలో అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని, ఇందుకు అతనికి పోలీసులు సైతం మద్దతు తెలిపారని అంటున్నారు. తనకు సహకరించినందుకుగాను కొందరు పోలీసులకు నయీం మంచి పోస్టింగ్‌లు ఇప్పించినట్టు వినిపిస్తోంది. వీటన్నింటిపైనా సిట్ దృష్టిపెట్టింది. ఆరోపణలు ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులపై దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలి? మరిన్ని ఆధారాల సేకరణపై సిట్ శనివారం సమావేశమైంది. -
నానక్‌రామ్ గూడలో మొక్కలు నాటిన హీరో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తనవంతుగా మద్దతు తెలిపాడు. సోమవారం ఉదయం అతడు నానక్‌రామ్ గూడలో రెండు మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరాడు. 'గుడ్ మార్నింగ్!! దిస్ ఈజ్ హౌ మై డే బిగెన్! ట్రీ ప్లాంటేషన్ ఇన్ నానక్ రామ్ గూడ!!మేక్ యూఆర్ ఆల్సో గ్రీన్!! అంటూ రానా ట్విట్ చేశాడు. కాగా హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీనటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. Good Morning!! This is how my day began! Tree plantation in Nanakramguda!! Make urs as green!! #HarithaHaram pic.twitter.com/kcqy8CZGiH — Rana Daggubati (@RanaDaggubati) 11 July 2016