
'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది'
తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో హింసాత్మక ఘటన పథకం ప్రకారమే జరిగిందనిపిస్తోందని అడిషనల్ డీజీ ఠాకూర్ అన్నారు. జిల్లాలో ఐదు వేలమంది సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించినట్టు తెలిపారు.
ఆదివారం తునిలో కాపుల ఆందోళన సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారని అడిషనల్ డీజీ చెప్పారు. తుని ఘటనలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటన వెనుక నిఘా వైఫల్యం లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైలు ప్రయాణికులను పోలీసులు కాపాడారని, లేదంటే ప్రాణనష్టం జరిగేదని ఠాకూర్ వెల్లడించారు.