communal violence
-
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
మణిపుర్‌కు మతం రంగు!
మణిపుర్లో విధ్వంసం కన్నా మణిపుర్‌పై విధ్వంసక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది! దేశంలో ఎక్కడేం జరిగినా దానికి మతాన్ని అంటుకట్టేలా తయారైన రాజకీయ వ్యవస్థ ఆఖరికి మణిపుర్‌లోని తెగల మధ్య ఘర్షణలను కూడా ‘మత కలహాలు’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మణిపుర్‌తో సంబంధం లేని రాష్ట్రాలకు సైతం ఆ ‘రాజకీయ మతోన్మాదం’ వ్యాపించింది! దురుద్దేశాలతో కొన్ని విదేశీ శక్తులు, పొద్దెరగని కొందరు దేశవాళీ కొత్త రాజకీయవాదులు స్వార్థ ప్రయోజనాల కోసం మణిపుర్ నిప్పుల కుంపటిని తమ ప్రసంగ వేదికలపైకి మోసుకెళుతున్నారు. అవి మత కలహాలు కావు... భూమి హక్కుల తగాదాలని తెలిసీ మణిపుర్‌కు మతం రంగును పులుముతున్నారు! నిరుడు ఈ సమయానికి మణిపుర్ ప్రశాంతంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రశాంతం. మార్చి నెలలో కూడా ప్రశాంతం. ఏప్రిల్ వచ్చేసరికికొంచెం వేడెక్కింది. అయితే అది... ఏప్రిల్‌లో 16 సెల్సియస్ డిగ్రీలతో మొదలై, జూన్ నాటికి 35 డిగ్రీల వరకు చేరుకునే ఎండాకాలపు వేడిమి కాదు. నిరసన ప్రదర్శనల వేడి. దాడులు, దహనాల వేడి. నిజానికి అంతకు పదేళ్లు, ఆ ముందు పదేళ్ల నుంచి కూడా మణి పుర్ దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేసేంతగా అక్కడేం జరగలేదు. గత మే నెల నుంచే హింసాకాండ మొదలైంది. మూకుమ్మడి దాడులు, గృహదహనాలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మణిపుర్‌ను అగ్నిగుండంలా మార్చేశాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 180 మంది మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. డిసెంబరులో మణిపుర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపించినప్పటికీ కొత్త సంవత్సరంలో మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. జాతుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు విద్వేష జ్వాలలే అయ్యాయి. ఇంతకన్నా ఘోరం... అక్కడ జరుగుతున్న ఘటనలపై పాశ్చాత్య మీడియా చేస్తున్న దుష్ప్రచారం! వారితో పాటు అంతర్గతంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా మణిపుర్‌కు మతంరంగు పులిమేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ‘‘1947లోపంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలన కాండను మణిపుర్ ఘటనలు గుర్తు చేస్తున్నాయి’’ అనేంతగా ప్రచారం జరుగు తోంది. వారి వ్యతిరేకత ఎవరి మీదనైనా కావచ్చు. కానీ వాస్తవాలను హతమార్చడం ఎందుకు? పర్ణశాల వంటి మణిపుర్‌పై మతోన్మాద మరకల్ని అంటించడం దేనికి?భౌగోళికంగా మణిపుర్ ప్రత్యేకమైనది. రాష్ట్రంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన భూభాగంలో రాష్ట్రంలోని దాదాపుతొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మైతేయిలు. రాష్ట్రంలో వారి జనాభా దాదాపు 53 శాతం. దీంతో సహజంగానే రాజకీయాల్లో వారిదే ప్రాబల్యం. 60 సీట్ల అసెంబ్లీలో 40 స్థానాలు వాళ్లవే.కొండ ప్రాంతాల్లోని గిరిజనులైన కుకీలు, నాగాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండటం, మైదాన ప్రాంత గిరిజనులైన మైతేయిలకు ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం... కాలక్రమంలో రెండు వర్గాల మధ్య సఖ్యత లోపించడానికీ, సంఘర్షణకూ కారణం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడానికి మణిపుర్ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పు కారణం అయింది. మణిపుర్‌ను రణపుర్గా మార్చేసింది. 2023 మార్చి 27న షెడ్యూల్డు తెగల జాబితాలోకి మైతేయి తెగలను చేర్చేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు సిఫారసు చేయాలని మణిపుర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కుకీలు, నాగాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గంగా మైతేయిలదే రాజకీయంగా పైచేయిగా ఉందనీ, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను వారు ఇప్పటికే అనుభవిస్తున్నారనీ, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదనీ అభ్యంతరం చెబుతున్నారు. మైతేయిలకు రిజ ర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారనీ, తమ ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనీ ఆందోళన చెందుతున్నారు. అయితే, మైతేయిల వాదన మైతేయిలకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ ఆదివాసీల్లోని ముప్పైకి పైగా తెగలకు ఎస్టీలుగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. తమకు ఆ గుర్తింపు లేని కారణంగా దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని... తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయిల వాదన. అంతేకాదు 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయిలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోర్టుకు విన్నవించుకున్నాం అని మైతేయి సంఘం అంటోంది. కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా... సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్ర దాయాలను కాపాడుకోవటం కోసం ఎస్టీలుగా గుర్తింపును కోరు తున్నామని కోర్టులో వాదించింది. మణిపుర్ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందో ళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభ వించాయి. చర్చిలు, దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇవేమీ మత కలహాలు కావు. భూమి హక్కుల విషయమై మొదలై, నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు. అయితే మణì పూర్లో జరుగుతున్నవి మత ఘర్షణలు అని, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులు విధ్వంసానికి పాల్పడు తున్నారనే దుష్ప్రచారం సాగుతోంది. గమనించాల్సి వాస్తవం ఏమి టంటే మైతేయి తెగల్లో అధిక సంఖ్యాక హిందువులతో పాటు, ముస్లింలు, క్రిస్టియన్లు; కుకీ నాగాల్లోనూ అధిక సంఖ్యాక క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింలు ఉన్నారన్నది! మణిపుర్ తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా కొన్ని పాశ్చాత్య దేశాలకూ, మన దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీల వారికీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే, ఎవరి స్వార్థ ప్రయో జనాలు వారివి. నిజానికి మత ఘర్షణలనేవి మణిపుర్ చరిత్రలోనే లేవు. ‘‘కుకీ, నాగా తెగలకు పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మైతేయిలది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మరిక మతోన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అంటారు మణిపుర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రియోరంజన్ సింగ్. అయితే రెండు వేలకు పైగా చర్చిలను ధ్వంసం చేశారని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వారికి ఏ క్రైస్తవ దేశాలు అందించాయో వారే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా 100 దేవాలయాలతో పాటు రెండు వేల మైతేయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. మరి వీటిని ఏమంటారు? మత ఘర్షణలు అనేనా! మైతేయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు’’ అని స్పష్టం చేశారు. ఆ మాటను కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్పేవారెవరు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పేవారెవరు? ‘‘మణిపుర్లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్ చేసి మతపరమైనహింసగా చూపించడం ఇదే మొదటిసారి’’ అని స్వయంగా మణిపుర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబబ్రత సింగ్ అన్నారు కదా! బాధ్యత గల రాజకీయ నాయకులు ఎవరూ మణిపుర్లో జరుగు తున్న మతపరమైన దాడులు అని అనలేదు. అలాంటి ప్రచారానికి తావు కూడా ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మణిపుర్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మీరు క్రిస్టియన్ అయుండీ ఎందుకు మణిపుర్ క్రిస్టియ న్లను సమర్థించడం లేదు?’’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఇలా ఒక మతం వారిని రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పే పని లేదు. – మాధవ్ శింగరాజు, సీనియర్ జర్నలిస్ట్ -
లోక్‌సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు. -
బజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో ఉద్రిక్తత
ఢిల్లీ: దేశరాజధాని మరోసారి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడికిపోతోంది. సెంట్రల్ ఢిల్లీలో ఓ యువకుడి హత్యతో శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితికి చేరుకుంది. దీంతో పటేల్‌నగర్ ఏరియాలోని రంజిత్ నగర్ ప్రాంతంలో, బల్జీత్నగర్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. మత కోణంలో ఈ దాడి జరిగిందనే ప్రచారం మొదలవ్వడంతో.. డీసీపీ శ్వేత చౌహాన్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చనిపోయింది బజరంగ్ దళ్ కార్యకర్త కావడం, అతనిపై కిరాతకంగా దాడి చేసింది ఉఫీజా, అద్నాన్, అబ్బాస్ కావడంతో.. మత కోణంలో చర్చ జరుగుతోంది అక్కడ. 13వ తారీఖు అర్ధరాత్రి యువకుడిపై దాడి జరగ్గా.. చికిత్స పొందుతూ అతను శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఆదివారం స్థానికులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని వ్యతిరేక నినాదాలతో హెరెత్తించారు బజరంగ్ దళ్ ప్రతినిధులు. మరోవైపు కుటుంబ సభ్యులు సైతం తొలుత అంత్యక్రియలు నిర్వహించకుండా.. నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో పటేల్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించి.. యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. అక్టోబర్ 12వ తేదీ రాత్రి సమయంలో బల్జీత్ నగర్‌కు చెందిన నితేశ్(25) తన స్నేహితులు మాంటీ, అలోక్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో బైక్‌పై దూసుకొచ్చిన ఓ వ్యక్తిని అడ్డగించి దాడి చేశారు. ఈ క్రమంలో దెబ్బలు తిన్న వ్యక్తి తన స్నేహితులను తీసుకొచ్చి.. నితేశ్, మాంటీ, అలోక్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు దుర్బాషలాడుకోవడంతో.. గొడవ పెద్దదైంది. అర్ధరాత్రి సమయంలో నితేష్ అతని స్నేహితులపై రంజిగ్ నగర్ దగ్గర కర్రలు, రాడ్లతో దాడి చేశారు నిందితులు. నితిశ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులకు సైతం గాయాలయ్యాయి. ‘‘దాడికి పాల్పడింది ఉఫిజా, అబ్బాస్, అద్నాన్లుగా గుర్తించాం. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో మత కోణం ఏమీ లేదని.. చిన్నగొడవ చిలికి చిలికి గాలివానగా మారిందని, అనవసరంగా మతం రంగు పులుమొద్ద’’ని డీసీపీ శ్వేతా చౌహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు. నితేష్ కుటుంబ సభ్యులు సైతం ఒకరినొకరు దుర్బాషలాడిన క్రమంలోనే దాడి జరిగిందని చెప్పడం గమనార్హం. అయితే.. స్థానికులు, బజరంగ్ దళ్ ప్రతినిధులు మాత్రం ఈ హత్యలో మత కోణం ఉందని వాదిస్తున్నారు. నితేశ్ ఈ మధ్యే బజరంగ్ దళ్‌లో చేరాడని, అందుకే అతన్ని టార్గెట్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. దగ్గర్లోని మసీదు దగ్గరి నుంచి కొందరు దూసుకొచ్చి నిందితులతో కలిసి దాడి చేశారని చెప్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం స్థానికులు చెప్పేదాంట్లో వాస్తవం లేదని అంటున్నారు. అంతేకాదు.. నితేశ్, అలోక్‌లపై ఇంతకు ముందు చాలా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. A 25-year-old youth named Nitesh died on Saturday night after he was assaulted on last wednesday night by some people in Ranjit Nagar locality of Patel Nagar area in Delhi. Accused are identified as Ufiza, Adnan and Abbas. pic.twitter.com/yk880kIHzP — Nikhil Choudhary (@NikhilCh_) October 16, 2022 ఇదీ చదవండి: ప్రాణస్నేహితుడిని చంపి డ్రైనేజీలో పడేశారు! -
కర్ణాటకలో ముసుగు దుండగుల దాడి కలకలం
బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది. Karnataka | Last rites of man hacked to death by an unidentified group yesterday being performed in Surathkal near Mangaluru pic.twitter.com/40mIW4SleD — ANI (@ANI) July 29, 2022 ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం -
ర్యాలీలో బాలుడి మత విద్వేష నినాదాలు.. కేసు నమోదు
Raising Anti Communal Slogans At Rally.. ఓ ర్యాలీలో పిల్లాడు మత విద్వేష నినాదాలు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా( PFI) ఆధ్వర్యంలో శనివారం ‘సేవ్ ది రిపబ్లిక్’ పేరుతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పిల్లాడు.. రెండు వర్గాలకు వ్యతిరేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇదిలా ఉండగా.. PFI ఛైర్మన్ ఒమా సలామ్.. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదుపై కొనసాగుతున్న వివాదం RSS అజెండాలో భాగమని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాజకీయ, మతపరమైన ర్యాలీల్లో పిల్లలను ఉపయోగించుకోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ గోపినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఇలాంటి ద్వేషపూరిత వాతావరణంలో పెరగడం ఆందోళనకరమన్నారు. కొత్త తరాన్ని ఇలా పెంచడం కరెక్ట్ కాదు.. ఏదో ఒకటి చేయాలి’’ అని ఆయన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లాడిని ర్యాలీకి తీసుకువచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో పీఎఫ్ఐ అలప్పుజా జిల్లా అధ్యక్షుడు నవాస్ వందనం, జిల్లా కార్యదర్శి ముజీబ్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. Slogans from the PFI rally in Alappuzha, Kerala: "Hindus should keep rice for their last rites & Christians should keep incense for their last rites. If you want to here, live decently, otherwise we know how to implement Azadi" Warning by a minor boy & radicals from Kerala. pic.twitter.com/zoPxCYIzyf — Anshul Saxena (@AskAnshul) May 23, 2022 ఇది కూడా చదవండి: మందు గ్లాసుతో మాజీ మంత్రి కొడుకు అరాచకం.. ఫుల్లుగా తాగి రోడ్డుపై హల్చల్ -
హనుమాన్ జయంతి ర్యాలీలో హింస.. 14 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. జహంగీర్‌పురి ప్రాంతంలో ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దాడిలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక స్థానికుడు, ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. అతని చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే అతని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాల్పులు జరిపిన అస్లాం కూడా ఉన్నాడు. నిందితుడి నుంచి ఒక కంట్రీమేడ్ పిస్తోల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఢిల్లీలో రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలోని వీడియోల ద్వారా మరింతమంది అనుమానితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: ఢిల్లీ హనుమాన్ జయంతి శోభాయాత్రపై రాళ్ల దాడి హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా చెలరేగిన ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వహించడంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడాలని, 13 ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అలాగే మతపరమైన హింసలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దేశంలో జరుగుత్ను మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని మౌనం వహించడం షాక్‌కు గురిచేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో, చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ‘ప్రధాని మౌనం.. ఇలాంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుంది. వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచింది’ అని విపక్షాలు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక సంతకం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ(ఎం), డిఎంకే, ఆర్జేడీ, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. కాగా శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు జాబితాలో లేకపోవడం గమనార్హం. -
ప్రధాని మోదీ.. మీరు మౌనంగా ఉండడమేంటి?
న్యూఢిల్లీ: దేశంలో ఈమధ్యకాలంలో నెలకొన్న పరిస్థితులపై, చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. శ్రీరామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణలను హైలైట్ చేస్తూ.. మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తారతమ్యాలకు, రాగద్వేషాలకు తావులేకుండా దేశం మొత్తం శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన ఆ పార్టీలు.. మత హింసకు కారణమైనవాళ్లను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘర్షణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సంయుక్త ప్రకటనలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని, వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని ఆరోపించాయి. తినేతిండి, కట్టుకునే బట్ట, వాళ్ల వాళ్ల విశ్వాసాలు, పండుగలు, భాషకు..ఇలాంటి విషయాలను పాలక వ్యవస్థలోని వర్గాలు.. మన సమాజాన్ని ధ్రువీకరించడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నతీరుపై చింతిస్తున్నాం. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన సంఘటనలు పెరిగిపోతున్నాయి. అధికారమనే అండతో రెచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లపై అర్ధవంతమైన, బలమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నాం అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. హిజాబ్, హిందీ భాష, తిండిపై ఆంక్షలు, మత ఘర్షణలు.. ఇలా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న అంశాలపైనే ఈ పార్టీలు, ప్రధాని మోదీని నిలదీసినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్జేడీతో పాటు మరికొన్ని ఈ సంయుక్త ప్రకటనలో సంతకాలు చేశాయి. అయితే.. శివసేన, ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. -
చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్‌కు ప్రమోషన్
మంటల్లో చిక్కుకున్న చోటు నుంచి ఓ పసికందును.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన కానిస్టేబుల్ సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ కరౌలీలో శనివారం మత ఘర్షణలు చెలరేగాయి. ఆ టైంలో పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ Netresh Sharma చేసిన సాహసంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ర్యాలీ సందర్భంగా.. కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఆ టైంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నేత్రేష్ గాయపడ్డ వాళ్లకు సాయం చేశాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు నిప్పు అంటుకున్న రెండు షాపుల మధ్య ఇంటి నుంచి మహిళను, ఆమె చంటి బిడ్డను నేత్రేష్ ఆదుకోవడం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. "तम में प्रकाश हूँ, कठिन वक़्त की आस हूँ।" So proud of constable Netresh Sharma of Rajasthan Police for saving a precious life. This picture is in deed worth a thousand words.. pic.twitter.com/U2DMRE3EpR — Sukirti Madhav Mishra (@SukirtiMadhav) April 4, 2022 ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఈ రియల్ హీరో సింపుల్‌గా ‘అది నా బాధ్యత’ అంటూ చెప్పాడు. అయితే తమ కానిస్టేబుల్ తెగువను రాజస్థాన్ పోలీస్ శాఖ మాత్రం గర్వంగా భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దృష్టికి ఈ విషయం వెల్లడంతో స్వయంగా నేత్రేష్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాదు.. కానిస్టేబుల్‌గా ఉన్న నేత్రేష్‌ను హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. करौली में अपना कर्तव्य निभाते हुए 4 लोगों की जान बचाने वाले कांस्टेबल श्री नेत्रेश शर्मा से फोन पर बात कर उन्हें शाबासी दी। श्री नेत्रेश को हेड कांस्टेबल के पद पर पदोन्नत करने का निर्णय किया है। अपनी जान की परवाह ना कर कर्तव्य निभाने वाले श्री नेत्रेश का कार्य प्रशंसनीय है। pic.twitter.com/3p4ekYNYhn — Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2022 ఘర్షణలు చెలరేగిన వెంటనే.. ఇంటర్నెట్పై పరిమిత ఆంక్షలు, 144 సెక్షన్ విధించిన పోలీసులు చాకచక్యంగా పరిస్థితిని అదుపు చేయగలిగారు. ఇక ఘర్షణలకు సంబంధించి 46 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి ఘర్షణలకు సంబంధించి నిజనిర్ధారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్, రఫిక్ ఖాన్లు ఉన్నారు. एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम। करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs — Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022 -
‘వారి నెత్తుటితో మా పార్టీ తడిసిపోయింది’
అలీఘర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సొంత పార్టీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ముస్లింల నెత్తుటి మరకలతో తడిసిపోయిందంటూ’ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమిర్ మింటో అనే విద్యార్థి.. ‘కాంగ్రెస్ పాలనలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగాయి కదా’ అంటూ సల్మాన్ ఖుర్షీద్‌ను ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా.. ‘కాంగ్రెస్ పార్టీకి ముస్లింల నెత్తుటి మరకలు అంటుకున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకుడిగా నాకు కూడా అందులో భాగం ఉన్నట్టుగా భావిస్తున్నా’ అంటూ సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. సల్మాన్ సమాధానం విన్న తర్వాత ఆమిర్ మింటో మరిన్ని ప్రశ్నలు సంధించాడు. ‘1948లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎమ్యూ) చట్టానికి చేసిన సవరణల వల్ల ముస్లిం దళితలు ఎస్సీ, ఎస్టీ కోటా ద్వారా పొందే రిజర్వేషన్‌కు దూరం అయ్యారు. హషీమ్పురా, మల్యానా, మీరట్, ముజఫర్ నగర్, భగల్పూర్, మొరదాబాద్, అలీఘర్‌లలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు.. బాబ్రీ మసీదు కూల్చివేత కూడా కాంగ్రెస్ పాలనలో జరిగింది కదా. మరి మీరన్నట్టు ఆ నెత్తుటి మరకలను కాంగ్రెస్ పార్టీ ఎలా శుభ్రం చేసుకోగలదు’ అంటూ ఆమిర్ మింటో ప్రశ్నించాడు. అయితే తానొక వ్యక్తిగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, తాను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కాదని, తానే కాంగ్రెస్ పార్టీ అంటూ సమధానమిచ్చారు. సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడినట్లయింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఆసన్నమైందంటూ’ విమర్శించారు. -
బెంగాల్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీరామనవమి వేడుకల్లో చోటు చేసుకున్న హింసకు గల కారణాలను తెలుపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. గత వారం శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్, అసన్సోల్ ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. హింస చేలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టాల్సిందింగా ఆ రాష్ట్ర డీజీపీని, ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా అందులో పేర్కొంది. మరోవైపు ఈ ఘర్షణలు... తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేస్తున్నాయి. ర్యాలీల పేరుతో రాముడి పేరును చెడగొడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందిస్తుంది. తాజాగా షాన్వాజ్ హుస్సేన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బీజేపీ బృందం ఆదివారం హింస తలెత్తిన ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ... పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని ఆరోపించారు. -
కాస్గంజ్ అల్లర్లు..: ప్రధాన నిందితుడు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాస్గంజ్లో జరిగిన మతఘర్షణల్లో అభిషేక్ గుప్తా అలియాస్ చందన్ గుప్తా (23) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చందన్ మృతికి కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు జావేద్ సలీంగా గుర్తించారు. అతను, అతని ఇద్దరు సోదరులు వసీం, నసీంలతోపాటు మరో 17మంది ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద హత్య, ఇతర అభియోగాలు పోలీసులు మోపిన సంగతి తెలిసిందే. స్థానిక ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం సలీంను అదుపులోకి తీసుకుందని, ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు కొనసాగుతున్నాయని ఆగ్రా అదనపు డీజీ అజయ్ ఆనంద్ తెలిపారు. కాస్గంజ్లోని కోట్వాలి పోలీసు స్టేషన్లో చందన్ గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. అల్లర్లు జరిగినప్పటి నుంచి సలీం పరారీలో ఉన్నాడు. గత శనివారం అతని ఇంట్లో జరిపిన సోదాల్లో పిస్తోల్, దేశీయ పెట్రో బాంబులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. -
ఎంపీ రూపా గంగూలీని అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: బీజేపీ ఎంపీ రూపా గంగూలీతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు శుక్రవారం కోల్‌కతా విమానాశ్రయం సమీపంలో అడ్డుకున్నారు. పశ్చిమ్‌బంగాలోని బసిర్హత్ ప్రాంతంలో చెలరేగిన మతఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళుతున్న ఎంపీ రూపా గంగూలీతో పాటు ఇతరులను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా బసిరహత్లో పర్యటనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. బసిరహత్ వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే పరిస్థితి సద్దుమణిగే వరకూ అక్కడకు ఏ రాజకీయ నేతలు పర్యటించవద్దని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తమ పార్టీ నేతలు కూడా అక్కడ పర్యటించలేదని తెలిపారు. కాగా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో చెలరేగిన హింస ఆగడం లేదు. బదూరియలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌పై చెలరేగిన వివాదం అంతకంతకూ పెరిగిపోయి రెండువర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. భవనాలపై దాడులకు దిగారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఇరు వర్గాల ఘర్షణలతో బదూరియా రణరంగంగా మారింది. మంగళవారం నాటికి అల్లరు బదురియా, హరోరా, స్వరూప్‌నగర్, దిగంగ ప్రాంతాలకు వ్యాపించాయి. అయితే పుకార్లు వ్యాపించడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా భద్రత బలగాలు భారీగా మోహరించాయి. నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. అటు బదూరియా అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటోంది.