లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాస్‌గంజ్‌లో జరిగిన మతఘర్షణల్లో అభిషేక్ గుప్తా అలియాస్ చందన్ గుప్తా (23) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చందన్ మృతికి కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు జావేద్ సలీంగా గుర్తించారు. అతను, అతని ఇద్దరు సోదరులు వసీం, నసీంలతోపాటు మరో 17మంది ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద హత్య, ఇతర అభియోగాలు పోలీసులు మోపిన సంగతి తెలిసిందే.
స్థానిక ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం సలీంను అదుపులోకి తీసుకుందని, ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు కొనసాగుతున్నాయని ఆగ్రా అదనపు డీజీ అజయ్ ఆనంద్ తెలిపారు. కాస్‌గంజ్‌లోని కోట్వాలి పోలీసు స్టేషన్‌లో చందన్ గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ సైతం నమోదైంది. అల్లర్లు జరిగినప్పటి నుంచి సలీం పరారీలో ఉన్నాడు. గత శనివారం అతని ఇంట్లో జరిపిన సోదాల్లో పిస్తోల్, దేశీయ పెట్రో బాంబులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment