kasganj
-
Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం
కాస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్లోని కస్బా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్‌లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేటి (శనివారం)ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో నిండిన ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో పడింది. అనంతరం అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినవారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులతోపాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. పాటియాలీలోని సీహెచ్‌సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. -
కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్..
లక్నో: ఇద్దరు మహిళా లాయర్లు కోర్టు ఆవరణలోనే రెచ్చిపోయారు. తాము న్యాయవాదులమని మర్చిపోయి సిగపట్లు పట్టారు. జట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు చెంపదెబ్బల వర్షం కురిపించుకున్నారు. వారిని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తర్‌ప్రదేశ్ కాస్గంజ్ కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరకు మహిళా ఎస్సై జోక్యం చేసుకుని ఇద్దరు లాయర్లను ఆపింది. ఆ తర్వాత వారు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరు ఎందుకు అంతలా గొడవపడ్డారనే విషయం మాత్రం తెలియరాలేదు. లాయర్లు అయి ఉండి ఇలా ఫైటింగ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు महिला वकीलों में जमकर मारपीट, एक-दूसरे के खींचे बाल, जमकर बरसाए थप्पड़। वीडियो हुआ वायरल... यूपी के कासगंज से सामने आया मामला pic.twitter.com/vhpZvRdiMP — News24 (@news24tvchannel) October 28, 2022 చదవండి: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్.. -
పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?
లక్నో: పోలీస్ కస్టడీలో ఉన్న ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. నిందితుడి మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా చెబుతుంటే.. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం(నవంబర్9) చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడిని సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్ కుమారుడు చాంద్ మియాన్‌గా గుర్తించారు. వివారల్లోకి వెళితే.. యువతిని తీసుకొని పారిపోయిన కేసులో విచారించేందుకు యువకుడు అల్తఫ్‌ను పోలీసులు సోమవారం ఉదయం కస్గంజ్కు చెందిన సదర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. చదవండి: పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి.. మూడు రోజుల పసికందుని.. పోలీసులు యువకుడిని విచారణ చేస్తున్న క్రమంలో బాత్రుంకు వెళ్లాలని అడిగాడు. బాత్రూమ్ లోపలికి వెళ్లిన అతను లోపల నుంచి లాక్ వేసుకున్నాడు. కాసేపటి తరువాత ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు బాత్రూమ్ తలుపు తెరిచి చూడంతో నిందితుడు తన జాకెట్ హుడ్ను పైప్‌కు కట్టి గొంతు చుట్టూ బిగించుకొని ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు అయిదుగురు పోలీసులను ఎస్పీ రోహన్ సస్పెండ్ చేశారు. వీరిలో కసన్‌గంజ్ స్టేషన్ అధికారి, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. చదవండి: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు కాగా లాకప్‌లో ఉన్న తన కొడుకును పోలీసులే ఉరి తీశారని నిందితుడు అల్తాఫ్ తండ్రి చాహత్ మియా ఆరోపించారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తన కొడుకును పోలీసులు తీసకెళ్లారని. తరువాత 24 గంటలకే అతను ఉరి వేసుకున్నాడని సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు కొడుకును జిల్లా ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అంతేగాక యువకుడి లాకప్ మరణంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. आज दिनाँक 9.11.21 को जनपद के थाना कोतवाली कासगंज में बंदी की मृत्यु होने के संबंध में #SP @kasganjpolice द्वारा लापरवाही बरतने पर 5 पुलिसकर्मियों को निलंबित करने की कार्यवाही की गई है, प्रकरण में की जा रही अन्य कार्यवाही के संबंध में पुलिस अधीक्षक द्वारा दी गयी बाइट । pic.twitter.com/EvMnLA9ozG — KASGANJ POLICE (@kasganjpolice) November 9, 2021 -
ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి..
లక్నో : మానవత్వం మంట కలిసిందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తోటి వ్యక్తి ప్రాణం పోతుంటే కాపాడాల్సింది పోయి అదేమి పట్టించుకోకుండా ఘటనను మొత్తం కెమెరాలో బంధించిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన 69 ఏళ్ల వృద్దురాలిని ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాక్‌లో రేంజ్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతను విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతుంటే చుట్టుపక్కల వాళ్లు చోద్యం చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు. పైగా ఒక వ్యక్తి తన బిల్డింగ్ టెర్రస్ మీదకు ఎక్కి ఈ ఘటనను మొత్తం తన మెబైల్ ఫోన్లో బంధించాడు. ఆ వీడియోలో వృద్దురాలి తలకు పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్ పెట్టి కాల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాక మొదటి తూటాకు ఆమె గాయపడి ఇంట్లోకి పారిపోవడానికి ప్రయత్నించనందుకు మరోసారి కాల్పులు జరపడంతో అక్కడిక్కడే కుప్పకూలింది. ఆమెను కాల్చిన అనంతరం నిందితుడు పారిపోయాకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వృద్దురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం ఫోన్లో ఉన్న వీడియో ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతను పేరు మోను అని, అయితే వృద్దురాలిని ఎందుకు చంపాడన్నది మాత్రం తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నిందితునికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తితో పాటు తోటి వ్యక్తి ప్రాణాలు పోతుంటే కాపాడాల్సింది పోయి వీడియో తీసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. -
బరాత్ కోసం హైకోర్టులో యువకుడి పిటిషన్
లక్నో : బరాత్ అనుమతి కోసం యూపీకి చెందిన ఓ దళిత యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో అతనికి చేదు అనుభవమే ఎదురైంది. స్థానిక పోలీసులను ఆశ్రయించాలంటూ కోర్టు అతనికి సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే... కాస్గంజ్ పరిధిలోని ఓ గ్రామంలో గత నెలరోజులుగా దళిత-అగ్రవర్ణాలకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థాకూర్ పెద్దలు దళితుల వివాహా వేడుకలకు అడ్డుపడుతున్నారు. కాదని వేడుకలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. శీతల్ అనే దళిత యువకుడికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో వివాహం కూడా. అయితే గ్రామంలోనే థాకూర్ పెద్దలు అడ్డుపడుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ప్రయోజనం లేకపోవటంతో చివరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘తమ ఆదేశాలకు దిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థాకూర్ పెద్దలు బెదరిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం.. మీరు ఎవరిని ఆశ్రయించినా వ్యర్థమే. ఎవరూ జోక్యం చేసుకోరు అంటూ చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. బరాత్‌తో నా వివాహం జరుపుకునేందుకు అనుమతి ఇప్పించండి’ అని శీతల్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారంపై సంజయ్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కావాలంటే పొరుగు గ్రామంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. -
ఆధార్ డేటా సురక్షితం
న్యూఢిల్లీ: యూపీ కాస్గంజ్లో మతఘర్షణలు, ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలతో శుక్రవారం ఉదయం కొంతసేపు రాజ్యసభ వాయిదా పడింది. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ఎస్పీ, ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను ఉదయం కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం ఆధార్ డేటా లీకేజీ వార్త అవాస్తవమని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ రాజ్యసభలో స్పష్టంచేశారు. ఏ వ్యక్తికి సంబంధించిన ఆధార్ సమాచారమైనా ఎవరైనా రూ.500కే కొనుక్కోవచ్చంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన వివాదాస్పద గో సంరక్షణ బిల్లును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే సామర్ధ్యం న్యాయవ్యవస్థకు ఉందని న్యాయశాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. రైలు ప్రయాణికుల సంఖ్యతోపాటు ఆదాయాన్ని పెంచే ఫ్లెక్సి–చార్జీల విధానం అమలు చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. -
కాస్గంజ్ అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో జరిగిన చందన్ గుప్తా హత్యకేసులో ప్రధాన నిందితుడు సలీమ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతవారం మత ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాస్గంజ్ మత ఘర్షణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు పూర్తిస్థాయి నివేదికను అందజేసింది. ఈ ఘర్షణలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని ఆ నివేదికలో పేర్కొంది. సలీమ్‌తోపాటు అతని సోదరులు నసీమ్, వసీమ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
కాస్గంజ్ అల్లర్లు..: ప్రధాన నిందితుడు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాస్గంజ్లో జరిగిన మతఘర్షణల్లో అభిషేక్ గుప్తా అలియాస్ చందన్ గుప్తా (23) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చందన్ మృతికి కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు జావేద్ సలీంగా గుర్తించారు. అతను, అతని ఇద్దరు సోదరులు వసీం, నసీంలతోపాటు మరో 17మంది ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద హత్య, ఇతర అభియోగాలు పోలీసులు మోపిన సంగతి తెలిసిందే. స్థానిక ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం సలీంను అదుపులోకి తీసుకుందని, ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు కొనసాగుతున్నాయని ఆగ్రా అదనపు డీజీ అజయ్ ఆనంద్ తెలిపారు. కాస్గంజ్లోని కోట్వాలి పోలీసు స్టేషన్లో చందన్ గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. అల్లర్లు జరిగినప్పటి నుంచి సలీం పరారీలో ఉన్నాడు. గత శనివారం అతని ఇంట్లో జరిపిన సోదాల్లో పిస్తోల్, దేశీయ పెట్రో బాంబులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. -
యూపీలో మళ్లీ ఘర్షణలు.. సీఎం యోగి ఘాటు వార్నింగ్!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో మతఘర్షణలకు సంబంధించిన ఉద్రిక్తతలు చల్లారముందే అమేథిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. అయితే, ఇవి మతఘర్షణలు కాదని, కుటుంబ వైరం వల్లే రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఇక, ఒకరి ప్రాణాలు బలితీసుకున్న కాస్గంజ్ మతఘర్షణలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘ప్రతి ఒక్క పౌరునికి భద్రత కల్పించేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. అరాచకాలకు దిగే వాళ్లను సహించే ప్రసక్తే లేదు. హింసకు బాధ్యులైన వాళ్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు కాస్గంజ్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక కోరింది. -
నేను బతికే ఉన్నాను.. మహాప్రభో..!
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో మతఘర్షణలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం.. రాహుల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి మృతి చెందాడని వదంతులు చెలరేగడమే.. నిజానికి రాహుల్ ఉపాధ్యాయ్ మరణించలేదు. ఆ విషయాన్ని పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. మంగళవారం రాహుల్ ఉపాధ్యాయ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. తాను చనిపోలేదని స్పష్టత ఇచ్చాడు. ‘కాస్గంజ్ అల్లర్లలో నేను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వదంతులు చెలరేగుతున్నట్టు నా స్నేహితుడు ఒకరు తెలిపారు. కానీ, అల్లర్లు జరిగిన సమయంలో నేను కాస్గంజ్లో లేను. నేను ఊరికి వెళ్లాను. నేను బాగున్నాను’ అని రాహుల్ వివరించాడు. రాహుల్ మృతి చెందాడని వదంతులు వ్యాప్తి చేస్తూ.. మతఘర్షణలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు అలీగఢ్ రేంజ్ ఐజీ సంజీవ్ గుప్తా తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో చందన్ గుప్తాతోపాటు రాహుల్ ఉపాధ్యాయ్ కూడా చనిపోయాడని తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. రాహుల్ మృతి చెందాడన్న వదంతులను నమ్మిన మూక.. గత మూడురోజులుగా హింసకు దిగుతోంది. గణతంత్ర దినోత్సవం నాడు చేపట్టిన ‘తిరంగ యాత్ర’ ఉద్రిక్తతలకు దారితీసి.. ఒకరి మృతికి, ఇద్దరు గాయపడటానికి కారణమైంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 51మందిపై అభియోగాలు నమోదుచేశారు. -
యోగి సర్కారు.. గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో జరిగిన మతఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ తీవ్రంగా స్పందించారు. ఈ అల్లర్లు రాష్ట్ర ప్రతిష్టకు మచ్చలాంటివని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మతఘర్షణలు సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిది, పది నెలల్లో మతఘర్షణలు జరగడం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన కాస్గంజ్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. అదుపులోనే ఉంది. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ వర్గం బైకు ర్యాలీ నిర్వహించగా.. మరో వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. -
కాస్గంజ్లో తీవ్ర ఉద్రిక్తత
-
ఆ సీటు గెలిస్తే.. యూపీలో గెలిచినట్లే!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?. బీజేపీ, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గెలుపు కోసం హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కీలకపాత్ర పోషించేది అక్కడి కుల రాజకీయాలే. 1974 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఓ అసెంబ్లీ స్ధానం అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వస్తోంది. అదే కస్‌ఘంజ్. ఈ స్ధానంలో పోటీ చేసి గెలిచిన పార్టీ.. 1974 నుంచి రాష్ట్రంలోనూ అధికారాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కస్‌ఘంజ్ నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్ధి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అగ్రకులాలు బీజేపీకి దన్నుగా నిలుస్తూ వస్తున్నాయి. 1990ల్లో అగ్రవర్ణాలు, బీసీల మధ్య సయోధ్య కుదర్చలేక ఉత్తరప్రదేశ్‌లో చతికిలపడిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను బీసీలకు కేటాయించింది. దీంతో అగ్రవర్ణాల్లో కొంతవరకూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కస్‌ఘంజ్‌లో ఓటర్లను ప్రశ్నించిన విశ్లేషకులకు విభిన్న అభిప్రాయాలు దృష్టికి వచ్చాయి. కస్‌ఘంజ్‌లో 20 శాతం మంది వ్యాపారులు ఉన్నారు. వీరందరూ నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. వారిలో రగులుతున్న వ్యతిరేకత తెలిసి కూడా అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధికి కస్‌ఘంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బీజేపీ అవకాశం ఇవ్వలేదు. బీజేపీకి ఓట్లు వేస్తారా? అని ఓ పత్రికా రిపోర్టర్ అక్కడి అగ్రకులాలకు చెందిన వారిని ప్రశ్నించగా వారు "చూద్దాం" అని వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫును ఓ బీసీ అభ్యర్థి కస్‌ఘంజ్‌లో బరిలోకి దిగుతున్నారు. మరి అగ్రకులాలకు చెందిన వారు బీజేపీకి దన్నుగా నిలుస్తారా? లేదా ఎస్సీ, బీఎస్సీల తరఫున బరిలో ఉన్న అగ్రకులాలకు చెందిన అభ్యర్ధులకు పట్టం కడతారా అనేదే తేలాల్సివుంది.