ప్రధాన నిందితుడు సలీమ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో జరిగిన చందన్ గుప్తా హత్యకేసులో ప్రధాన నిందితుడు సలీమ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతవారం మత ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాస్‌గంజ్ మత ఘర్షణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు పూర్తిస్థాయి నివేదికను అందజేసింది. ఈ ఘర్షణలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని ఆ నివేదికలో పేర్కొంది. సలీమ్‌తోపాటు అతని సోదరులు నసీమ్, వసీమ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment