main suspect
-
టాపర్ స్కాం నిందితుడి ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బిహార్ టాపర్’ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. విష్ణురాయ్ కాలేజీ నిర్వాహకుడు బచ్చారాయ్కి చెందిన రూ.4.53 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. సీబీఎస్ఈ ఆర్ట్స్ విభాగంలో అప్పటి బిహార్ రాష్ట్ర టాపర్‌గా నిలిచిన రూబీరాయ్ వైశాలిలోని బచ్చారాయ్ కళాశాలలోనే చదువుకుంది. ఈమెకు ‘పొలిటికల్ సైన్స్’ అంటే కూడా తెలీదని మీడియా ద్వారా వెల్లడి కావటంతో ప్రభుత్వం విచారణచేపట్టింది. దీంతో సీబీఎస్ఈ పరీక్షల్లో భారీ అవకతవకలతోపాటు 10,12వ తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి 8 మందిపై పోలీసులు కేసువేశారు. వీరిలో విష్ణు రాయ్ కాలేజి నిర్వాహకుడు బచ్చా రాయ్ అలియాస్ అమిత్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దీంతో ఈడీ బచ్చా రాయ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బచ్చా, అతని కుటుంబసభ్యుల పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న 31 ప్లాట్లను సీజ్ చేయంతోపాటు 10 బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసింది. -
కాస్గంజ్ అల్లర్ల ప్రధాన నిందితుడి అరెస్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో జరిగిన చందన్ గుప్తా హత్యకేసులో ప్రధాన నిందితుడు సలీమ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతవారం మత ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాస్గంజ్ మత ఘర్షణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు పూర్తిస్థాయి నివేదికను అందజేసింది. ఈ ఘర్షణలు ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని ఆ నివేదికలో పేర్కొంది. సలీమ్‌తోపాటు అతని సోదరులు నసీమ్, వసీమ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. -
బ్యాంకాక్ పేలుళ్ల ప్రధాన నిందితుడి అరెస్టు
సంచలనం సృష్టించిన బ్యాంకాక్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుణ్ని బ్యాంకాక్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బన్ పా రాయ్ సరిహద్దు గుండా బర్మా(మయన్మార్)లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని మంగళవారం ఉదయం సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తసుకుని పోలీసులకు అప్పగించాయని, విదేశీయుడైన అతడే పేలుళ్ల ప్రధాన నిందితుడని థాయిలాండ్ ప్రధానమంద్రి ప్రయుత్ ఛానో ఛా మీడియాకు వెల్లడించారు. అయితే నిందితుడి పేరు సహా ఇతర వివరాలేవీ వెల్లడించకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. నిందితుడు విదేశీయుడైనందున సమగ్ర దర్యాప్తు తర్వాతే అతడిది ఏదేశం? అతని వెనుక ఎవరున్నారు? తదితర విషయాలు వెల్లడిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఆగస్టు 17 బ్యాంకాక్ లోని పర్యాటక క్షేత్రమైన బ్రహ్మదేవాలయం వద్ద సంభవించిన శక్తిమంతమైన బాంబు పేలుళ్లలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఈ రోజు ప్రధాన నిందితుడు అరెస్టయ్యాడు.