రూబీరాయ్ వైశాలి, బచ్చా రాయ్
న్యూఢిల్లీ: 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బిహార్ టాపర్’ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. విష్ణురాయ్ కాలేజీ నిర్వాహకుడు బచ్చారాయ్‌కి చెందిన రూ.4.53 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. సీబీఎస్‌ఈ ఆర్ట్స్ విభాగంలో అప్పటి బిహార్ రాష్ట్ర టాపర్‌గా నిలిచిన రూబీరాయ్ వైశాలిలోని బచ్చారాయ్ కళాశాలలోనే చదువుకుంది. ఈమెకు ‘పొలిటికల్ సైన్స్’ అంటే కూడా తెలీదని మీడియా ద్వారా వెల్లడి కావటంతో ప్రభుత్వం విచారణచేపట్టింది.
దీంతో సీబీఎస్‌ఈ పరీక్షల్లో భారీ అవకతవకలతోపాటు 10,12వ తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి 8 మందిపై పోలీసులు కేసువేశారు. వీరిలో విష్ణు రాయ్ కాలేజి నిర్వాహకుడు బచ్చా రాయ్ అలియాస్ అమిత్‌కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దీంతో ఈడీ బచ్చా రాయ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బచ్చా, అతని కుటుంబసభ్యుల పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న 31 ప్లాట్లను సీజ్ చేయంతోపాటు 10 బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసింది.
Comments
Please login to add a commentAdd a comment