Land For Job Scam: ఛార్జిషీట్‌లో రబ్రి దేవి, మిసా భారతి పేర్లు | Rabri Devi, Misa Bharti And Others Named In ED Chargesheet In Land For Job Scam, See More Details Inside - Sakshi
Sakshi News home page

Land For Job Scam: ఛార్జిషీట్‌లో రబ్రి దేవి, మిసా భారతి పేర్లు

Published Tue, Jan 9 2024 12:58 PM | Last Updated on Tue, Jan 9 2024 1:57 PM

Rabri Devi Misa Bharti Others In ED Chargesheet In Land For Job Scam - Sakshi

ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతీతో సహా తదితరుల పేర్లను చార్జిషీట్‌లో పేర్కొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్ కత్యాల్, మరికొందరు వ్యక్తులు, కంపెనీల పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈరోజు తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. 

ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎమ్‌ఎల్‌ఎ) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. జనవరి 16న విచారణకు కోర్టు జాబితా చేసిందని సమాచారం. ఈ కేసులో కత్యాల్‌ను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది.

యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించినది ఈ కుంభకోణం. 2004 నుండి 2009 వరకు, భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మంది గ్రూప్ "డి" స్థానాల్లో అక్రమంగా నియమించబడ్డారు. బదులుగా ఆ అభ్యర్థులు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది. 

ఇదీ చదవండి: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement