Female Lawyers Get Into Ugly Fight In Uttar Pradesh, Video Viral - Sakshi
Sakshi News home page

వామ్మో ఈ ఫైటింగ్ ఏంది..? కోర్టులోనే రెచ్చిపోయిన మహిళా లాయర్లు.. జుట్లు పట్టుకొని..

Published Sat, Oct 29 2022 11:52 AM | Last Updated on Sat, Oct 29 2022 3:03 PM

Female Lawyers Ugly Fight Uttar Pradesh Kasganj Viral Video - Sakshi

లక్నో: ఇద్దరు మహిళా లాయర్లు కోర్టు ఆవరణలోనే రెచ్చిపోయారు. తాము న్యాయవాదులమని మర్చిపోయి సిగపట్లు పట్టారు. జట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు చెంపదెబ్బల వర్షం కురిపించుకున్నారు. వారిని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తర్‌ప్రదేశ్ కాస్‌గంజ్ కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చివరకు మహిళా ఎస్సై జోక్యం చేసుకుని ఇద్దరు లాయర్లను ఆపింది. ఆ తర్వాత వారు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరు ఎందుకు అంతలా గొడవపడ్డారనే విషయం మాత్రం తెలియరాలేదు. లాయర్లు అయి ఉండి ఇలా ఫైటింగ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు

చదవండి: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement