Prime accused
-
వీడు మామూలోడు కాదు.. విచారించాలంటూ పోలీసులకే లేఖ
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తు సందర్భంగా నిందితులతో పాటు అనుమానితులకూ నోటీసులు ఇస్తుంటారు. అయితే సిటీ సైబర్ క్రైం పోలీసులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. రూ.60 లక్షల మోసం కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ వాసి ‘నన్ను పిలవండి.. విచారించండి’అంటూ లేఖ రాశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ట్రేడింగ్ పేరిట రూ.5 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఫోన్ చేసి తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పారు. అది బదిలీ చేయాలంటే ముందుగా బ్రోకరేజ్ చెల్లించాలని షరతు విధించారు. దీంతో దాదాపు రూ.60 లక్షలు బ్యాంకు ఖాతా ల్లోకి ఆ మహిళ బదిలీ చేశారు. తర్వాత వారి నుంచి స్పందన లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజత్ పటారియాను ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావించారు. తప్పుడు ధ్రువీకరణలతో సిమ్ వినియోగించడంతో చిరుమానా పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చందన్నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో రజత్ ఉంటాడని తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. ఇటీవల ఓ పని కోసం చందన్నగర్ ఠాణాకు వెళ్లిన రజత్‌కు పలానా కేసులో అనుమానితుడిగా ఉన్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. దీంతో సైబర్ క్రైం పోలీసులకు పోస్టు ద్వారా లేఖ పంపాడు. తనకు నోటీసులిస్తే వస్తానంటూ అందులో పేర్కొన్నాడు. -
కాస్గంజ్ అల్లర్లు..: ప్రధాన నిందితుడు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాస్గంజ్లో జరిగిన మతఘర్షణల్లో అభిషేక్ గుప్తా అలియాస్ చందన్ గుప్తా (23) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చందన్ మృతికి కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు జావేద్ సలీంగా గుర్తించారు. అతను, అతని ఇద్దరు సోదరులు వసీం, నసీంలతోపాటు మరో 17మంది ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద హత్య, ఇతర అభియోగాలు పోలీసులు మోపిన సంగతి తెలిసిందే. స్థానిక ప్రత్యేక పోలీసుల బృందం బుధవారం సలీంను అదుపులోకి తీసుకుందని, ఇతర నిందితులను పట్టుకునేందుకు గాలింపులు కొనసాగుతున్నాయని ఆగ్రా అదనపు డీజీ అజయ్ ఆనంద్ తెలిపారు. కాస్గంజ్లోని కోట్వాలి పోలీసు స్టేషన్లో చందన్ గుప్తా తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. అల్లర్లు జరిగినప్పటి నుంచి సలీం పరారీలో ఉన్నాడు. గత శనివారం అతని ఇంట్లో జరిపిన సోదాల్లో పిస్తోల్, దేశీయ పెట్రో బాంబులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. -
కోల్‌కతా కేసులో ప్రధాన రేపిస్టు దొరికాడు
కోల్‌కతా: నాలుగేళ్ల కిందట ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన గ్యాంగ్‌లోని కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ జిల్లాలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడితోపాటు అలీ అనే మరో నేరస్తుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2012 ఫిబ్రవరి 6న ఓ ఆంగ్లో-ఇండియన్ మహిళకు తుపాకీ గురిపెట్టి కోల్ కతాలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాదర్ ఖాన్ అనే వ్యక్తి కీలక నిందితుడు. మిగితావారు దొరికినప్పటికీ ఇతడు మాత్రం తప్పించుకోని తిరుగుతూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. -
మథుర ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
బస్తీ: మథుర ఘర్షణల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని పరశురాంపుర ప్రాంతంలోని ఓ గ్రామంలో బుధవారం అరెస్టు చేశారు. చందన్ బోస్, అతని భార్యను కైత్ వాలియా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున మథుర పోలీసుల టీమ్ అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్ సింగ్ తెలిపారు. మథుర ఘర్షణలకు కారణమైన ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి కు అధ్యక్షుడిగా పనిచేసిన రామ్ వృక్ష్ యాదవ్ కు బోస్ ప్రధాన అనుచరుడు. కాగా, యాదవ్ మథుర గొడవల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ దల్జీత్ సింగ్ రామ్ వృక్ష్ యాదవ్, చందన్ బోస్, గిరీశ్ యాదవ్, రాకేశ్ గుప్తాలను కేసులో నేరస్తులుగా ప్రకటించిన విషయం విదితమే. జూన్ 2న మథురలోని జవహార్ బాగ్ వద్ద జరిగిన ఈ ఘర్షణలో మథుర ఎస్పీ, స్టేషన్ హోస్ ఆఫీసర్ లతో పాటు మొత్తం 29 మంది మరణించారు.