ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు.
బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.
‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment