communal clashes
-
మళ్లీ రాజుకుంటున్న మణిపూర్
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న ఘర్షణలను నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. డీజీపీ, భద్రతా సలహాదారును తొలగించాలంటూ గవర్నర్ నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టించేందుకు వారంతా మంగళవారం విఫలయత్నం చేశారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైకి రాళ్లు తదితరాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.దాంతో లోయలోని ఐదు సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని తొలుత పేర్కొన్నా, అనంతరం దాన్ని ఐదు జిల్లాలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాజధాని ఇంఫాల్‌తో పాటు పరిసర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభు త్వం పేర్కొంది. మరో 2,000 మందికి పైగా సీఆరీ్పఎఫ్ సిబ్బందిని కేంద్రం మణిపూర్‌కు తరలించింది. మణిపూర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల డ్రోన్, రాకెట్ దాడులు జరిగినట్టు వార్తలొచ్చా యి. అవి వాస్తవమేనని ఐజీ కె.జయంతసింగ్ తెలిపారు. డ్రోన్లతో పాటు అధునాతన రాకెట్ల తాలూకు విడి భాగాలను పౌర ఆవాస ప్రాంతాల్లో తాజాగా స్వా«దీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అంతకుమించి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తౌబల్ ప్రాంతంలో నిరసనకారుల నుంచి దూసుకొచి్చన తూటా ఓ పోలీసును గాయపరిచినట్టు చెప్పారు. -
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్‌కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
చండీగఢ్: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్ ఇంటర్నెట్తోపాటు ఎస్ఎంఎస్ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్ కపూర్ చెప్పారు. -
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్‌ఎస్‌వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి
హర్యానాలోని నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్ జిల్లా అడిషనల్ చీఫ్ జస్టిస్ అంజలి జైన్.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్ సియారమ్తో కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు. చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు. దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం
గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా అట్టడుకుతోంది. నూహ్ జిల్లాల్లో చెలరేగిన హింసతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్‌లలో 144 సెక్షన్ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్‌లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. బజరంగ్ దళ్ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. Hamein kuch nahin chahiye... Bas Delhi tak chor do... #Muslim slum-dwellers in #Gurugram after their men were beaten by drunk goons reportedly from #BajrangDal for being Muslim. #NuhConspiracy pic.twitter.com/ST3baTlsyf — Ankita Anand (@ankita_das_) August 2, 2023 ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి గురుగ్రామ్‌లో నివసిస్తున్న 100 ముస్లిం కుటుంబాల్లో.. ప్రస్తుతం తాము 11 మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఓ ముస్లిం వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్ల కారణంగా తాము ఎక్కడికి పోలేని పరిస్థితి తలెత్తిందని, సొంత ఊరు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చులు కూడా లేవని కన్నీటి పర్యంతమయ్యాడు 25 ఏళ్ల షమీమ్ హుస్సేన్... చదవండి: Haryana communal violence: బలగాల్ని దింపండి #GuruGramViolence: Muslim owned shops looted & vandalised! Shanties of poor Muslims burnt! Spillover of #NuhViolence was seen in Gurgaon! Fires were reported from 3 locations! Meat shops & Muslim hotels were ransacked & vandalised! Muslims have been threatened to leave Gurugram! pic.twitter.com/H717JUn8pg — Muslim Spaces (@MuslimSpaces) August 2, 2023 ఆయన మాట్లాడుతూ.. ‘గత సాయంత్రం కొంతమంది గుంపు వచ్చి, రెండు రోజుల్లో ఇక్కడున్న ముస్లింలందరూ ఖాళీ చేయాలని బెదిరించారు. రోడ్డు మీదకు వెళ్తే పేరు అడిగి కొడుతున్నారు. తిరిగి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అప్పు చెల్లించాల్సి ఉంది. నాకేం జరిగినా పర్లేదు. కానీ నాకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. మామల్ని కాపాల్సిందిగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని ఆర్థిస్తున్నానంటూచేతులు జోడించి వేడుకున్నాడు. మా కుటుంబం జీవనోపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చి కేవలం ఏడు రోజులు మాత్రమే అయ్యింది. రెండు రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఉద్యోగం దొరకగా.. ఇంకా జీతం ఇవ్వలేదు. నా ఏడాది వయస్సున కొడుకు పేరు అలీషాన్. అల్లరి మూకలు వచ్చి నన్ను, నాభార్యను కొడతారని భయమేస్తోంది. ఇది తలుచుకొని భయపడి నా భార్య రెండు రోజులుగా ఏడుస్తోంది. సొంత ఊరిలోనూ ఉపాధి లేకపోవడంతో తిరిగి వెళ్లలేం.. ఇక్కడా ఉండలేకపోతున్నాం.. ఎలా బతకాలి’ ’ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ వాపోయాడు. చదవండి: మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్ #MuslimsUnderAttack Is it a crime to do journalism in Gurugram Gurugram: In Sector 70, 200 Muslim families have fled fearing threats and assault by local Bajrang Dal workers. I was threatened twice when I was reporting there. my religion was asked,and the camera was turned off pic.twitter.com/LRZ2FEFZYN — Tarique Anwar (@imtariqueanwar) August 2, 2023 దీనిపై గురుగ్రామ్ జిల్లా కమిషనర్ స్పందిస్తూ.. స్థానిక వలస కార్మికులను ఖాళీ చేయమని బెదిరించినట్లు వార్తలు అందాయని, జిల్లా, పోలీసు అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వలస కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సున్నిత ప్రాంతాలు, ఇరు వర్గాల మతపరమైన ప్రదేశాలైన మసీదులు, దేవాలయాల చుట్టూ రాత్రిపూట మోహరింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రేపటి వరకు నగరంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. -
Haryana communal violence: బలగాల్ని దింపండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని హరియాణాలో మత ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హరియాణాలో మత ఘర్షణలకు నిరసనగా వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీల సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది. నూహ్ జిల్లాలో జలై 31వ తేదీన వీహెచ్‌పీ ర్యాలీని అడ్డుకునేందుకు వేరే వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు జరక్కుండా కట్టడిచేయాలని పాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, సంబంధిత సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను భద్రపరచాలని ఆదేశించింది. ‘ ఢిల్లీని ఆనుకుని ఉన్న హరియాణా, యూపీ ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగొచ్చు. అవసరమైతే అదనపు పోలీసు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపండి. ఎలాంటి ఆస్తి నష్టం, హింస జరగకుండా చూడండి. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేష ప్రసంగాలు జరక్కుండా అడ్డుకట్టవేయండి’ అని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పాలనాయంత్రాగాలకు త్వరగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ‘విద్వేష ప్రసంగాలు చేసినపుడు ఫిర్యాదు కోసం వేచిచూడకుండా వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడూ యథాతథంగా అమలుచేయండి’ అని కోర్టు గుర్తుచేసింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం యంత్రాంగాలతో సంప్రదించాలని కేంద్రానికి సూచించింది. పలుచోట్ల ర్యాలీలు ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో 23 భారీ ర్యాలీలు చేపడతామన్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్ పిలుపుమేరకు బుధవారం ఢిల్లీలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్దళ్ శ్రేణులు హనుమాన్ చాలీసా పఠించారు. వికాస్‌మార్గ్ ప్రాంతం ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. 116 అరెస్టులు: ఖట్టర్ రాష్ట్రంలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 41 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి 116 మందిని అరెస్ట్చేశామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందన్నారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హరియణా సర్కార్ ఏర్పాటుచేసేపనిలో ఉంది. -
Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంగళవారం కూడా ఘర్షణ వాతావరణం అలాగే ఉండటంతో కర్ఫ్యూ విధించినట్లు హెం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అల్లర్లను అరికట్టే విధంగా పోలీసు బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. 20 మందిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సోమవారం వెల్లడించారు. #WATCH | On Nuh incident, Haryana CM ML Khattar says "This is an unfortunate incident. A Yatra was being organised during which some people conspired an attack Yatris and police. Violent incidents were reported at several places. There seems to be a big conspiracy behind this.… pic.twitter.com/zK0VY2h3cL — ANI (@ANI) August 1, 2023 రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. అలాగే ఈ రోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక వీడియో దీనంతటికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. #WATCH | Jaipur: Police use water canon on BJP workers protesting against the Ashok Gehlot-led Government over the alleged corruption, atrocities against women, crumbling law and order and unemployment under CM Ashok Gehlot-led administration. pic.twitter.com/TYhFYV71zd — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2023 హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. హర్యానాలో భగ్గుమన్న ఘర్షణలు.. శోభాయాత్రతో మొదలు.. రాళ్లు రువ్వుకుంటూ.. -
ప్రధాని పర్యటన వేళ.. గుజరాత్లో మతఘర్షణల అలజడి!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ శనివారం ముందుగా పర్యటించాల్సి ఉంది. భుజ్ మాదాపూర్‌లో శుక్రవారం సాయంత్రం స్థానిక పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో దుకాణాలతో పాటు ఓ మసీదును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు ప్రధాని మోదీ పర్యటిస్తారు. 2001 భూకంప సమయంలో మరణించిన బాధితులకు నివాళిగా, ఆ సమయంలో ప్రజలు కనబర్చిన మనోధైర్యానికి గుర్తుగా భుజ్‌లో 470 ఎకరాల్లో ‘స్మృతి వన్’ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే సబర్మతి తీరం వద్ద ఖాదీ ఉత్సవ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి.. ప్రసంగిస్తారు. ఇక ఆదివారం గాంధీనగర్‌లో సుజుకీ కంపెనీ 40 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడే రూ.7,300 కోట్లతో సుజుకీ సంస్థ చేపడుతున్న ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రధాని పర్యటన షెడ్యూల్ ప్రకటించింది. ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్ కోసం మోదీ కన్నీరు -
ప్రయాగ్‌రాజ్ అల్లర్లు: బుల్డోజర్లను దించేసిన యోగి
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బుల్డోజర్లు రంకెలేశాయి. తాజా ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు అక్కడి అధికారులు. నూపుర్ కామెంట్లకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కాస్త హింసకు దారి తీశాయి. ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు సంబంధించిన కేసులో మాస్టర్ మైండ్‌గా జావేద్ అహ్మద్ ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేవేతకు దిగింది. లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. తాజా సహ్రాన్‌పూర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఇళ్లను ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారులు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం ప్రయాగ్ రాజ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా జావెద్ అహ్మద్ ఉన్నాడు. తాజాగా అతని ఇంటిని కూల్చేశారు ప్రయాగ్ రాజ్ అధికారులు. కరెయిలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. అయినా భారీ బందోబస్తు మధ్య నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు. ఇదిలా ఉంటే.. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమకారుడైన జావేద్ అహ్మద్.. అక్రమంగా ఆ ఇంటిని నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు కూడా జారీ చేసింది. దాన్నొక అక్రమ భవనంగా ప్రకటిస్తూ.. మే 25న పీడీఏ జావేద్ అహ్మద్‌కు ఓ కాపీ కూడా పంపింది. తాజాగా రెండోసారి నోటీసులు పంపించారు. శనివారం ఉదయం 11 గంటలలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. లేకుంటే కూల్చివేత తప్పదని నోటీసులో పేర్కొన్నారు. అయినా జావేద్ భార్య, పిల్లలు ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. మొదట సామాగ్రిని బయటకు తెచ్చారు. తర్వాత బుల్డోజర్ తో ఇంటిని నేలమట్టం చేశారు. తమ తండ్రిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఇప్పుడు ఇంటిని కూల్చేశారని జావేద్ కూతురు అఫ్రీన్ ఫాతిమా ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. యూపీలో అల్లర్లకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని గతంలోనే సీఎం యోగీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది. నిందితుల ఇళ్లను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రయాగ్ రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 306 మందిని పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34, సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్ చేశారు. #WATCH | Uttar Pradesh: Demolition drive at the "illegally constructed" residence of Prayagraj violence accused Javed Ahmed continues in Prayagraj. pic.twitter.com/s4etc8Vz25 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 Lucknow, UP | 306 people arrested related to incidents of June 10. 13 injured cops are getting treatment. The situation is normal across the state. Social media is being monitored as well: Prashant Kumar, ADG, Law&Order, UP Police pic.twitter.com/oc4ZThhLjz — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. నూపుర్ శర్మతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆదివారం వెల్లడించింది. నవీన్ కుమార్ జిందాల్ ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్‌గా ఉన్నారు. సస్పెన్షన్ లెటర్లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామం’ అని బీజేపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ముస్లిం వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొవడలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే పోలీసులపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికంగా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. చదవండి: డబ్బులు వృధా చేసుకోవద్దు. మా వద్ద లేనిది ఈడీ మాత్రమే: సంజయ్ రౌత్ ఇదిలా ఉండగా.. వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలలోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్‌లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్‌గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. అయితే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు నూపుర్ శర్మపై హైదరాబాద్, పూణె, ముంబైలలో కేసులు నమోదయ్యాయి. అన్ని మతాలను గౌరవిస్తాం అయితే నూపుర్ శర్మపై సస్పెన్షన్ వేటుకు కొద్దిసేపటి ముందే బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఒక మతాన్ని, వర్గ మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలకు పార్టీ అంగీకరించదని అన్నారు. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందనని, ఎవరైనా మతపరంగా మనోభావాలను దెబ్బతీస్తే, మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. -
జోద్‌పూర్‌లో ఉద్రిక్తతలు.. ఇంటర్నెట్ సేవలు బంద్
జోథ్‌పూర్/జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంగళవారం ఉదయం ఈద్గా వద్ద ప్రార్థనల తర్వాత జలోరి గేట్ ఏరియాలో దుకాణాలు, వాహనాలు, నివాసాలే లక్ష్యంగా మళ్లీ రాళ్ల వాన కురిసింది. దాంతో లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం జరిగాయి. ముగ్గురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ముందు జాగ్రత్తగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం అర్ధరాత్రి దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉద్రిక్తతలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గహ్లోత్ ఆదేశించారు. ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి రాజేంద్ర యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ విమర్శించింది. ఈ గొడవల్లో ఒకరు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడని, దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయజూశారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. చదవండి: (Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్) -
మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం
లక్నో: ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. అంతేగాక ప్రార్ధనా ప్రాంగణం నుంచి శబ్ధం బయటకు రాకూడదని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు. ఆజాన్ సమయంలో 15 నిమిషాలు ముందు, తరువాత లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసా, భజనలు ప్లే చేయరాదని నాసిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక మహారాష్ట్రలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు మే 3లోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్ కీలక నిర్ణయం కాగా ఇప్పటికే యోగి సర్కార్ మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై యూపీలో మత పరమైన ర్యాలీలకు పోలీసులకు అఫిడవిట్‌ను సమర్పించాలని సీఎం తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదని పేర్కొన్నారు. సాంప్రదాయ మతపరమైన ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిపారు. -
జహంగీర్‌పురి కూల్చివేతలు.. సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జహంగీర్‌పురి కూల్చివేతలపై 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) అమలు చేయాలని ధర్మాసనం వెల్లడించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎమ్) మేయర్ కూల్చివేతలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల అనంతరానికి వాయిదా వేసింది.అయితే దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే విధించాలన్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సంబంధిత వార్త: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కాగా గత శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన ఢిల్లీలోని జహంగీర్‌పురి పరిసరాల్లో కూల్చివేతలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రహించారు. బుల్డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత వార్త: Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే.. -
మత ఘర్షణలకు.. కూల్చివేతకు సంబంధమే లేదు!
ఢిల్లీ: జహంగీర్‌పురి కూల్చివేత ఉద్రిక్తతలపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పందించారు. తాజాగా జరిగిన మత ఘర్షణలకు, ఇవాళ(బుధవారం) చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు. కోర్టు ఆదేశించినా.. రెండు గంటలపాటు కూల్చివేతలు కొనసాగించడంపై ఆయన్ని మీడియా ప్రశ్నించింది. న్యాయవ్యవస్థపై తమకు వంద శాతం గౌరవం ఉందని, తామేమీ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని వెల్లడించారాయన. అయితే కోర్టు ఆదేశాల కాపీ అందలేదు కాబట్టే తమ చర్యలు కొనసాగించామని, అందాక పనుల్ని వెంటనే ఆపేశామని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. కేవలం ఆ ఏరియా మాత్రమే కాదు.. ఢిల్లీ మొత్తానికి మేం అక్రమ కట్టడాల విషయంలో హెచ్చరికలు జారీ చేయాలనుకుంటున్నాం. దయచేసి మీ అంతట మీరే తొలగించాలని, ఒకవేళ తొలగించకపోతే తరువాతి వంతు మీదే వస్తుందని ఎప్పుడో చెప్పామని మేయర్ గుర్తుచేశారు. పైగా ఇవాళ తొలగించిన వాటిలో తాత్కాలికమైన దుకాణాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారాయన.‘‘ప్రజల మద్దతుతోనే ఈ కూల్చివేతలు సాగాయి. రోడ్లు ఇప్పుడు క్లియర్ అయ్యాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది రోటీన్ చర్యలో భాగమే. దీనివెనుక ఎలాంటి ఎజెండా లేదు అని ప్రకటించారాయన. సంబంధిత వార్త: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలు అందలేదని.. తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది. "The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit — NDTV (@ndtv) April 20, 2022 స్పందించిన సీజే.. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది. -
జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జహంగీర్‌పురిలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రçహించారు. బుల్డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అవి తమకందలేదంటూ అధికారులు గంటన్నర పాటు కూల్చివేతలు కొనసాగించారు. దాంతో పిటిషనర్ మళ్లీ సుప్రీం తలుపు తట్టడంతో కూల్చివేతలు ఆగాయి. విచారణ గురువారానికి వాయిదా పడింది. అన్ని పిటిషన్లపై నేడు విచారణ కూల్చివేతలు రాజ్యాంగవిరుద్ధంగా, అనధికారికంగా జరుగుతున్నాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిసి మధ్యాహ్నాం ప్రారంభించాల్సిన కూల్చివేతలను ఉదయం 9 గంటలకే అధికారులు మొదలుపెట్టారని ఆరోపించారు. నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూల్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై అన్ని పిటిషన్లను గురువారం విచారించాలని కోరగా జస్టిస్ రమణ అంగీకరించారు. సుప్రీం ఉత్తర్వులను తీసుకొని సీపీఎం సీనియర్ నేత బృందా కారత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. విలువల విధ్వంసం: రాహుల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో హింస జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వాలు బల్డోజర్లు వాడటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విలువల విధ్వంసమేనని మండిపడ్డారు. పేదలు, మైనార్టీలకు లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విద్వేష బుల్డోజర్లను తక్షణమే ఆపండి. వాటికి బదులు ప్రధాని మోదీ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాలి. బీజేపీ అధినేత నేతలు వారి హృదయాల్లోని ద్వేషాన్ని కూల్చేసుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు. జేసీబీ.. జిహాద్ కంట్రోల్ బోర్డ్: బీజేపీ జేసీబీ అంటే జిహాద్ కంట్రోల్ బోర్డ్ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ తీరుపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటిని, బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని, హింసకు కారకులైన బీజేపీ నేతల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలి. అప్పుడే మత హింస, అల్లర్ల నుంచి దేశానికి విముక్తి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం) -
మత ఘర్షణలు.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
మత హింసకు సంబంధించిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం శాంతి భద్రతల మీద ఉన్నతాధికారుల సమీక్షలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం యోగి. ఈద్, అక్షయ తృతీయ ఒకేరోజు వస్తున్న నేపథ్యం, వరుస పెట్టి పండుగలు ఉన్న కారణంతోనే అనుమతులు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే లౌడ్‌స్పీకర్ల ఉపయోగం.. ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతీఒక్కరికీ వాళ్ల వాళ్ల మతవిశ్వాసాలకు తగ్గట్లు ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత పోలీసులకూ ఉంటుంది. కాబట్టి, మతపరమైన సంస్థలు.. శాంతి, భద్రతలను పరిరక్షణలో భాగంగా ప్రతిజ్ఞ చేస్తూ.. ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతులు తీసుకోవాల్సిందే. అలాగే మత సంప్రదాయాలను అనుసరించి పండుగలకు మాత్రమే ఈ అనుమతులు ఉంటాయి. కొత్త కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని సీఎం యోగి.. పోలీస్ శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమి, హానుమాన్ జయంతి శోభాయాత్రల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మత ఘర్షణలపై కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుబడుతూ.. 13 పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నవాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ జాగ్రత్త పడుతోంది. చదవండి: ఇది యూపీ.. ఏం జరిగిందో చూశారుగా! -
పూజలకు హింసతో సంబంధం ఏంటి?: సీఎం నితీశ్‌కుమార్
పాట్నా: తాజా మత ఘర్షణల మీద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను ప్రతీ వర్గం పక్కనపెట్టాలని, అసలు దేవుడి ప్రార్థనలకు హింసతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. శ్రీ రామ నవమి సందర్భంగా దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా.. సోమవారం సీఎం నితీశ్‌కుమార్‌ను కోరింది. ‘‘వర్గాల మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. దేవుళ్లను ఆరాధించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతేగానీ మనలో మనం కొట్టుకోవడం కాదు. పూజించడం మీద అంత నమ్మకం ఉంటే.. సరిగ్గా పూజలు చేసుకోవాలి. అంతేగానీ పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి? ప్రార్థనలకు హింసకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటివి బీహార్‌లో జరిగితే ఊరుకునేదే లేదు’’ అని సీఎం నితీశ్ కామెంట్ చేశారు. एक दूसरे से झग़ड़ा का पूजा से कोई सम्बंध हैं ??आपको पूजा करना हैं तो पूजा कीजिएगा ना कि झगड़ा ये कहना हैं @NitishKumar का @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/LA4xWtMKG0 — manish (@manishndtv) April 18, 2022 మరోవైపు మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు తమ మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని నితీష్ కుమార్ అన్నారు. ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. దీని గురించి మనలో మనం గొడవ పడకూడదు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలి. ఎవరైనా ఈ విషయాలపై వివాదాలు సృష్టిస్తే, అతనికి మతంతో సంబంధం లేదు అని అన్నారాయన. ఇదిలా ఉండగా.. రామ నవమి సందర్భంగా రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్, బీహార్ మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ.. శ్రీ రాముడిపై ప్రతికూల కామెంట్లు చేయగా, ఇప్పుడు మరో మిత్రపక్ష నేత, సీఎం నితీశ్ సైతం పూజల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. -
ఢిల్లీ జహంగీర్‌పురిలో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. జహంగీర్‌పురిలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా.. మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకుగానూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటిదాకా 23 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి వాడీవేడిగానే ఉందక్కడ. ఇదిలా ఉండగా.. నిందితుల్లో ఒకడైన సోనూ భార్యను పోలీసులు ఇంటరాగేషన్ పేరిట అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో.. యాభై మంది మహిళలను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. శనివారం అల్లర్లు జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే.. తాజా అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఇక శనివారం జరిగిన అల్లర్లకు ఘటనకు సంబంధించి.. దేశీ పిస్టోల్స్‌తో పాటు ఐదు కత్తులను పోలీసులు నిందితుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. నిందితులను సైతం కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా వెల్లడించారు. -
యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి
లక్నో: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా.. పలు రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ అల్లర్లను ప్రస్తావిస్తూ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా.. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని, కనీసం నువ్వా-నేనా అనే స్థాయి కొట్లాట ఘటనలు వెలుగులోకి రాలేదని అన్నారు. ‘‘పాతిక కోట్ల జనాభా ఉన్న యూపీలో శ్రీరామ నవమి ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 800 ఉరేగింపు ఉత్సవాలు జరిగాయి. అదే సమయంలో రంజాన్, ఉపవాసాలు, ఇఫ్తార్ కార్యక్రమాలు జరిగాయి. అయినా కూడా ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఇది ఉత్తర ప్రదేశ్ కొత్త అభివృద్ధి ఎజెండాకు గుర్తు. ఇక్కడ అల్లర్లకు, శాంతిభద్రతల విఘాతానికి స్థానం లేదు. గుండాగిరి ఊసే లేదు’’ అని సీఎం యోగి పేర్కొన్నారు. यहां दंगा-फसाद के लिए कोई जगह नहीं है... pic.twitter.com/LWkPZznsVx — Yogi Adityanath (@myogiadityanath) April 12, 2022 ఈ ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా.. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే యూపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా.. ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. అయితే.. సీతాపూర్ జిల్లాలో భజరంగ్ ముని అనే మహంత్.. ముస్లిం అమ్మాయిలను ఉద్దేశిస్తూ.. చేసిన రేప్ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన్ని అరెస్ట్ చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మతపరమైన అంశాలను ముడిపెట్టడం దారుణం
ముంబై: ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్నప్పుడు మతం ప్రాతిపాదికన ఆటగాళ్లకు అవకాశమిచ్చినట్లు వస్తున్న ఆరోపణలను టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఖండించాడు. కాగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై చూపించిన పక్షపాతం కారణంగా వసీం జాఫర్ మంగళవారం ఉత్తరాఖండ్ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తేవడం చాలా బాధ కలిగించింది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నిజానికి జై బిస్టాను కెప్టెన్‌ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్‌ను కెప్టెన్‌ను చేయమని సూచించారు. ఇక్బాల్‌కు ఐపీఎల్లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్ చేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు.. ఆయన్ని రావాలంటూ నేను ఎప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్ అబ్దుల్లాతో నాతో పాటు మేనేజర్ అనుమతి కోరాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాకే మేము ప్రార్థనలు చేశాము. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్ చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ తెలిపారు. కాగా వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. చదవండి: 'ముందు మీ కమిట్మెంట్ చూపించండి' రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం -
రామమందిర భూమిపూజ.. చెలరేగిన అల్లర్లు
గువాహటి : అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిరం భూమి పూజ కార్యక్రమ వేడుకల సందర్భంగా అస్సాంలో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. సోనిత్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ అల్లర్ల సందర్భంగా దుండగులు ఓ కారు, మూడు మోటారు సైకిళ్లను దహనం చేసినట్లు అధికారులు గుర్తించారు. గువాహటిలోని పలు ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎవరూ గుమికూడరాదని అధికారులు పేర్కొన్నారు. రామమందిర శంకుస్థాపన నేపథ్యంలో అస్సాంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రత సమస్యలు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రజలెవరూ ర్యాలీలు చేయరాదని హెచ్చరించారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన) -
నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్
గాంధీనగర్: 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్ నానావతి కమిషన్ స్పష్టం చేసింది. గుజరాత్ హోం శాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా బుధవారం నానావతి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కమిషన్ ఈ నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది . 2002 అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నానావతి, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతాల కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని పరిశీలించాక... గోద్రా సంఘటన తరువాత చెలరేగిన మతఘర్షణలు ఆ ఘటన తాలూకూ ప్రతిస్పందనగా మాత్రమే జరిగాయని భావిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌లకు చెందిన స్థానిక సభ్యులు వారి నివాసప్రాంతాల్లో జరిగిన గొడవల్లో పాల్గొన్నారని వివరించింది. అహ్మదాబాద్ నగరంలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అత్యవసరమైన చొరవ, సామర్థ్యాన్ని పోలీసులు చూపలేదని అభిప్రాయపడింది. తప్పు చేసిన పోలీసు అధికారులపై విచారణ, చర్యలపై విధించిన స్టేను కమిషన్ ఎత్తివేయడం గమనార్హం. 2002లో మత ఘర్షణల తరువాత ఏర్పాటైన నానావతి కమిషన్ తన తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదిక 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది. -
ఆ మతఘర్షణలపై అమిత్ షా సీరియస్..!
న్యూఢిల్లీ: హస్తినలోని హవజ్ ఖాజీ ప్రాంతంలో గత ఆదివారం సాయంత్రం మతఘర్షణలు జరగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పాతనగరంగా పేరొందిన చాందినీచౌక్ హవజ్ ఖాజీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పార్కింగ్ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఇది చినికిచినికి గాలివానగా మారి.. మతఘర్షణలు, హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో స్థానికంగా ఉన్న ఆలయం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు కమిషనర్ అముల్యా పట్నాయక్‌ను పిలిపించుకొని మరీ.. ఈ ఘటనపై ఆరా తీశారు. హవజ్ ఖాజీ ఘటన గురించి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేదానిపై సాధారణ బ్రీఫింగ్లో భాగంగా హోంమంత్రికి సమాచారం తెలియజేశానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని.. హోంమంత్రి షాతో భేటీ అనంతరం పట్నాయక్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఒక మైనర్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, నేరగాళ్లకు ఈ ఘటనలో ప్రమేయముందని భావిస్తున్నామని ఢిల్లీ సీపీ పట్నాయక్ తెలిపారు. గత ఆదివారం పండ్ల వ్యాపారి సంజీవ్ గుప్తా.. ఆస్ మహమ్మద్ అనే వ్యక్తుల మధ్య జరిగిన గొడవ.. ఈ మతఘర్షణలకు దారితీసింది. సంజీవ్ గుప్తా ఇంటిముందు ఆస్ మహమ్మద్ తన కారును పార్కు చేయడం.. దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గుప్తాపై మహమ్మద్ తన మనుషులతో వచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మహమ్మద్‌ను, మరికొంతమందిని అరెస్టు చేశారు. దీంతో ఆయన విడుదల చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఒక వర్గం వారు ధర్నాకు దిగడం.. ఈ ఘర్షణలకు దారితీసినట్టు భావిస్తున్నారు. -
మత ఘర్షణల్లో 1,605 మంది మృతి
నోయిడా: భారత్‌లో 2004 నుంచి 2017 వరకు జరిగిన 10,399 మత ఘర్షణల్లో ఏకంగా 1,605 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,723 మంది గాయాలపాలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద నోయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి, ఆర్టీఐ కార్యకర్త అమిత్ గుప్తా అభ్యర్థించిన మేరకు కేంద్ర హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క 2008లోనే అత్యధికంగా 943 మతసంబంద కేసులు నమోదయ్యాయని, ఆ ఏడాదిలోనే అధికంగా 167 మంది చనిపోయారని కేంద్రం పేర్కొంది. అత్యంత తక్కువ మత కేసులు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో 91 మంది మరణించారని, 1,899 మంది గాయపడ్డారని తెలిపింది. 2017లో 822 కేసులు నమోదవగా, ఆ ఏడాది ఘర్షణల్లో 111 మంది చనిపోయారు. -
‘ఘర్షణలు రెచ్చగొట్టేవారిని వదిలిపెట్టం’
షిల్లాంగ్: మేఘాలయలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలను కొందరు కావాలనే ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆరోపించారు. గురువారం షిల్లాంగ్‌లో ఖాసీ పిల్లాడిపై ఒక సిక్కూ మహిళ దాడి చేయడంతో ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే. పంజాబ్ వాసులు నివాసముంటున్న మావ్‌లాంగ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, ఘర్షణలను అదుపు చేయడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులకు కొంతమంది డబ్బులు, మద్యం అందిస్తున్నారని సీఎం సంగ్మా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను ప్రోత్సహిస్తున్న పంజాబీలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయలో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవడానికి తమ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పంపుతామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కమిటీ నివేదిక ఆధారంగా పంజాబ్ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. మేఘాలయలోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. షిల్లాంగ్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయని, గురుద్వారపై ఎవరూ దాడి చేయలేదనీ, వదంతులు నమ్మొద్దని ట్వీట్ చేశారు. Beware of rumour-mongers & troublemakers. There was no damage to any Gurdwara or other institutions belonging to the Sikh Minority in Meghalaya. Law & Order situation is under control and the State Govt is extremely vigilant & settling the case. — Kiren Rijiju (@KirenRijiju) June 3, 2018 -
ఇలా చేస్తే ఊరు విడిచి వెళ్లిపోతా...
సాక్షి, కోల్‌కతా : ‘నా కొడుకు చనిపోయాడు.. అలాగని మరో వ్యక్తి కొడుకు చనిపోవాలని నేను కోరుకోను. ఇంకోసారి ఇలాంటి రక్తపాతం జరిగితే నేను ఊరు విడిచి వెళ్లిపోతా’ . ఇది పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మారణకాండలో కుమారుడిని పోగొట్టుకున్న ఓ తండ్రి ఆవేదన. అసన్సోల్ పట్టణంలోని మసీదు ఇమామ్ మౌలానా ఇందాదుల్ రషీదీ కుమారుడు షిబ్‌తుల్లా రషీదీ గత ఆదివారం చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మరణించాడు. తాను అసన్సోల్లో శాంతిని మాత్రమే కోరుకుంటున్నానని, అందరూ శాంతంగా ఉండాలని గురువారం కొడుకు అంత్యక్రియలకు వచ్చిన వారిని ఆయన కోరారు. అధికార పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఇందాదుల్ వ్యాఖ్యలతో అక్కడ శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన కుమారుడు షిబ్‌తుల్లా మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని, పోలీసులు సరైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు అభిప్రాయపడ్డారు. -
ఇక నితీష్ కుమార్ పని అయిపోయింది..
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ నవమి రోజున బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో జరిగిన ఘర్షణలకు ముఖ్యమంత్రే కారణమని, ఇక నితీష్ కుమార్ పని అయిపోయిందని ఆయన అన్నారు. గడ్డి స్కాం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న లాలూ ప్రసాద్‌ను అనారోగ్యం కారణంగా పోలీసులు బుధవారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రి బయట లాలూ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంటలు పెట్టి మత ఘర్షణలను ప్రేరేపించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పని ఇక అయిపోయిందని విమర్శించారు. ఇది ఇలా ఉండగా శ్రీరామ నవమి పర్వదినం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ఎక్కువగా ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ-జేడీయూ కూటమి విఫలమైందని, బీజేపీ నాయకులు మత ఘర్షణలను ప్రోత్సాహిస్తూన్నారంటూ బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. -
మత ఘర్షణల నుంచి రాజకీయాల వైపు...
కొలంబో : ముస్లిం వ్యతిరేక అల్లర్లు చెలరేగి మత ఘర్షణలకు దారి తీయగా, ఎమర్జెన్సీ తర్వాత శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఘర్షణలకు కారణమైన సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. (ఘర్షణలకు కారణం ఏంటంటే...) మహసన్ బాలకాయ అనే సంస్థ ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, వీడియోలు పోస్టు చేయటంతో అల్లర్లకు చెలరేగాయి. ఆ సంస్థే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించింది. ‘సింహళీయుల గౌరవాన్ని కాపాడే రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా లేవు. అందుకే మిగతా సింహళ సంస్థలను కలుపుకుని మహసన్ బాలకాయ పేరిట పార్టీని స్థాపించబోతున్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, మహసన్ బాలకాయ సంస్థపై మత ఘర్షలతోపాటు ముస్లింలకు చెందిన స్థలాలను కబ్జా చేసిందంటూ పలు కేసులు ఉన్నాయి. క్యాండీ జిల్లాలో 70 శాతం ఉన్న సింహళ బౌద్ధులకు, 10 శాతం ఉన్న ముస్లింలకు మధ్య మార్చి6వ తేదీన అల్లర్లు చెలరేగటం.. అవి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించటంతో ఎమర్జెన్సీని విధించింది శ్రీలంక ప్రభుత్వం. చివరకు పరిస్థితి సర్దుమణగటంతో మార్చి 18న అత్యవసర పరిస్థితిని ఎత్తేసినట్లు ప్రకటించింది. -
దసరా-మొహర్రం సందర్భంగా అల్లర్లు
సాక్షి, లక్నో/రాంచీ : దసరా, మొహర్రం పర్వదినాల సందర్భంగా జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 దసరా పండుగ కావడం.. అదేవిధంగా అక్టోబర్ 1న మొహర్రం పర్వదినం రావడంతో.. ఇరు వర్గాల మధ్య ఊరేగింపు సందర్భంగా వచ్చిన వివాదాలతో ఘర్షణలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఎవరూ మరణించకున్నా.. 12 మంది గాయాలపాలయ్యారు.. అలాగే ఆరు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇరు వర్గాల మధ్య మొదట ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పరం పుర్వ గ్రామంలో అల్లర్లు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో.. మొహర్రం ఊరేగింపును ముస్లింలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడ హిందువులు దసరా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో.. ఆరుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని అల్లర్లను నియంత్రిణలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా వెళ్లే దారిలో కాకుండా ఈ ఏడాది మొహర్రం ఊరేగింపుకు మరో దారిలో వెళ్లడంతో ఈ అల్లర్లు జరిగినట్లు పురం పుర్వ ఇన్స్పెక్టర్ జనరల్ (కాన్పూర్ జోన్) అలోక్ సింగ్ చెప్పారు. అల్లర్లు జరిగే అవకాశముందని తెలియడంతో.. ముందు జాగ్రత్తగా నాలుగు కంపెనీల ఆర్మ్డ్ కానిస్టేబుల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇటువంటి సంఘటనే ఇదే జిల్లాలోని రవత్‌పూర్, బలిలా, సికిందర్‌పూర్ ప్రాంతాల్లో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మరో ఆరుమందికి గాయాలు అయినట్లు పోలీసులు చెప్పారు. బీహార్‌లోని జామై ప్రాంతంలో దుర్గా నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నవారిపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. జార్ఖండ్‌లోని జమ్షెడ్పూర్, రాంచీ, దల్తోన్గంజ్ ప్రాంతాల్లో ఇరను వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. -
పశ్చిమ బెంగాల్లో మతఘర్షణలు
కోల్‌కతా:పశ్చిమ బెంగాల్లో మతఘర్షణలుఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్ని అగౌరవపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ వల్ల సోమవారం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల లకోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400 మంది బీఎస్ఎఫ్ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. గవర్నర్ బెదిరించారు.. మమత: మతఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి తనను బెదిరించారనీ, అవమానించారని మమత సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆయన నన్ను ఫోన్లో బెదింరించారు. బీజేపీ తాలూకా స్థాయి నాయకుడిలా ఆయన మాట్లాడిన మాటలు నన్ను అవమానపరిచాయి’ అని విలేకరులతో అన్నారు. ‘ఆయన గవర్నర్ పదవికి నామినేట్ అయినవారని గుర్తుంచుకోవాలి. ఎవరి దయతోనో నేనిక్కడ లేను. ఆయన నాతో మాట్లాడిన తీరు చూసి ఒక్కసారిగా సీఎం పదవిని వదిలేయాలని అనిపించింది’ అని పేర్కొన్నారు. ‘కేంద్రంలోని అధికార పార్టీకి ఒక ఎజెండా ఉంది. వారు మనుషులను చంపడానికి గోరక్ష బృందాలను ఏర్పరిచారు. అల్లర్లు సృష్టించడానికే విద్వేష బృందం ఏర్పాటైంది. ‘హిందూ సంహతి’ పేరుతో అల్లర్లు చెలరేగుతున్నాయి’ అని అన్నారు. -
నేరమే అధికారమై ప్రజలను వేటాడుతున్న చోట...!
అవలోకనం సామూహిక హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వాటిలో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత మనుషులను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఢిల్లీలో సిక్కుల ఊచకోత, భోపాల్ విషవాయువు లీక్, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర మత ఘర్షణలు, గుజరాత్ మారణకాండ వంటి ఘటనల్లో బాధితులు నేటికీ తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. మన సామూహిక జాతీయ విషాదాలు అనేకం కాబట్టి, వాటిని లెక్కిం చడం కూడా కష్టమే అవుతుంది. నేను 40ల మధ్య వయసులో ఉన్నాను. వేలాదిమంది హత్యకు దారితీసిన కనీసం అయిదు ఘటనలు కలుగ జేసిన గాయాలు నాకు వ్యక్తిగతంగా కూడా గుర్తున్నాయి. ఈ మారణ కాండలు ఏవంటే , 2 వేలమంది ముస్లింలను చంపిన 1983 నాటి నెల్లి హత్యాకాండ, 1984 డిసెంబర్లో 3 వేలమంది మరణాలకు దారితీసిన భోపాల్ విషవాయు ప్రమాదం. తర్వాత అదే నెలలో ఢిల్లీలో 2 వేల మంది సిక్కుల ఊచకోతకు దారితీసిన ఇందిరాగాంధీ హత్యానంతర దాడులు, బాబ్రీమసీదును కూల్చివేసిన అనంతరం 1992లో దేశ వ్యాప్తంగా వేలాదిమంది హత్యకు దారితీసిన ఘటనలు (ఆనాటికి నేను 20లలో ఉండేవాడిని, నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు పూర్తిగా బోధపడేది). తర్వాత 2002లో గుజరాత్లో కనీసం వెయ్యిమంది హత్యకు దారితీసిన హింసాత్మక దాడులు. దేశంలో జరిగిన మరికొన్ని ప్రధాన ఘటనలను వదిలిపెట్టాననడంలో సందే హమే లేదు. బోటు ప్రమాదాల్లో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘట నలు జరిగాయి. మరోవైపున ప్రకృతి వైపరీత్యాలలో వేలాదిమంది చనిపోతున్నా, ప్రభుత్వాలు తమ పౌరులకు ఎలాంటి సహకారం అందించలేని పరిస్థితిలో ఉండేవి. నేనిక్కడ వేలాది కశ్మీరీల హత్య గురించి, పండిట్ల వలస గురించి పొందుపర్చడం లేదు. ఎందుకంటే, ఇవి ఒక ఘటనలో కాకుండా నెలలు లేదా సంవత్సరాల పరిణామ క్రమంలో జరుగుతూ వచ్చాయి. ఇక్కడ నేను పొందుపర్చిన హింసాత్మక సందర్భాల్లో బాధితులకు న్యాయం అనేది అంత సులభంగా దక్కలేదు. వీటిలో ఒక్కటంటే ఒక్క ఘటన ఫలితాలను, వాటి పర్యవసానాలను పరిశీలించినట్లయితే ఒక జాతిగా మనం పూర్తిగా పతన మైన విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వీటిని నిష్పక్షపాత దృష్టితో మనం చూసినట్లయితే, తీవ్రనేరాలకు పాల్పడిన వారిపై తగిన విధంగా దర్యాప్తు చేసి, వారిని జవాబుదారులను చేయడంలో మన వైఫల్యం స్పష్టమవుతుంది. మన దేశంలో జరుగుతున్న సామూహిక హింసాత్మక ఘటనలకు సంబం ధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, హింసా ఘటనల్లో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత ప్రజలను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఉదాహరణకు, పై ఘటనల్లో చివర పేర్కొన్న గుజరాత్ హింసాకాండకు సంబం ధించి తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. ఈ ఉదాహరణను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ ఘటన గురించి నాకు బాగా తెలుసు. పైగా గుజరాత్ హింసాకాండకు చెందిన కొన్ని అంశాలను పరిశీలించడానికి భారత సంపాదక మండలి పంపిన త్రిసభ్య కమిటీలో నేనూ భాగం పంచుకున్నాను. ఢిల్లీలో 1984లో సిక్కుల హత్యాకాండపై దృఢవైఖరితో వ్యవహరించడం ద్వారా ఈ నిరాశా నిస్పృహల వలయాన్ని ఛేదించడానికి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. సిక్కుల ఊచకోత ఘట నలో పాలుపంచుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండుగులను ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ వచ్చారని బీజేపీ చాలాకాలంగా ఆరోపిస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టాక, ఎన్డీయే కూటమి ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించింది. ఢిల్లీలో హింసాకాండ సందర్భంగా జరిగిన దాడులపై తగిన విధంగా దర్యాప్తు జరగలేదని, దర్యాప్తు రూపాన్ని మార్చేందుకోసం ఒక కపట ప్రయత్నం చేశారని ఈ కమిటీ కనుగొంది. దీంతో ఇంతవరకు పరిశోధన జరగని కేసుల్లో తాజా ఎఫ్ఐఆర్ నివేదికలు, నేరారోపణలను నమోదు చేయడానికి ఎన్టీయే ప్రభుత్వం ఒక త్రిసభ్య బృందాన్ని ఏర్పర్చింది. మూడు దశాబ్దాల క్రితం ఊచకోతకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో ఈ బృందం నిర్ణయాత్మకంగా, దృఢంగా, శరవేగంగా స్పందిస్తుందని నేను ఆశించాను. ఢిల్లీ హత్యాకాండకు సంబంధించిన కేసులు చాలా పాతబడిపోయాయని, వాటిని పునరుద్ధరించడం చాలా కష్టమని పలువురు భావిస్తున్నప్పుడు, ఢిల్లీ హింసాకాండ బాధ్యులను శిక్షించినట్లయితే, భారతీయుల రక్తాన్ని చిందిస్తున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టమని మనలో చాలా మందికి అది కాస్త నమ్మకాన్నిచ్చి ఉండేది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కమిటీని నియమించారు. ఐపీఎస్ అధికారి ప్రమోద్ అస్థానా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందంలో మరొక పోలీసు అధికారి కుమార్ గ్యానేష్, రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి రాకేష్ కపూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ హత్యాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేసిన లేదా తగిన విధంగా పరిశీలించని సాక్ష్యాధారాల పరిశీలనకోసం ప్రభుత్వం ఈ ముగ్గురికీ ఆరునెలల సమయాన్ని ఇచ్చింది. ఆరు నెలల తర్వాత అంతవరకు వారేం చేశారన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే కమిటీ విచారణను మరికొంత కాలం పొడిగించింది. కొన్ని వారాల క్రితం నాటి కారవాన్ సంచికలోని ఒక నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించి, ఈ బృందం సాధించిందేమీ లేదని తేల్చేసింది. ఢిల్లీ మారణకాండ బాధితులకు, వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది హెచ్ఎస్ ఫోల్కా చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. ఆయనిలా అన్నారు. ‘‘సిట్‌ను ప్రభుత్వం ఏర్పర్చినప్పుడు దాన్నుంచి చాలా ఆశించాం. కానీ వీరు ఈ కేసుకు సంబంధించిన ఏ అంశంపైనా అడుగు ముందు కేసింది లేదు. ఆ హత్యాకాండ బాధితుల్లో ఏ ఒక్కరినీ వీరు కలిసిన పాపాన పోలేదు. బాధితుల్లో ఒకరు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక ఫిర్యాదు పంపి నప్పుడు, ఏ వ్యాఖ్య చేయకుండానే దాన్ని వెనక్కి పంపించారు. కనీసం ఆ ఫిర్యాదును వారు అంగీకరించలేదు.’’ వాస్తవానికి సిట్ ఏర్పాటే ఒక మాయ అని, దాన్నుంచి దేన్నీ కోరుకోకుండా, ఆశించకుండా, కేవలం తాము సిట్‌ను ఏర్పర్చామన్న పేరు కొట్టేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆ లాయర్ పేర్కొన్నారు. ఇది నిజం కాదనే నేను భావిస్తున్నాను. సిక్కులపై హింసాకాండను నిరోధించడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత విషయంలో సందేహమే లేదు. ఆ పార్టీకి చెందినవారే స్వయంగా నాటి మారణకాండలో పాల్గొన్నారంటూ వారిపై తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేరస్తులపై దృఢంగానూ, నిర్ణయాత్మకంగానూ వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తన వైఖరిని ప్రదర్శిస్తే, భారతీయులకు అది గొప్ప సేవ చేసినట్లే. కనీసం ఈ ఒక్క మారణకాండకు సంబంధించినంతవరకయినా న్యాయం సాధ్యమేనని ప్రభుత్వ దృఢవైఖరి సూచిస్తే అదే చాలు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులు
జమ్మూ: జమ్మూ - కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ప్రజల మధ్య ఘర్షణ చెలరేగడంతోనే కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. నిరసనకారులు జిల్లా మెజిస్ట్రేటు వాహనంపై దాడులు చేశారు. ఈ దాడిలో మెజిస్ట్రేట్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాకుండా ఈ ఘర్షణలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. బారి బ్రాహ్మణ ప్రాంతంలో మత గ్రంథాల మీద ఆరోపణలతో రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. అది కాస్తం పెద్దదై నిరసనల హోరుతో మెజిస్ట్రేట్ కార్యాలయం దాకా వెళ్లింది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు కల్పించుకుని కర్ఫ్యూ విధించారు. -
వెల్‌లోకి దూసుకెళ్లి రాహుల్ గాంధీ నిరసన
-
వెల్‌లోకి దూసుకెళ్లి రాహుల్ గాంధీ నిరసన
న్యూఢిల్లీ : లోక్‌సభలో బుధవారం మత ఘర్షణలపై గందరగోళం చెలరేగింది. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న వరుస మతకలహాలపై సభ దద్దరిల్లింది. మత ఘర్షణలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. మత హింసల నిరోధక బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో వెల్లోనికి దూసుకెళ్లారు. మతకలహాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆయనతో పాటు ఇతర ఎంపీలు కూడా స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా రాహుల్ స్పీకర్ సుమిత్రా మహజన్పై ఆరోపణలు చేశారు. సభ ఏకపక్షంగా నడుపుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. సభలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన ఆయన అన్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారంటూ రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను వాయిదా వేశారు. వాయిదా తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. దాంతో మత ఘర్షణలపై నోటీసులు ఇస్తే చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అధికారం కోల్పోయిన నిస్పృహతోనే ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు. -
ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్!
డెహ్రాడూన్: ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలను నకిలీ ఖాతాతో పోస్ట్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్దమ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఓ కమ్యూనిటిని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా, ట్యాగ్ చేసిన లలిత్ కోలియా అనే యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని సహారాపూర్ మత ఘర్షణలకు సంబంధించిన ఫొటోలని అధికారులు వెల్లడించారు. ఓ భూమి వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఫేస్ బుక్ పోస్ట్ లపై ఓ వర్గానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేసి..ఫేస్ బుక్ నుంచి తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ను కనుగొని యువకుడిని అరెస్ట్ చేశామని మీడియాకు పోలీసులు వివరించారు. -
పాతబస్తీలో తీవ్ర ఘర్షణలు
-
పాతబస్తీలో ఘర్షణలు
కిషన్‌బాగ్‌లోని సిక్ చావ్నీలో జెండా విషయమై వివాదం ఇరువర్గాల పరస్పర దాడులు.. రాళ్లు, కత్తులతో చెలరేగిన అల్లరి మూకలు పరిస్థితి విషమించడంతో కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ ముగ్గురు మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం ఘర్షణల్లో 28 మందికి గాయాలు.. మూడు ఇళ్లు దహనం.. 50 వాహనాలు ధ్వంసం సిక్ చావ్నీలో కర్ఫ్యూ... పాతబస్తీలో 144 సెక్షన్ అమలు సంయమనం పాటించాలని ప్రజలకు గవర్నర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పాతబస్తీ సిక్ చావ్నీలో ఒక జెండా విషయమై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. వాగ్వాదం నుంచి మొదలై రాళ్లు, కత్తులతో దాడుల వరకూ వెళ్లింది. రెచ్చిపోయిన అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, ఇళ్లనూ తగులబెట్టాయి. పరిస్థితులు పూర్తిగా విషమిస్తుండడంతో.. బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 28 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణల నేపథ్యంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తలెత్తిన కిషన్‌బాగ్ సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దీనికితోడు పాతబస్తీ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సిక్ చావ్నీలోని హర్షమహల్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఓ వర్గం వారు కొన్నేళ్ల క్రితం పవిత్ర జెండా దిమ్మెను నిర్మించుకున్నారు. పర్వదినాల్లో అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇక్కడి జెండాలను దహనం చేశారు. ఆ జెండాగద్దెని నిర్మించిన వర్గం వారు జెండాల దహనం విషయాన్ని తెలుసుకుని.. బుధవారం ఉదయం 6 గంటలకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.. ఇది తెలిసిన మరో వర్గం వారు కూడా భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా దిమ్మెపై కొత్త జెండాను ఏర్పాటు చేశారు. కానీ, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో.. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శంషాబాద్, మాదాపూర్ డీసీపీలు రమేష్‌నాయుడు, క్రాంతిరాణాలు సిక్ చావ్నీకి చేరుకుని ఇరువర్గాలకూ సర్దిచెప్పేందుకు దాదాపు గంట పాటు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. మరింత విషమించి ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. కనబడిన వాహనాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఇళ్లు దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన వారితో పాటు ఎనిమిది మంది పోలీసులూ గాయపడ్డారు. చివరికి పరిస్థితిని అదుపుచేసేందుకు బందోబస్తు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. బుల్లెట్ గాయాలైన మరో తొమ్మిది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు హుటాహుటిన అదనపు బలగాలను మోహరించారు. సిక్ చావ్నీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. పాతబస్తీ ఉన్న దక్షిణ మండలంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. కాగా, పాతబస్తీలోని పరిస్థితులను గవర్నర్ నరసింహన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్ చావ్నీలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, బాధ్యులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు గవర్నర్‌కు వివరించారు. పుకార్లను నమ్మవద్దని, పూర్తిగా సంయమనం పాటించాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండండి: డీజీపీ సాక్షి, హైదరాబాద్, అనంతపురం: హైదరాబాద్‌లో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లను అదుపు చేయడానికే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ సిక్‌చావ్నీలో జరిగిన ఘర్షణలపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షించారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్‌చావ్నీలో ఇరు వర్గాల మధ్య దీర్ఘకాలంగా విద్వేషాలున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రతలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని ఆయన అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది. -
ముజఫర్ నగర్ అల్లర్లు
-
అమర్నాథ్ యాత్ర రెండవ రోజు రద్దు
కిష్టవార్ జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రెండవ రోజు కూడా రద్దు అయిందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. అలాగే ఆ యాత్రకు కొత్త బృందాలను ఏవరిని అనుమతించడం లేదని తెలిపారు. దీనితోపాటు పూంచీ జిల్లాలోని మండి పర్వత సానువుల్లోని ప్రముఖ శివ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు చేసే బుద్ద అమరనాథయాత్రను కూడా ఈ రోజు రద్దు చేసినట్లు చెప్పారు. రాజోరి జిల్లాలో ఏర్పాటు చేసిన కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ,కాశ్మీర్లో కిష్టవార్ జిల్లాలో గత రెండు రోజుల క్రితం మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని సమాచారం అందటంతో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం కర్ప్యూ విధించింది. అందులోభాగంగానే శనివారం అమర్యాత్రను రద్దు చేసింది.