ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్! | Uttarakhand youth jailed for inflammatory Facebook pictures | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్!

Published Tue, Jul 29 2014 1:58 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్! - Sakshi

ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలు..యువకుడి అరెస్ట్!

డెహ్రాడూన్: ఫేస్ బుక్ లో వివాదస్పద ఫొటోలను నకిలీ ఖాతాతో పోస్ట్ చేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్దమ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఓ కమ్యూనిటిని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా, ట్యాగ్ చేసిన లలిత్ కోలియా అనే యువకుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని సహారాపూర్ మత ఘర్షణలకు సంబంధించిన ఫొటోలని అధికారులు వెల్లడించారు. 
 
ఓ భూమి వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఫేస్ బుక్ పోస్ట్ లపై ఓ వర్గానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేసి..ఫేస్ బుక్ నుంచి తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ను కనుగొని యువకుడిని అరెస్ట్ చేశామని మీడియాకు పోలీసులు వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement