లోక్సభలో బుధవారం మత ఘర్షణలపై గందరగోళం చెలరేగింది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వరుస మతకలహాలపై సభ దద్దరిల్లింది. మత ఘర్షణలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పట్టుబట్టారు. మత హింసల నిరోధక బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభలో వెల్లోనికి దూసుకెళ్లారు. మతకలహాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆయనతో పాటు ఇతర ఎంపీలు కూడా స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా రాహుల్ స్పీకర్ సుమిత్రా మహజన్పై ఆరోపణలు చేశారు. సభ ఏకపక్షంగా నడుపుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. సభలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన ఆయన అన్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారంటూ రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను వాయిదా వేశారు. వాయిదా తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. దాంతో మత ఘర్షణలపై నోటీసులు ఇస్తే చర్చకు అనుమతి ఇస్తామని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అధికారం కోల్పోయిన నిస్పృహతోనే ఆయన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ అన్నారు.
Published Wed, Aug 6 2014 2:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement