‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం | We Were 100 Families, Only 15 Remain: Migrants In Fear At Gurugram | Sakshi
Sakshi News home page

Haryana Violence: 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం

Published Thu, Aug 3 2023 9:37 AM | Last Updated on Thu, Aug 3 2023 10:20 AM

We Were 100 Families, Only 15 Remain: Migrants In Fear At Gurugram - Sakshi

గురుగ్రామ్‌: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా అట్టడుకుతోంది. నూహ్‌ జిల్లాల్లో చెలరేగిన హింసతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్‌లలో 144 సెక్షన్‌ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు.

ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్‌లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. బజరంగ్‌ దళ్‌ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చి గురుగ్రామ్‌లో నివసిస్తున్న 100 ముస్లిం కుటుంబాల్లో.. ప్రస్తుతం తాము 11 మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఓ ముస్లిం వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్ల కారణంగా తాము ఎక్కడికి పోలేని పరిస్థితి తలెత్తిందని, సొంత ఊరు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చులు కూడా లేవని కన్నీటి పర్యంతమయ్యాడు 25 ఏళ్ల షమీమ్‌ హుస్సేన్‌...

చదవండి: Haryana communal violence: బలగాల్ని దింపండి

ఆయన మాట్లాడుతూ.. ‘గత సాయంత్రం కొంతమంది గుంపు వచ్చి, రెండు రోజుల్లో ఇక్కడున్న ముస్లింలందరూ ఖాళీ చేయాలని బెదిరించారు. రోడ్డు మీదకు వెళ్తే పేరు అడిగి కొడుతున్నారు. తిరిగి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అప్పు చెల్లించాల్సి ఉంది. నాకేం జరిగినా పర్లేదు. కానీ నాకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. మామల్ని కాపాల్సిందిగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని ఆర్థిస్తున్నానంటూచేతులు జోడించి వేడుకున్నాడు.

మా కుటుంబం జీవనోపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చి కేవలం ఏడు రోజులు మాత్రమే అయ్యింది. రెండు రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఉద్యోగం దొరకగా.. ఇంకా జీతం ఇవ్వలేదు. నా ఏడాది వయస్సున కొడుకు పేరు అలీషాన్‌. అల్లరి మూకలు వచ్చి నన్ను, నాభార్యను కొడతారని భయమేస్తోంది. ఇది తలుచుకొని భయపడి నా భార్య రెండు రోజులుగా ఏడుస్తోంది. సొంత ఊరిలోనూ ఉపాధి లేకపోవడంతో తిరిగి వెళ్లలేం.. ఇక్కడా ఉండలేకపోతున్నాం.. ఎలా బతకాలి’ ’ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ వాపోయాడు.
చదవండి: మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్‌

దీనిపై గురుగ్రామ్‌ జిల్లా కమిషనర్‌ స్పందిస్తూ.. స్థానిక వలస కార్మికులను ఖాళీ చేయమని బెదిరించినట్లు వార్తలు అందాయని,  జిల్లా, పోలీసు అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వలస కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సున్నిత ప్రాంతాలు, ఇరు వర్గాల మతపరమైన ప్రదేశాలైన మసీదులు, దేవాలయాల చుట్టూ రాత్రిపూట మోహరింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రేపటి వరకు నగరంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement